నగరంలో ‘హైటెక్’ నిఘా | The plan to set up CCTV cameras | Sakshi
Sakshi News home page

నగరంలో ‘హైటెక్’ నిఘా

Published Fri, May 15 2015 11:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

నగరంలో ‘హైటెక్’ నిఘా - Sakshi

నగరంలో ‘హైటెక్’ నిఘా

-  6,020 సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక
- మొదటి విడతగా 1,400 కెమెరాలు ఏర్పాటు
- వచ్చే ఏడాది సెప్టెంబరుకు పూర్తి చేయాలని నిర్ణయం
ముంబై:
నగరంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమయ్యింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌నాటికల్లా నగరంలో 6,020 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ తెలిపింది. ఇందుకుగాను రూ. 949 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. 2011లో ముంబైలో ఉగ్రవాదుల ఘటన తర్వాత గత కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే ప్రారంభానికి నోచకోలేదు. ఇందుకోసం నాలుగ సార్లు టెండర్లు పిలిచినా పనులు ప్రారంభంకాలేదు. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రాజెక్టుకు కార్యరూపం ఇచ్చింది.

ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ స్టోరేజీ సామర్థ్యమున్న కెమెరాలు
ప్రాజెక్టులో భాగంగా నగరాన్ని రెండు జోన్లుగా విభజించామని, దక్షిణ ప్రాంతంలో ఈ ఏడాది నవంబర్ కల్లా 1400 సీసీటీవి కెమెరాలు ఏర్పాటు చేస్తామని హోం శాఖ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ కేపీ బక్షీ తెలిపారు. ముంబై పోలీసు డిపార్ట్‌మెంట్, ఎంసీజీఎం ముఖ్య అధికారి అజయ మెహతా దక్షిణ ముంబైలో ఈ ప్రాజెక్టు కోసం సర్వే నిర్వహించారు. కెమెరాలు అమర్చడానికి రోడ్లు తవ్వడం, స్థంభాలు ఏర్పాటు చేయడం వంటి పనులను ఎంసీజీఎంకు అప్పగించామని బక్షీ అన్నారు. నవంబర్ కల్లా దక్షిణ ముంబైలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు పనిని పూర్తి చేస్తామని చెప్పారు. గుర్తించిన 437 ప్రాంతాల్లో 556 స్థంభాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎంసీజీఎంకి దరఖాస్తులు ఇవ్వగా, 40 శాతం పనులకు అనుమతి లభించిందని, పనులకోసం ఎంసీజీఎం వద్ద డబ్బు కూడా డిపాజిట్ చేశామని చెప్పారు. పనులకోసం ‘ఎల్ అండ్ టీ’ సంస్థ కెమెరాలు, ఇతర హార్డ్‌వేర్ కలిపి 60-70 శాతం సామాగ్రి సమకూరుస్తోందని తెలిపారు.

వరా్షాకాలం పూర్తయిన తర్వాత హోం శాఖ తవ్వకాలకోసం అనుమతి తీసుకుంటందని అన్నారు. 2016 సెప్టెంబర్ నాటికల్లా 6,020 సీసీటీవీ కెమెరాల పని పూర్తి చేస్తుందని బక్షి చెప్పారు. తవ్వకాల పనుల్లో భాగంగా రాయితీ ఇవ్వమని ఎమసీజీఎం కమిషనర్ అజయ్ మెహతాను కోరినట్లు ఆయన వెల్లడించారు. జూన్ నెల మొదటి వారం వరకూ తవ్వకాలకోసం సమయం ఉందని బక్షి తెలిపారు. అయితే వర్షాకాలంలో ఊరికే కూర్చోకుండా మిగతా పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాంతాన్ని బట్టి కెమమెరాలకు 7 నుంచి 21 రోజుల వీడియోలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం ఉందన్నారు. ఎక్కువగా నేరాలు, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఎక్కువ స్టోరేజీ సామర్థ్యమున్న కెమెరాలు అమరుస్తామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్, ఎంసీజీఎం, ముంబై పోర్టు ట్రస్టు, రాష్ట్ర సెక్రెటేరియట్‌లో వీడియోృదష్యాలు వీక్షించవచ్చని తెలిపారు. ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయం, కలింగ, ట్రాఫిక్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మొత్తం మూడు కమాండ్ సెంటర్లున్నాయని బక్షీ అన్నారు.
 
కుంభమేళాకు 550 సీసీటీవీల ఏర్పాటు
త్వరలో జరగనున్న కుంభమేళా కోసం 550 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చేయనున్నట్లు రాష్ట్ర హోం శాఖ శుక్రవారం తెలిపింది. రాష్ట్రంలోని త్రయంబకేశ్వర్, నాసిక్ నగరంలో జరిగే కుంభమేళాకు సుమారు 8 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనాల నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. త్రయంబకేశ్వర్‌లో 200, నాసిక్‌లో 350 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) కేపీ బక్షి తెలిపారు. కుంభమేళా జూలై 14న జరగనుందని, కెమెరాల ఏర్పాటు జూన్ నెలాఖరుకు పూర్తవుతుందని హోం శాఖ అంచనా వేసినట్లు ఆయన  వివరించారు. తాత్కాలిక ప్రాతిపదికన సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని, శాశ్వత ఏర్పాటు ప్రక్రియతో పోలిస్తే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని ఆయన అన్నారు.

ఇందుకకు నాసిక్‌లో రూ. 11 కోట్లకుపైగా ఖర్చు పెడుతుండగా.. త్రయంబకేశ్వర్‌లో 4.1 కోట్లు ఖర్చు చే స్తున్నట్లు తెలిపారు. పనులకు సంబంధించి 15 రోజుల  కిందటే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నాసిక్‌లో సీసీటీవీల కమాండ్ సెంటర్.. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనూ, పర్యవేక్షణ కేంద్రాలు పోలీస్ స్టేషన్స్‌లో ఉంటాయని బక్షి చెప్పారు. త్రయంబకేశ్వర్‌లో సీసీటీవీల కమాండ్ సెంటర్.. పోలీస్ స్టేషన్‌లో పర్యవేక్షణ కేంద్రాలు ఔటర్ పార్కింగ్ ప్రాంతాల్లో ఉంటాయని అన్నారు. 12 ఏళ్ల కిందట నాసిక్‌లో జరిగిన కుంభమేళాకు మూడు కోట్ల మందికి పైగా భక్తులు వచ్చారని, ఈ సారి 8 కోట్లకు పైగా రావచ్చని అంచనా వేసినట్లు రాష్ట్ర ఆదివాసీ అభివృద్ధి శాఖ మంత్రి విష్ణు సావ్రా వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement