చెన్నై: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌కు చెన్నై ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ డాక్టర్ ఆప్ లిటరేచర్ ను ఆదివారం ప్రదానం చేసింది. కాటాన్ కొళత్తూరులోని ఆ వర్సిటీ టీపీ గణేషన్ ఆడిటోరియంలో ఆదివారం ప్రత్యేక స్నాతకోత్సవం జరిగింది. ఆ వర్సిటీ చాన్స్‌లర్ పి.సత్యనారాయణన్, యూఎస్ అంబాసిడర్ ఎవన్ శామ్యుల్ డుబెల్‌ల చేతుల మీదుగా సైనానెహ్వాల్‌కు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ప్రదానం చేశారు.
అలాగే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్‌ను కూడా డాక్టర్ ఆఫ్ లిటరేచర్తో సత్కరించారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ క్రీడారంగానికి చెందిన తనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ను ప్రప్రథమంగా ఎస్‌ఆర్‌ఎం ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. మోకాలి గాయంతో ఒలింపిక్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని, మళ్లీ సాధనకు శ్రీకారం చుట్టనున్నానని, మున్ముందు మరిన్ని పతకాలతో ప్రతిభను చాటుతానని వ్యాఖ్యానించారు. క్రీడల పరంగా పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.
సైనా నెహ్వాల్‌కు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ప్రదానం
Published Sun, Oct 16 2016 7:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
Advertisement
Advertisement