SRM University
-
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు.. పోస్టర్ ఆవిష్కరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. దేశ నలుమూలల నుంచి కోడింగ్ పట్ల ఆసక్తిగల విద్యార్థులు ఎవరైనా ఈ కాంపిటిషన్లో పాల్గొనవచ్చు. ఈ పోటీలో టాప్ స్కోర్ సాధించిన వారికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అడ్మిషన్ లభిస్తుంది. వారికి నచ్చిన కోర్సు ఎంచుకోవచ్చు. ట్యూషన్ ఫీజుపై 100 శాతం వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. అలాగే రూ.లక్ష విలువ చేసే బహుమతులు అందుకోవచ్చు. నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఏపీ సచివాలయంలో ఆవిష్కరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్‌ను రెండు భాగాలుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మొదట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ) పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కోడింగ్ నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు టెస్టులు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. హ్యాకథాన్ పోటీ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 13న ప్రారంభమైంది. జనవరి 31 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చదవండి: అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్ -
ఫైటర్ పైలట్..బ్రైట్ అండ్ ఫైట్
‘అపజయాలు ఎదురైతే అధైర్యం వద్దు. వెనక్కి తగ్గవద్దు. అపజయం అంటే ఏమిటో కాదు... నేర్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నం’ ఆకాశంలో బొయ్య్మని విమానం చేసే శబ్దాలు వినడమన్నా, చిన్ని విమానాన్ని కళ్లు పెద్దవి చేసి చూడడమన్నా అందరు పిల్లల్లాగే రోషిణికీ ఇష్టం. ఆ ఇష్టం ఆమెను వైమానిక చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేలా చేసింది. ఠాణె (మహారాష్ట్ర)లోని లోక్ పురం పబ్లిక్ స్కూల్లో చదివే రోజుల్లో రోషిణికి వచ్చే సందేహాలు...ఆమె విజ్ఞాన దాహానికి నిదర్శనాలుగా ఉండేవి. మాజీ రాష్ట్రపతి, ఏరోస్పేస్ సైంటిస్ట్ అబ్దుల్ కలామ్ అంటే రోషిణికి ఎంతో అభిమానం. తాను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయడానికి, ఫైటర్ పైలట్ కావడానికి ఆయనే స్ఫూర్తి. మంచి మాటలు మంచి కలలను ఇస్తాయి. కలామ్ ఏం అన్నారు? ‘అపజయాలు ఎదురైతే అధైర్యం వద్దు. వెనక్కి తగ్గవద్దు. అపజయం అంటే ఏమిటో కాదు... నేర్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నం’ ... ఇదిమాత్రమే కాదు, ‘ప్రతి గురువు ఒకప్పుడు విద్యార్థే. ప్రతి విజేత ఒకప్పుడు పరాజితుడే. ప్రతి నిపుణుడు ఒకప్పుడు తొలి అడుగులు వేసిన వాడే. అందరూ నేర్చుకోవడం అనే వంతెనను దాటి వచ్చినవారే’ ఇలాంటి మాటలు రోషిణి ఆశయ బలానికి అవసరమైన ఉత్సాహాన్ని ఇచ్చాయి. ‘చిన్నప్పటి నుంచి తన ఆలోచనలకు విలువ ఇస్తూ వచ్చాం. ఫైటర్ పైలట్ కావాలనేది తన లక్ష్యమని చెప్పినప్పుడు ఆశీర్వదించాం. మా అమ్మాయి ఫైటర్ పైలట్ అని గర్వంగా చెప్పుకోవడంతో పాటు, పిల్లల కలలను నిరక్ష్యం చేయకండి. వారి కలలకు బలాన్ని ఇవ్వండి...అని తల్లిదండ్రులకు చెప్పే సందర్భాన్ని ఇచ్చాయి’ అంటున్నాడు రోషిణి తండ్రి రవి అయ్యర్. చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన అయ్యర్ ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటి) ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి వచ్చింది. ‘ఫైటర్ పైలట్ అంటే నా దృష్టిలో ఉద్యోగం కాదు. బృహత్తరమైన బాధ్యత. జాతికి సేవ చేసుకునే అదృష్టం’ అంటుంది రోషిణి. స్కూల్లో చదివే రోజుల్లో రోషిణి జాతీయస్థాయిలో ఆటలు ఆడింది. రీడింగ్, ట్రెక్కింగ్, పెయింటింగ్ అంటే రోషిణికి బాగా ఇష్టం. మూడు అభిరుచులను ముచ్చటగా సమన్వయం చేసుకోవడం కూడా ఆమెకు తెలుసు. చదువు ఊహలను ఇస్తుంది. ఆ ఊహాలు అందమైన పెయింటింగ్స్‌గా మారతాయి. ఆ చిత్రాల భావుకత తనను ప్రకృతి ప్రపంచంలోకి తీసుకెళ్లి ట్రెక్కింగ్ చేయిస్తుంది. ‘సిటీ ఆఫ్ లేక్స్’గా చెప్పుకునే ఠాణెలోని ఈడెన్వుడ్ కాంప్లెక్స్‌లో రోషిణి బాల్యం గడిచింది. ఇప్పుడు కాంప్లెక్స్ వాసులతో సహా ఎంతోమందికి రోల్‌మోడల్‌గా మారింది రోషిణి. ఫైటర్ పైలట్‌గా ఆమె మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
పోటెత్తిన కొండవీటి వాగు
గత మూడు రోజులుగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి మండలంలోని నీరుకొండ, కురగల్లు గ్రామాల మధ్య ఉన్న కొండవీటి వాగు పోటెత్తింది. ఆదివారం ఉదయానికి కొండవీటి వాగు వరద నీటితో కురగల్లు నీరుకొండ గ్రామాల మధ్య రోడ్డు మునిగిపోయింది. రెండు గ్రామాల మధ్య ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ వరదనీరు చేరింది. మంగళగిరి నుంచి నీరుకొండ మీదుగా పెదపరిమి, తాడికొండ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహం అంచనా వేయక కొందరు ద్విచక్ర వాహనదారులు కురగల్లు నీరుకొండ రోడ్డులో ప్రయాణించడంతో వాహనాలు పూర్తిగా మునిగిపోయాయి. స్థానిక యువకుల సాయంతో వాహనాలను బయటకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండు రోజులు ఇదే వర్షం కొనసాగితే మరింత ప్రమాదం ముంచుకువచ్చే అవకాశముందని నీరుకొండ, కురగల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. – మంగళగిరి -
ఎస్ఆర్ఎం వర్సిటీ, ‘సాక్షి’ వెబినార్‌కు మంచి స్పందన
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్/సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సులకు దీటైన కెరీర్ అవకాశాలపై ఎస్ఆర్ఎం యూని వర్సిటీ – ఏపీ, ‘సాక్షి’ సంయుక్తంగా మంగళ వారం నిర్వహించిన వెబినార్‌కు మంచి స్పంద న లభించింది. ఇంటర్ తర్వాత అందుబాటు లో ఉన్న పలు కోర్సులపై వెబినార్‌లో విద్యా ర్థులకు నిపుణులు అవగాహన కల్పించారు. కోర్సుల ఎంపికలో జాగ్రత్తలు, వాటితో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలపై విద్యార్థుల సందేహాలకు సమాధానాలిచ్చారు. వెబినార్‌లో ప్రముఖ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సత్య ప్రమోద్ జమ్మీ (మెకానికల్ ఇంజనీరింగ్), డాక్టర్ ఉమా మహేశ్వర్ ఆరేపల్లి (సివిల్ ఇంజనీరింగ్), డాక్టర్ సోమేశ్ వినాయక్ తివారీ (ఎలక్ట్రికల్అండ్ఎలక్ట్రానిక్స్ఇంజనీరింగ్), డాక్టర్ ఓంజీ పాండే (ఎల్రక్టానిక్స్–కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) పాల్గొన్నారు. ఈ పూర్తి వెబినార్‌ను https://youtube/db3Vh5L&u3o యూ ట్యూబ్ లింక్ ద్వారా చూడొచ్చు. -
ట్విన్ బ్రదర్స్... ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు
అమరావతి : ఏపీలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో రికార్డు స్థాయిలో వేతనం పొందారు ఎస్ఆర్ఎం కాలేజీ విద్యార్థులు. ఎస్ఆర్ఎం కాలేజీకి చెందిన కవల సోదరులు సప్తర్షి మంజుదార్, రాజర్షి మజుందార్లను గూగూల్ జపాన్ సంస్థ ఎంపిక చేసుకుంది. ఇద్దరికి చెరో రూ. 50 లక్షల వంతున వార్షిక వేతనం ఇచ్చేందుకు అంగీకరించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో గడ్డ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇదే అత్యధికం. అంతేకాదు ఒకేసారి ఇద్దరు కవలలు సమాన వేతనం పొందడం కూడా ఇదే మొదటిసారి. రూ. 50 లక్షల వేతనం ఇటీవల ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం-ఏపీ కాలేజీ క్యాంపస్‌లో తొలి బ్యాచ్ బయటకు వస్తోంది. దీంతో కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో విద్యార్థులు పొందిన వేతనం సగటు రూ. 7 లక్షలుగా నమోదు అయ్యింది. కాగా మంజుదార్ కవల సోదరులు వేర్వేరుగా రూ. 50 లక్షల వార్షిక వేతనం పొందారు. దీంతో ఇటీవల కాలేజీ యాజమాన్యం సత్కరించి రూ. 2 లక్షల రివార్డు అందించింది. ఊహించలేదు - సప్తర్షి మంజుదార్ ‘ఈ స్థాయిలో వేతనం పొందుతామని మేము ఎప్పుడు అనుకోలేదు. స్కూలింగ్ నుంచి కాలేజీ వరకు కలిసే చదువుకున్నాం. ఒకే సంస్థలో ప్లేస్మెంట్ పొందాలని అనుకునే వాళ్లం. ఆ కల ఇంత గొప్పగా నెరవేరుతుందని అనుకోలేదు’ అని సప్తర్షి మంజుదార్ అన్నారు. చదవండి : యూకే పోటీలో రూ. 4.9 కోట్లు గెలిచిన హైదరాబాదీ -
Andhra Pradesh: జూలై 15 నాటికి కరోనా తగ్గుముఖం!
సాక్షి, అమరావతి: కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (డీమ్డ్ వర్సిటీ) ప్రొఫెసర్లు, విద్యార్థులు ఊరటనిచ్చే కబురు చెప్పారు. జూలై 15 నాటికి రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విశ్లేషణ బృందం తయారు చేసిన ఈ నివేదికను యూనివర్సిటీ ప్రో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.నారాయణరావు మంగళవారం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు ఈమెయిల్ ద్వారా పంపారు. నివేదిక వివరాలివీ.. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.నారాయణరావు చొరవతో వర్సిటీ ప్రొఫెసర్ సౌమ్యజ్యోతి బిస్వాస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థులు అన్వేష్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, సాయికృష్ణ, సుహాసిరెడ్డి కోవిడ్ వ్యాప్తి ముగింపు కాలాన్ని అంచనా వేస్తూ శాస్త్రీయంగా నివేదికను తయారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఎస్ఐఆర్ (సస్పెక్టబుల్, ఇన్ఫెక్టెడ్ అండ్ రికవరీ మోడల్)సాయంతో ర్యాండమ్ ఫారెస్ట్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ డేటాను తయారు చేశారు. కరోనా వ్యాప్తి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డేటాను ఎస్ఎస్ఐఆర్ డేటాతో అనుసంధానం చేయడం వల్ల వ్యాధి వ్యాప్తిపై అంచనా గణాంకాలు స్పష్టమవుతున్నాయి. ఇదే పద్ధతిని పాటించిన ఎస్ఆర్ఎం విద్యార్థులు మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తాము తయారు చేసిన డేటాను ఉపయోగించి విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణ ఆధారంగా మే 21 నాటికి ఏపీలో 10 వేల కేసులు, మే 30 నాటికి 5 వేల కేసులు, జూన్ 14 నాటికి 1,000 జూలై నాటికి 500 కేసులు నమోదయ్యే అవకాశముందని, జూలై 15 నాటికి ఏపీలో 100 కేసుల కంటే తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎస్ఆర్ఎం గణాంకాలు తెలియజేస్తున్నాయి. చదవండి: Corona Care: ఆ టూత్ బ్రష్ వాడకండి! -
ఇంజనీరింగ్ విద్యార్థినిపై వికృత చేష్ట..
సాక్షి, చెన్నై : ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్ధినిపై జరిగిన లైంగిక వేధింపుల పట్ల వర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని పేర్కొంటూ గురువారం రాత్రి విద్యార్ధులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. బాధిత విద్యార్ధిని ఫిర్యాదుపై అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై విద్యార్ధులు భగ్గుమన్నారు. వర్సిటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని గురువారం మధ్యాహ్నం హాస్టల్ లిఫ్ట్‌లో వెళుతుండగా, లిఫ్ట్‌లోనే ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు జననాంగం చూపుతూ ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా హాస్టల్ వార్డెన్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించేందుకు మూడు గంటలు జాప్యం చేశారన్నారు. నిందితుడిని గుర్తించినా పోలీసులకు ఫిర్యాదు చేయడంలో తాత్సారం చేశారని మండిపడ్డారు. బాధిత విద్యార్థిని జరిగన ఘటనపై మౌనంగా ఉండాలని వర్సిటీ అధికారులు ఒత్తిడి తెచ్చారని విద్యార్ధులు చెబుతున్నారు. విద్యార్థిని ఫిర్యాదుపై వర్సిటీ యంత్రాంగం చర్యలు చేపడుతుందని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ సందీప్ సంచేటి తెలిపారు. మరోవైపు వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొనడం గమనార్హం. -
ఎస్ఆర్ఎమ్ వర్సిటీ వీసీగా ‘జంషెడ్ బారుచా’
సాక్షి, అమరావతి : ఎస్ఆర్ఎమ్ యూనిర్శిటీ వైస్ చాన్సలర్‌గా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జంషెడ్ బారుచా నియమితులయ్యారు. అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్శీటీ వ్యవస్థాపక వైస్ చాన్సలర్‌గా ఆయన కొనసాగనున్నారు. ఆయన గతంలో అమెరికాకు చెందిన పలు ప్రముఖ విద్యాసంస్థలలో ఉన్నత పదవులలో కొనసాగారు. ఎస్ఆర్ఎమ్ విద్యాసంస్థల అధినేత పి. సత్యనారాయణన్ మాట్లాడుతూ.. యూనివర్శిటీ, విద్యార్థుల అభ్యున్నతికి ఆయన ఎల్లవేళలా కృషి చేయగలరని ఆకాక్షించారు. జంషెడ్ బారుచాను అమరావతి ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌గా నియమించటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. జంషెడ్ బారుచా మాట్లాడుతూ.. జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి అన్ని రకాలుగా కృషిచేయాలని, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. శక్తివంచన లేకుండా విద్యార్థులకు సహకరించటమే కాకుండా.. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. -
ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
-
చెన్నైలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఈ విశ్వవిద్యాలయంలో బీటెక్ మూడో సంవత్సరం చదుతున్న సాయినాథ్ మంగళవారం కాలేజ్ హాస్టల్ భవనం మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయినాథ్ స్వస్థలం విజయవాడలోని నారాయణలింగాపురం. కాలేజ్ యాజమాన్యం రూ.10 వేల ఫైన్ విధించారని.. దీంతో మనస్థాపం చెందిన సాయినాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యపై సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థిలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రెండు నెలల క్రితం సత్యభామ యూనివర్సిటీలో చదవుతున్న రాధ మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన మౌనిక ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా కాపీ కొట్టిందని.. ఆమెను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
3 కాదు.. 5 ‘సీ’లను అలవరచుకోవాలి
సాక్షి, చెన్నై: సాధారణంగా సమాజంలో క్యాస్ట్ (కులం), కమ్యూనిటీ (వర్గం), క్యాష్ (డబ్బు) అనే మూడు ‘సీ’లు కనిపిస్తుంటాయనీ, అలాకాకుండా క్యారెక్టర్ (వ్యక్తిత్వం), క్యాలిబర్ (సామర్థ్యం), కెపాసిటీ (శక్తి), కండక్ట్ (ప్రవర్తన), కంపాషన్ (కరుణ) గుణాలను విద్యార్థులు అలవరచుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. నేటి డిజిటల్ యుగానికి తగ్గట్లుగా విద్యాలయాల్లో బోధనా ప్రమాణాలను మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. చెన్నై శివార్లలోని కాటాన్ కొళత్తూరులో ఉన్న ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన స్నాతకోత్సవంలో వెంకయ్య మాట్లాడారు. ధార్మిక చింతన లేకుండా సైన్స్ మాత్రమే చదువు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి తయారైందని విమర్శిస్తూ, బహుముఖ ప్రజ్ఞతో కూడిన విద్యతో మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. దాదాపు 6 వేల మంది విద్యార్థులు పట్టాలను అందుకున్న ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, వర్సిటీ చాన్స్‌లర్ పారివేందర్, అధ్యక్షుడు సత్యనారాయణన్ పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 'బీటెక్' ప్రవేశాలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్ : 2018 ఏడాదికిగానూ బీటెక్ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన కట్టాన్కులాంతుర్, రామపురం, వడపలాని, ఎన్సీఆర్ ఢిల్లీ క్యాంపస్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అమరావతి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హర్యానా సోనేపట్లలో బీటెక్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు 1 నవంబర్ 2017 నుంచి 31 మార్చి 2018 వరకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ ప్రవేశ అర్హతా పరీక్ష ఉత్తీర్ణత, ఎస్ఆర్ఎం జాయింట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. దేశంలోని 130 కేంద్రాలతో పాటూ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆన్లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 2018 ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వరకు అభ్యర్థులు తమ సౌలభ్యాన్ని బట్టి ఏరోజైనా పరీక్షకు హాజరు కావచ్చు. గత ఏడాది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1,50,000 విద్యార్థులు బీటెక్ విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులతో పాటూ, భారత్‌లోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ యూనివర్సిటీ నుంచి బీటెక్ విద్యను అభ్యసిస్తున్నారు. -
ఎస్ఆర్ఎం వర్సిటీకి క్యూఎస్ 4 స్టార్
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఉన్నత విద్యాసంస్థ క్వాక్వరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు 50 ఉండగా, భారత దేశంలో ఈ గుర్తింపు పొందిన రెండో విశ్వవిద్యాలయంగా ఎస్ఆర్ఎం వర్సిటీ నిలిచింది. ఎస్ఆర్ఎం వర్సిటీకి ఓవరాల్‌గా 4 స్టార్ రేటింగ్ లభించగా బోధన, ఉద్యోగ కల్పనలో మాత్రం 5 స్టార్ రేటింగ్ లభించింది. లండన్‌కు చెందిన క్యూఎస్ సంస్థ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పేరుతో ప్రపంచ స్థాయి ప్రమాణాల ఆధారంగా విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు ఇస్తోంది. -
పెట్టుబడులను ఆకర్షించడానికే
‘రాజధాని భూములతో ముడుపుల బేరం’ వార్తకు సీఆర్డీఏ వివరణ సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చౌక గా 200 ఎకరాలను కట్టబెట్టిన విషయాన్ని సీఆర్డీఏ అంగీకరించింది. ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోవడానికి, పెట్టుబడులను ఆకర్షించేందుకే ఎకరా రూ.50 లక్షలకు ఇచ్చామని వివరణ ఇచ్చింది. గ్లోబల్ టెండర్లు లేకుండానే రాజధానిలో ఎస్ఆర్ఎం వర్సిటీకి ఎకరా కేవలం 50 లక్షల చొప్పున 200 ఎకరాలను కట్టబెట్టిన విషయంపై ‘రాజధాని భూములతో ముడుపుల బేరం’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 22న కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై సీఆర్డీఏ సోమవారం వివరణ ఇచ్చింది. -
మంత్రి అయ్యన్నకు చేదు అనుభవం
అమరావతి: ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ప్రారంభోత్సవంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడుకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసు సిబ్బంది లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. మంత్రిననే విషయం ఆయనే స్వయంగా చెప్పినా బారికేడ్లు తొలగించేందుకు నిరాకరించారు. దీంతో ఆయన ఆగ్రహంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ...రాజకీయ నాయకులకు అవమానాలు, గౌరవాలు సహజమేనన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ కోన శశిధర్ ...మంత్రి అయ్యన్నకు ఫోన్ చేశారు. తిరిగి కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రిని కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. అయ్యన్నతోపాటు పలువురు అతిథులను.. ప్రముఖులను కూడా లోపలికి వెళ్లకుండా గుంటూరు పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావే ఇలా చేయించారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. విశాఖ భూ కబ్జాల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్న మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. -
నీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ ప్రారంభం
అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మొక్కలు నాటారు. రాజధానిలో తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఇదే. మంగళగిరి మండలం నీరుకొండ వద్ద నిర్మించిన ఈ వర్సిటీలో ఆగస్టు 7 నుంచి తరగతులు ప్రారంభం కానుండగా ఈ ఏడాది 240 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఎం వర్సిటీకి 200 ఎకరాలు
అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలో ఎస్ఆర్ఎం యూనివర్శిటీకి 200 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్ఆర్ఎంకు భూములు ఇచ్చే విషయమై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయగా... ఎస్ఆర్ఎంకు భూములు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని, ఈ నేపథ్యంలో భూమి కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశలో 100 ఎకరాలు కేటాయిస్తామని, 17,500 మంది విద్యార్థులకు ఇక్కడ విద్యనభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు. తొలిదశలో ఇచ్చిన 100 ఎకరాలకు సంబంధించి నిర్దేశించిన ఫలితాలను సాధిస్తే రెండో దశలో 100 ఎకరాలను కేటాయిస్తామన్నారు. ఎకరా రూ.50 లక్షలకు ధర కేటాయించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. -
సైనా నెహ్వాల్‌కు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ప్రదానం
చెన్నై: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌కు చెన్నై ఎస్ఆర్ఎం వర్సిటీ డాక్టర్ ఆప్ లిటరేచర్ ను ఆదివారం ప్రదానం చేసింది. కాటాన్ కొళత్తూరులోని ఆ వర్సిటీ టీపీ గణేషన్ ఆడిటోరియంలో ఆదివారం ప్రత్యేక స్నాతకోత్సవం జరిగింది. ఆ వర్సిటీ చాన్స్‌లర్ పి.సత్యనారాయణన్, యూఎస్ అంబాసిడర్ ఎవన్ శామ్యుల్ డుబెల్‌ల చేతుల మీదుగా సైనానెహ్వాల్‌కు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ప్రదానం చేశారు. అలాగే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్‌ను కూడా డాక్టర్ ఆఫ్ లిటరేచర్తో సత్కరించారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ క్రీడారంగానికి చెందిన తనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ను ప్రప్రథమంగా ఎస్ఆర్ఎం ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. మోకాలి గాయంతో ఒలింపిక్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని, మళ్లీ సాధనకు శ్రీకారం చుట్టనున్నానని, మున్ముందు మరిన్ని పతకాలతో ప్రతిభను చాటుతానని వ్యాఖ్యానించారు. క్రీడల పరంగా పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. -
మదన్ ఉచ్చులో పచ్చముత్తు
-
మదన్ ఉచ్చులో పచ్చముత్తు
మెడికల్ సీట్లపై రూ.72 కోట్ల మోసం ఆరోపణ ఎస్ఆర్ఎం చాన్స్‌లర్ పచ్చముత్తు అరెస్ట్ 15 రోజుల రిమాండ్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎస్ఆర్ఎం వర్సిటీ ఇంజినీరింగ్, మెడికల్ తదితర అనేక ఉన్నత విద్యాబోధనలో ఎంతో పేరుగాంచింది. ఇంజినీరింగ్ కంటే వైద్యవిద్యకు ఎక్కువ గిరాకీ ఉండడంతో సీట్లకు అదేస్థాయి రేటు పలుకుతోంది. పచ్చముత్తుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా చెప్పబడుతున్న వేందర్ మూవీస్ అధినేత మదన్ ఈ ఏడాది మేలో అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వైద్యవిద్యార్థుల అడ్మిషన్లో మదన్, పచ్చముత్తుల మధ్య అనేక లావాదేవీలు ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల నుంచి తాను వసూలు చేసిన సొమ్ము మొత్తాన్ని పచ్చముత్తుకు అప్పగించానని, విద్యార్థుల విషయంలో ఆయనదే బాధ్యత, తాను కాశీకి వెళ్లి సమాధి అవుతున్నానని మదన్ తన గదిలో ఒక ఉత్తరాన్ని వదిలి వెళ్లాడు. దీంతో వైద్యసీట్ల పేరుతో కోట్లాది రూపాయలు కాజేశారని పచ్చముత్తుపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు. దీంతో మదన్ ఎక్కడున్నాడో కనుగొని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మెడికల్ సీట్ల పేరున విద్యార్థుల నుంచి ఎస్‌ఆర్‌ఎంవారు భారీగా వసూలు చేశారని మదన్ తల్లి తంగం హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఇంత వరకు 112 మంది నుంచి రూ.72 కోట్లకు పైగా వసూలు చేశారని, మరికొందరు విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన ఫిర్యాదులు కూడా అందితే మోసం సొమ్ము రూ.వందకోట్లు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యార్థుల నుంచి సొమ్ము వసూలు చేసింది మదనే అయినా వర్సిటీ చాన్సలర్‌గా పచ్చముత్తునే బాధ్యత వహించాలని బాధిత తల్లిదండ్రులు పోలీసుల వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా మదన్ ఆచూకీ, ఆరోపణలపై నిజాలు వెలికితీసేందుకు సెంట్రల్ క్రైంబ్రాంచ్ అదనపు సహాయ కమిషనర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు తమ నివేదికను కోర్టులో దాఖలు చేస్తున్నారు. ఈనెల 17వ తేదీన దాఖలు చేసిన నివేదిక ను పరిశీలించిన న్యాయమూర్తులు పోలీసుల పనితీరును తీవ్రంగా ఆక్షేపించినట్లు తెలుస్తోంది. విచారణ చేతకాకుంటే మరొకరికి అప్పగిస్తామని హెచ్చరించడంతోపాటు ఎస్ఆర్ఎం వర్సిటీ చాన్స్‌లర్ పచ్చముత్తు, ఇతర నిర్వాహకులను విచారించక పోవడంపై నిలదీసినట్లు తెలిసింది. విద్యార్థుల నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వకుంటే ఆత్మాహుతికి పాల్పడుతామని తల్లిదండ్రులు పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. మదన్ ఆచూకీ తెలియకపోవడంతో విచారణకు నేరుగా హాజరుకావాలని పచ్చముత్తుకు పోలీసులు సమన్లు జారీ చే శారు. దీంతో గురువారం సాయంత్రం 6 గంటలకు పచ్చముత్తు పోలీసుల ముందు హాజరైనారు. పచ్చముత్తును ప్రత్యేక గదిలో ఉంచి పెద్ద సంఖ్యలోని పోలీసుల బృందం విచారణ జరిపింది. శుక్రవారం ఉదయం కూడా విచారణ కొనసాగిన నేపథ్యంలో పచ్చముత్తును అరెస్ట్ చేయనున్నట్లు మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ప్రకటించారు. రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి సైదాపేట 11వ మెజిస్ట్రేటు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పచ్చముత్తును పుళల్ జైలుకు తరలించారు. -
ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధినేత అరెస్ట్!
చెన్నై: ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధినేత టీఆర్ పచ్చముత్తును సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మోసం సహా ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ ఛాన్సలర్, ఐజేకే పార్టీ వ్యవస్థాపకుడైన పచ్చముత్తను గురువారం రాత్రి విచారణకు పిలిచారు. అయితే ఆయన అరెస్ట్ ను సీఐడీ ధ్రువీకరించలేదు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మెడికల్ సీట్ల కోసం డబ్బు కట్టినా తమకు అడ్మిషన్లు ఇవ్వలేదని 100 మందిపైగా విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. పచ్చముత్తుకు సన్నిహితుడైన సినీ నిర్మాత ఎస్. మదన్ తమకు సీట్లు ఇప్పిస్తామని డబ్బు తీసుకున్నాడని బాధితులు ఆరోపించారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాసి మే నెలలో మదన్ అదృశ్యం కావడంతో పచ్చముత్తు చిక్కుల్లో పడ్డారు. మదన్ దాదాపు రూ. 70 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మద్రాస్ హైకోర్టు ఆదేశంలో పచ్చముత్తును సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. కాగా, ఎస్ఆర్ఎం విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అమరావతిలో 200 ఎకరాలు కేటాయించింది. -
అమరావతిలో ‘ఎస్ఆర్ఎంకు’ 200 ఎకరాలు
- మంత్రి కామినేని వ్యాఖ్య సాక్షి, చెన్నై ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయానికి అమరావతిలో రెండు వందల ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించినట్టు డాక్టర్ కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. చెన్నైలోని ఆ వర్సిటీ క్యాంపస్‌కు దీటుగా అమరావతిలో క్యాంపస్ నిర్మాణం జరుగనున్నదన్నారు. చెన్నై శివారులోని ఎస్ఆర్ఎం వర్సిటీలో గురువారం బయో యంత్ర-2016 సదస్సు జరిగింది. ఇందులో మంత్రి కామినేని ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక వైద్యపరిజ్ఞానం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు తగ్గట్టు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నామన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో అమరావతిలో సరికొత్త రాజధాని నిర్మాణం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఇక, ఈ రాజధానిలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం క్యాంపస్ ఏర్పాటు కాబోతున్నదని తెలిపారు. ఇక్కడ ఆ సంస్థకు కనిష్ట ధరకు రెండు వందల ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇందులో చెన్నై క్యాంపస్‌కు దీటుగా అత్యాధునికతను చాటుకునే విధంగా క్యాంపస్ నిర్మాణానికి ఆ వర్సిటీ చాన్స్‌లర్ పచ్చముత్తు పారివేందర్ చర్యలు తీసుకుంటుండడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని తెలుగు వారందరూ పుష్కరాలకు తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. -
ఎస్ఆర్ఎంలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు తమ యూనివర్సిటీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పేర్కొంది. ఈనెల 11న బీటెక్‌లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రారంభమైందని, 20న ముగియనున్న బీటెక్ కౌన్సెలింగ్‌లో అనేక మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. 15 రాష్ట్రాలకు చెందిన టాప్ 100 మందికి స్కాలర్షిప్లను ఇవ్వనున్నట్లు వివరించింది. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన 9 మంది విద్యార్థులకు తొలిసారిగా గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామని ఎస్ఆర్ఎం విద్యా సంస్థల వ్యవస్థాపక చాన్స్‌లర్ టీఆర్ పారివేందర్ పేర్కొన్నారు. -
అమరావతిలో ఎస్ఆర్ఎంను ఏర్పాటు చేయండి
♦ వర్సిటీ యాజమాన్యానికి చంద్రబాబు పిలుపు ♦ చెన్నైలో ఘనంగా ఎస్ఆర్ఎం స్నాతకోత్సవం సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని అమరావతిలో విద్యాసంస్థను నెలకొల్పేందుకు ముందుకు రావాలని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఎస్ఆర్ఎం వర్సిటీ స్నాతకోత్సవం శనివారం చెన్నై శివారు కాటాన్ కొళత్తూరులోని టీపీ గణేషన్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. వర్సిటీ చాన్స్‌లర్ టీఆర్ పారివేందర్ అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పీహెచ్డీ, బంగారు పతకాలు, డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని ఓ సవాల్‌గా తీసుకుని ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. అమరావతిలో విద్యా సంస్థను నెలకొల్పేందుకు ఎస్ఆర్ఎం ముందుకు రావాలని, స్థల కేటాయింపుతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని వెల్లడించారు. దీనిపై వర్సిటీ చాన్సలర్ పారివేందర్ పరిశీలిస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. చంద్రబాబుకు పటిష్ట భద్రత.. సీఎం చంద్రబాబునాయుడు చెన్నై పర్యటన నిఘా నీడలో సాగింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కల్పించిన తరహాలో చంద్రబాబుకు భద్రతా చర్యలు తీసుకున్నారు. అందుకు కారణం తమిళ ఎర్రచందనం కూలీలపై ఇటీవల తిరుపతిలో సాగిన ఎన్‌కౌంటర్‌పై తమిళ సంఘాలు ఆగ్రహంతో ఉండటమేనని ఓ అధికారి తెలిపారు. -
నేలపై మనుషులను గుర్తించే డ్రోన్!
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థుల ఆవిష్కరణ హైదరాబాద్: నిర్దేశించిన ప్రాంతంలో గాలిలో స్వతంత్రంగా ఎగురుతూనే మనుషులను, జీపీఎస్ సమాచారాన్ని కచ్చితత్వంతో గుర్తించే సరికొత్త డ్రోన్‌ను తమిళనాడులోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు ఆవిష్కరించారు. ఏరోస్పేస్ విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థి శోబిన్ సంతోష్ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఈ ఆటోనామస్ కాప్టర్ మనుషుల ముఖాలను కూడా గుర్తించడం విశేషం. నేలకు దగ్గరగా, సెకనుకు 5 మీటర్ల వేగంతో ఎగురుతూ కూడా వీడియోలు సైతం తీయగలిగే ఈ మానవ రహిత గగన వాహనం(యూఏవీ) ఎలాంటి వాతావరణ పరిస్థితు లు, ప్రతికూల ప్రదేశాల్లో అయినా పనిచేస్తుంది. ఫొటోలు తీయడంతో పాటు ఆ ప్రదేశాన్ని గుర్తించి జీపీఎస్ ద్వారా గ్రౌండ్ స్టేషన్‌కు వెంటనే సమాచారం పంపుతుంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలకు, భద్రతా బలగాల నిఘాకు, గగనతలం నుంచి ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఈ డ్రోన్ ఉపయోగపడుతుందని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. డ్రోన్‌లో పొందుపర్చిన సాఫ్ట్‌వేర్‌ను ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన అరిజిత్ రాయ్ రూ పొందించాడని, ఈ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించగా.. నేలపై ఉన్న వ్యక్తుల ముఖాలను 98 శాతం కచ్చితత్వంతో గుర్తించి, సమాచారం పంపిందని తెలిపాయి. -
మెషిన్ల జీవితకాలం పెంచే నానో లూబ్రికెంట్లు
చెన్నై: గేర్బాక్సుల్లాంటి మెషిన్లలో లోహాల మధ్య ఘర్షణను గణనీయంగా తగ్గించే కొత్త తరహా నానో (మరగుజ్జు) లూబ్రికెంట్ను ఇక్కడి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కందెన(లూబ్రికెంట్) గొప్ప ప్రమాణాలను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలకు నేతృత్వం వహించిన సుబ్రజిత్ భౌమిక్ చెప్పారు. ఈ కందెనతో లోహాల అరుగుదలలో 30 శాతం తగ్గుదల ఉంటుందని, లోడ్‌ను భరించే శక్తిలో 15 శాతం పెరుగుదల ఉంటుందని చెప్పారు. సంపూర్ణ మినరల్ ఆయిల్, మినరల్ ఆయిల్ + గ్రాఫైట్‌లతో పోలిస్తే తాము అభివృద్ధి చేసిన కందెనలో ఘర్షణను తక్కువచేసే శక్తిని గుర్తించామన్నారు. లోహాల అరుగుదలను తగ్గించి వాటి జీవితకాలాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని భౌమిక్ తెలిపారు. నానో లూబ్రికెంట్స్‌తో ఇంజిన్ ఆయిల్ వినియోగం, శక్తి వినియోగం తగ్గుతుందని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రీసెర్చ్ డెరెక్టర్ ప్రొఫెసర్. డి. నారాయణ రావు చెప్పారు. లూబ్రికెంట్ల వినియోగం తగ్గించడానికి, పర్యావరణ హితమైన వాటిని తయారు చేసే దిశగా తమ పరిశోధన సాగుతోందని ఆయన తెలిపారు. విడిభాగాల అరుగుదలను గణనీయంగా తగ్గించడానికి, లోడ్ భరించే శక్తిని 80 శాతం వరకూ పెంచే లక్ష్యంతో ఎస్ఆర్ఎం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.