హొసూరు: సెల్ఫీ వ్యసనం ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది. హొసూరు సమీపంలోని కెలవరపల్లి డ్యాం వద్ద సెల్ఫీ తీసుకుంటూ ఇద్దరు డ్యాం నీటిలో కొట్టుకుపోతుండగా వీరిని కాపాడేందుకు వెళ్లిన ఇం జినీరింగ్ విద్యార్థి ఒకరినికాపాడి అతడూ ప్ర మాదంలో చిక్కుకుని మరణించాడు. ఈ సంఘట న శనివారం హొసూరు వద్ద విషాదాన్ని నింపింది.
ఎలా జరిగిందంటే...
వివరాలు... బెంగళూరు రాజేశ్వరినగర్‌కు చెందిన దేవేందర్ అలియాస్ ధర్మేంద్రన్ (21) హొసూరులోని ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగి. శనివారం విద్యుత్ కోత కారణంగా పరిశ్రమకు సెలవు కావడంతో స్నేహితునితో కలిసి సమీపంలోని కెలవరపల్లి డ్యాం వద్దకు వెళ్లారు. డ్యాం మూడు గేట్లను ఎత్తి ఉండడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవేందర్ గేటు సమీపంలోకి వెళ్లి స్నేహితునితో కలిసి సెల్ఫీ దిగేందుకు యత్నించగా ఇద్దరూ పట్టుతప్పి ప్రవాహంలో చిక్కుకున్నారు. డ్యాంపై నుండి దీనిని గమనించిన కారైకుడికి చెందిన కేశవన్ (22) అనే విద్యార్థి నీటిలోకి దూకి ఒకరిని ఒడ్డుకు చేర్చాడు. కేశవన్ హొసూరు ఆదియమ్మాన్ కళాశాలలో బీఈ పైనల్ ఇయర్ చదువుతున్నాడు. దేవేందర్‌ను కాపాడే ప్రయత్నంలో కేశవన్ ప్రవాహంలోకి జారిపోయి నీటమునిగాడు.
కృతజ్ఞత మరచి పరారీ
ఈలోగా ఒడ్డుకు సురక్షితంగా చేరిన వ్యక్తి కేశవన్ కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదు. తనను కాపాడాడు అన్న కృతజ్ఞత కూడా లేకుండా అక్కడి నుండి పరారయ్యాడు. ఈ విషయంపై సమాచారమందుకొన్న అగ్నిమాపక సిబ్బంది, హడ్కో పోలీసులు సంఘటనా స్థలానికెళ్లి గేట్లను మూసి ధర్మేంద్రన్, కేశవన్‌ల మృతదేహాలను బయటకు తీసి హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద సంఘటన తెలిసి పెద్దసంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment