విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఉన్నత విద్యాసంస్థ క్వాక్వరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు 50 ఉండగా, భారత దేశంలో ఈ గుర్తింపు పొందిన రెండో విశ్వవిద్యాలయంగా ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నిలిచింది. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి ఓవరాల్‌గా 4 స్టార్ రేటింగ్ లభించగా బోధన, ఉద్యోగ కల్పనలో మాత్రం 5 స్టార్ రేటింగ్ లభించింది. లండన్‌కు చెందిన క్యూఎస్ సంస్థ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పేరుతో ప్రపంచ స్థాయి ప్రమాణాల ఆధారంగా విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment