పుణేలో వరుస హత్యలు | Three muders in pune on midnight | Sakshi
Sakshi News home page

పుణేలో వరుస హత్యలు

Published Mon, May 4 2015 11:46 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Three muders in pune on midnight

సాక్షి, ముంబై: పుణేలో వివిధ ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి మూడు హత్యలు జరిగాయి. ఈ ఘటనలు పోలీసుల కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఆంబిడ్  ఓడా కాలనీలో నితిన్ కస్బే (35) అనే వ్యక్తిని కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. హత్యకు బాధ్యులైన నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో ఘటనలో మోతీరాం పవార్ (55) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాయితో మోది హత్య చేశారు. అనుమానితుడు గణేశ్ హోలేను అరెస్టు చేశారు. మూడో ఘటన కాత్రజ్ ప్రాంతంలో జరిగింది. ఓ అజ్ఞాత వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు ఈ ప్రాంతంలో కనుగొన్నారు. తలపై బండరాయితో మొది ఆయన్ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement