ప్రశాంతంగా ఎన్నికలు | the mumbai andhra mahasabha & gymkhana elections over | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎన్నికలు

Published Sun, Mar 2 2014 10:14 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

the mumbai andhra mahasabha & gymkhana elections over

దాదర్, న్యూస్‌లైన్:  ముంైబె  సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ తెలుగు సంఘాలకు మాతృసంస్థగా విరాజిల్లుతున్న దాదర్‌లోని ‘ది ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా’ కార్యవర్గానికి ఆదివారం జరిగిన ఎన్నికలు ప్రశాం తంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుపొం దుతారనే దానిపై ఇటు సభ్యుల్లో, అటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అవినీతి ఆరోపణలు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ ఎన్నికలు జరగడం ఫలితాలపై మరింత ఆసక్తిని రేపింది.

2014-2015 సంవత్సరానికిగానూ నలుగురు బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, ఒక మహాసభ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, పదహారు కమిటీ సభ్యుల కోసం   ఎన్నికలు జరిగాయి. జనచైతన్య ప్యానల్, ప్రగతి ప్యానెల్, విజన్ గ్రూప్ ప్యానల్ బరిలోకి దిగాయి. జనచైతన్య ప్యానెల్ నుంచి అధ్యక్ష పదవికి గజం సుదర్శన్, ప్రధాన కార్యదర్శి పదవికి యాపురం వెంకటేశ్వర్, ప్రగతి ప్యానెల్ నుంచి అధ్యక్ష పదవికి సంకు సుధాకర్, ప్రధాన కార్యదర్శి పదవికి భోగ సహదేవ్, విజన్ గ్రూప్ ప్యానెల్ నుంచి అధ్యక్ష పదవికి బండి గంగాధర్, ప్రధాన కార్యదర్శి పదవికి యాపురం వెంకటేశ్వర్ పోటీ చేశారు.

 ఉదయం నుంచే సందడి...
 ఎన్నికలు మధ్యాహ్నం తర్వాత ప్రారంభం కావల్సి ఉన్నప్పటికీ ఉదయం ఏడు గంటల నుంచే మహాసభ ప్రాంగణంలో ఎన్నికల సందడి కని పించింది. ఉదయం పది గంటలకు జరిగిన 69వ సభ్యుల సమావేశానికి సభ్యులు హాజరయ్యారు.
 మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు వరకు జరిగిన ఎన్నికలలో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే మహా సభలో సుమా రు 2,600 మంది సభ్యత్వం కలిగి ఉండగా, కేవలం 754 మంది సభ్యులు మాత్రమే తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. మహాసభ ప్రాంగణంలో రాజకీయ స్థాయిలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని కీలకమైన చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన పర్యవేక్షణలో జరి గిన ఈ ఎన్నికలకు చీఫ్ రిటర్నింగ్ అధికారులుగా వి.వి.రెడ్డి, ఒ.సుబ్రహ్మణ్యం, అనుమల్ల సుభాష్ తదితరులు వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement