మెట్రో రైలు ప్రాజెక్టుపనులిక చకచకా | This will be the first link to be developed by Noida metro rail | Sakshi
Sakshi News home page

మెట్రో రైలు ప్రాజెక్టుపనులిక చకచకా

Published Mon, Sep 2 2013 2:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

This will be the first link to be developed by Noida metro rail

నోయిడా: నోయిడా సిటీ సెంటర్ నుంచి బొరాకి వరకూ నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు పనుల వేగం పెంచే దిశగా సంబంధిత అధికారులు అడుగులు వేస్తున్నారు. నోయిడా మెట్రో రైల్ కంపెనీ (ఎన్‌ఎంఆర్‌సీ) ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక  అంగీకారం తెలిపిన సంగతి విదితమే. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 4,500 కోట్లు. తదుపరి కార్యాచరణ కోసం సంబంధిత అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. మెట్రో పొడిగింపునకు సంబంధించి ఢిల్లీ మెట్రో  రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) విధించిన నిబంధనలను ఈ సమావేశంలో సమీక్షించారు. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికులు హర ్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
 ‘ఎన్‌ఎంఆర్‌సీ చేపడుతున్న తొలి మెట్రో లింక్ ప్రాజెక్టు. ఈ ఏడాది చివరినాటికల్లా ఎన్‌ఎంఆర్‌సీ పని చేయడం ప్రారంభమవుతుంది. ఎన్‌ఎంఆర్‌సీ ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపుతాం’ అని గ్రేటర్ నోయిడా సీఈఓ రమారమణ్ తెలిపారు. ఈ ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దుతున్నామన్నారు. నిధుల సేకరణకుగల అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. కొన్ని నియమనిబంధనలపై చర్చించామని, వీటిని ప్రతిపాదనలో చేరుస్తామన్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడాలను కలిపేందుకుగాను బొరాకి-నోయిడా సిటీల మధ్య 29.5 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు.
 
 నగరవాసులను ఇరుకు ఇబ్బందులనుంచి బయటపడేసేందుకు ఈ మార్గం దోహదం చేస్తుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కారదర్శి జావేద్ ఉస్మాని తెలిపారు. 2017 నాటికల్లా దీనిని పూర్తి చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ  మాదిరిగానే ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతామన్నారు. మెట్రో రైలు విస్తరణ నోయిడా, గ్రేటర్ నోయిడాలలో మౌలిక వసతులు మెరుగుకు దోహదం చేసే అవకాశ ముందని స్థానిక త్రీసీ కంపెనీ డెరైక్టర్ బ్రిజేశ్ భానోతే తెలిపారు. ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపడితే ఈ రెండు నగరాల్లో ఇళ్ల నిర్మాణంవైపు ప్రజలు మొగ్గుచూపుతారన్నారు. రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందే అవకాశముందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement