Selfie deaths
-
సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ.. బాగా ప్రాచుర్యం పొందిన, ఎవరికి వారు స్వయంగా తీసుకునే సెల్ ఫోన్ ఆధారిత ఫొటో. దీనికోసం ప్రత్యేక సెల్ ఫోన్లు, స్టిక్కులతో పాటు కోర్సులు కూడా అందు బాటులోకి వచ్చాయంటేనే వాటికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకో వచ్చు. ముఖ్యంగా కొంతమంది యువ తలో ఈ క్రేజ్ విపరీత స్థాయిలో ఉంటోంది. అయితే ఈ క్రేజ్ కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలనే హరి స్తోంది. ఈ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు అధిక సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. దేశంలో గత ఏడాది సెల్ఫీ సంబంధిత మరణాలు 190 నమోద య్యాయి. తీవ్రంగా గాయపడిన ఉదంతాలు 55 చోటు చేసుకున్నట్లు వికీపీడియా గణాంకాలు చెప్తు న్నాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రమాదాలు భారత్‌లోనే ఎక్కువని స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి మరణాలు ఎక్కువ గానే జరుగుతున్నాయి. నగరంలో 2016లో తొలి సెల్ఫీ డెత్ నమోదైంది. జూ పార్క్‌లో సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో కాలుజారి పడటంతో జియాగూడ వాసి మంజీత్ చౌదరి కన్నుమూశాడు.2024 జనవరి 7ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాలుడు (16) అల్వాల్‌లో ఉంటున్న తన బాబాయి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఈ బాలుడు బొల్లారం బ్యారెక్ సమీపంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ వద్దకు చేరుకున్నాడు. వెనుక నుంచి రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే రైలు దూసుకు రావడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.2024 జనవరి 29హైదరాబాద్ బహదూర్‌పురకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ (23) అబిడ్స్ లోని కళ్లజోళ్ల దుకాణంలో పనిచేస్తు న్నాడు. తనస్నేహితులతో కలిసి ఉప్పుగూడ–యాకత్‌పుర రైల్వే స్టేష న్ల మధ్య రైల్వే ట్రాక్‌ల వద్దకు వెళ్లా డు. అక్కడ సెల్ఫీ తీసుకునే ప్రయ త్నాల్లో రైలు పట్టాల మీదకు చేరుకు న్నాడు. అదే సమయంలో దూసుకు వచ్చిన ఎంఎంటీఎస్ ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో చనిపోయాడు.2024 ఏప్రిల్ 5ఏపీకి చెందిన ఎస్.అనిల్ కుమార్ (27) భార్యతో కలిసి హైదరా బాద్‌లోని మాదాపూర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అర్ధ రాత్రి వేళ తన స్నేహితుడు అజ య్‌తో కలిసి కేబుల్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. తమ ద్విచక్ర వాహనాన్ని వంతెనపై నిలిపిన ఈ ద్వయం సెల్ఫీలు తీసుకుంటోంది. ఇంతలో ఇనార్బిట్ మాల్ వైపు నుంచి వచ్చిన కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అనిల్ చికిత్స పొందుతూ అసువులు బాశాడు.2024 జూన్ 15హైదరాబాద్‌కు చెందిన ఉదయ్‌కుమార్ (17), శివదీక్షిత్ (17) మరో బాలుడు (17) ఇంటర్ పూర్తి చేశారు. బాలుడి పుట్టినరోజు కావడంతో శుక్రవారం అర్ధరాత్రి కేకుకోసిన అనంతరం మాదాపూర్ కేబుల్ బ్రిడ్జికి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 2.18 ప్రాంతంలో ముగ్గురూ స్కూటీపైనే ఉండి రీల్స్ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఉదయ్, దీక్షిత్ అక్కడిక్కడే మరణించగా.. బాలుడు గాయపడ్డాడు. అత్యుత్సాహంతోనే చేటు..సెల్ఫోన్లు వచ్చినప్పటి నుంచే ఈ సెల్ఫీల జాఢ్యం మొదలవలేదు. ఎప్పుడైతే వాటిల్లో ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయో అప్ప ట్నుంచీ సెల్ఫీ క్రేజ్ ప్రారంభమై, క్రమంగా మంచి రెజుల్యూషన్ (ఫొటో స్పష్టంగా కన్పిస్తుంది)తో కూడిన ఫొటోలు వచ్చే ఫ్రంట్ కెమెరాలు కూడా వస్తుండటంతో ఈ సెల్ఫీల పిచ్చి మరింత ముదిరి పోయింది. సెల్ఫీ మోజులో ఉంటున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటు న్నారు. ఏదో రకంగా విభిన్నమైన సెల్ఫీని తీసుకో వాలనే తాపత్రయంలో ప్రమాదకర పరిస్థితుల్ని పట్టించుకోకుండా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్ని స్తున్నారు. వెనుక నుంచి రైలు వస్తుండగానో, వాహనాలు డ్రైవ్ చేస్తూనో, జలపాతాల వద్దో, బీచ్ ల్లోనో, ఎత్తైన ప్రదేశాల్లోనో సెల్ఫీలకు ప్రయత్నిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.సోషల్ మీడియా ప్రాచుర్యం పొందిన తర్వాత..ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీ ఫీవర్ మరింత ఎక్కువైంది. ఆయా సోషల్ మీడియాల్లో ఎవరి ప్రొఫైల్ పిక్ చూసినా, అప్లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం సెల్ఫీలే కనిపిస్తు న్నాయి. ఒకరిని చూసి మరొకరు, ఒకరి ప్రొఫైల్స్ చూసి ఇంకొకరు... ఇలా అంతా సెల్ఫీల బాటపడుతున్నారు. ఇటీవలి కాలంలో వీటితో పాటు రీల్స్ (షార్ట్ వీడియోలు) కూడా సోషల్ మీడియాల్లో ఎక్కువగా కన్పిస్తుండటం గమనార్హం. మరోపక్క ఈ సెల్ఫీలను మార్ఫింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే సైబర్ నేరాలు పెరుగుతుండటం గమనార్హం.‘నో పార్కింగ్’ తరహాలో..ప్రజల్లో ముఖ్యంగా యువతలో మితిమీరి పోతున్న ఈ సెల్ఫీ పిచ్చి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేప థ్యంలోనే ‘నో పార్కింగ్’ ప్రాంతాల తరహాలో మహారాష్ట్రలో ‘నో సెల్ఫీ’ ప్రాంతాలు అమల్లోకి వచ్చాయి. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన కుంభ్‌మేళాలో సెల్ఫీ ప్రియుల కారణంగా అనేక ప్రాంతాలు ఇరుకైన ప్రదేశాలుగా మారిపోయి ఇతరులకు ఇబ్బందులు కలిగించాయి. ఆయా ప్రాంతాలను దాటి వెళ్లడానికి భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో కుంభమేళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. సెల్ఫీలను నిరోధించడం కోసం ముంబై పోలీసులు నగరంలోని 16 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ సైతం ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యలు హైదరాబాద్‌లోనూ తీసుకోవాలనే అభిప్రాయంగా గట్టిగా వ్యక్తమవుతోంది.సెల్ఫీకి ముందు సప్త ప్రశ్నలుసెల్ఫీలు, రీల్స్ వల్ల ప్రమాదాలకు గురికాకుండా ఉండటం, అవి ఇతరులకు ఇబ్బందికరంగా మారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి వారు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా?(మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో)2. ఈ ప్రదేశంలో సెల్ఫీ కారణంగా తనకు కానీ తన చుట్టు పక్కల వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందా? (జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమ్మర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్వేస్, విమానా శ్రయాలు, రైల్వే ట్రాక్‌లు, వాహనాలు నడుపుతూ)3. సెల్ఫీ తీసుకుంటూ నేను ఎదుటివారు చూస్తున్న వాటికి అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా? (థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు)4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గా నికి చెందినవారి మనోభావాలు దెబ్బతీస్తు న్నామా? (ప్రార్థనా స్థలాలు)5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా?(జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు)6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా?(ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమ యాత్రలు)7. నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతకరం అవుతుందా?(పార్టీలు, రెస్ట్‌రూమ్స్ సమీపంలో, బీచ్‌ల్లో) -
సెల్ఫీ అడిక్షన్ పెరుగుతోందా.. ఈ ఏడు జాగ్రత్తలు అవసరం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 4న సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోటగిరి నాగరాజు (34) మరణం.. జూన్ 6న నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్‌గాం చెరువులో అక్కాచెల్లెళ్లు, సమీప బంధువైన ఎల్మె స్మిత (17), ఎల్మె వైశాలి (14), లహుబందే అంజలి (16) మృతి.. సెప్టెంబర్ 5న వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని లక్నాపూర్ ప్రాజెక్ట్ అలుగు వద్ద వీరరాజు (25), మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దుందుబీవాగు పరిధిలోని చెక్‌డ్యాం వద్ద కుందేళ్ల శివప్రసాద్ (23) అసువులుబాయడం.. ఇదేనెలలో సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలోని మోయతుమ్మెద వాగులో మామ అల్లుళ్లు మ్యాదరి రాజు(27), చెంచల రుషి (11) తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. ఇలా సెల్ఫీలు ‘కిల్ఫీ’లుగా మారుతున్నాయి. విహారయాత్రలను విషాదంతో నింపిన ఈ ఏడాది ఉదంతాలివి. స్టేటస్లు, ప్రొఫైల్ పిక్ తదితరాలకు సెల్ఫీల కోసం ప్రత్యేక సెల్ఫోన్లు, స్టిక్స్‌తో పాటు కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అత్యంత దారుణమైన అంశాలూ దాగి ఉంటున్నాయి. ఈ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రమాదాల బారినపడి అశువులుబాస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు సెల్పీ మరణాలకు లోనుకాగా... వీటిలో రెండు మరణాలు ఇటీవల ఒక్కరోజే జరిగాయి. యువతలో ఈ ధోరణి ఎక్కువ... సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన చాలాకాలం తర్వాత ఈ సెల్ఫీల యుగం ప్రారంభమైంది. ప్రధానంగా ఫ్రంట్ కెమెరా సౌకర్యం ఉన్న సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక, నానాటికీ వాటి రెజుల్యూషన్ పెరగడంతో ఈ క్రేజ్ మొదలైంది. అనేక మంది ప్రముఖులు సైతం బహిరంగంగా సెల్ఫీ తీసుకుంటున్న సందర్భాలు అనేకం. సెల్ఫీ మోజులో ఉంటున్న వారిలో ఎక్కువ మంది యువతే. తామున్న ప్రాంతం, పరిస్థితులు, ప్రభావాలను పట్టించుకోకుండా సెల్ఫీ దిగడానికి ఆరాటపడుతున్నారు. ఈ ధోరణితోనే ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఎక్కువగా సోషల్‌మీడియా కోసమే... సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీలు దిగే అలవాటు మరింత ఎక్కువైంది. ఒకప్పుడు కేవలం తమ, తాము తీసిన ఫొటోలనే వీటిలో పెట్టేవాళ్లు. సెల్ఫీలు తీయడం ఎక్కువైన తరవాత సోషల్ మీడియాల్లో ఎవరి ప్రొఫైల్ పిక్ చూసినా, అప్లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం సెల్ఫీలే కనిపిస్తున్నాయి. దీంతో ఒకరిని చూసి మరొకరు, ఒకరి ప్రొఫైల్స్ చూసి ఇంకొకరు... ఇలా అంతా సెల్ఫీ బాటపడుతున్నారు. ఈ ధోరణి వారితో పాటు ఇతరులకూ ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సెల్ఫీ అడిక్షన్ పెరుగుతోంది... దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో ఉపయోగాలు ఉంటున్నాయి. అదే సమయంలో కొన్ని అనర్థాలు తప్పట్లేదు. అలాంటి వాటిలో సెల్ఫీ అడిక్షన్ ప్రధానమైంది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ 2013లో సెల్ఫీ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా పరిగణించింది. లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటపడుతూ సొంతంగా తీసుకున్న చిత్రాలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసే విధానం నానాటికీ పెరిగిపోతోంది. ఇందులో భాగంగా ఎదుటి వారిని ఆకర్షించే, ఆశ్చర్యపరిచే సెల్ఫీ తీసుకోవడానికి ప్రయతి్నస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వీలున్నంత వరకు గ్రూప్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం, కౌన్సిలింగ్ పొందడం, యువతపై పెద్దల పర్యవేక్షణ ద్వారా ఈ సెల్ఫీ అడెక్షన్ నుంచి బయటపడవచ్చు. – డాక్టర్ అనిత రాయిరాల, ప్రొఫెసర్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సేఫ్టీ కోసం ‘సప్త ప్రశ్నలు’... యూత్‌కు లేటెస్ట్ క్రేజ్‌గా మారిపోయిన ఈ సెల్ఫీ ప్రమాదభరితం కాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి ఉపక్రమించే ప్రతి ఒక్కరూ... దానికి ముందు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలని కోరుతున్నారు. ఎవరి వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు, అవి వర్తించే ప్రాంతాల్లో కొన్ని ఇలా... 1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో అసలు ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా? (మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో) 2. సెల్ఫీ కారణంగా నాకు, నా చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందా? (జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్వేస్, విమానాశ్రయాలు, వాహనాలు నడుపుతూ) 3. సెల్ఫీ తీసుకుంటూ ఎదుటివారు చూస్తున్న వాటికి నేను అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా? (థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు) 4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీస్తున్నామా? (మత సంబంధ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు) 5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా? (జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు) 6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా? (ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమయాత్రలు) 7. నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతరకరం అవుతుందా? (పార్టీలు, రెస్ట్‌రూమ్స్ సమీపంలో, బీచ్‌ల్లో) ఆ రెండు చోట్లా ‘నో సెల్ఫీ’... యువతలో మితిమీరిపోతున్న ఈ సెల్ఫీ ఆసక్తి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ‘నో పార్కింగ్’ప్రాంతాల తరహాలో ‘నో సెల్ఫీ ప్రాంతాలు అమలులోకి వస్తున్నాయి. 2015లో మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన కుంభ్‌మేళాలో సెల్ఫీ ప్రియులతో అనేక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో కుంభమే ళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. వీటి వల్ల జరిగే ప్రమాదాలను నిరోధించడం కోసం ముంబై పోలీసులు ఆ నగరంలోని 29 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. కొన్నాళ్ల క్రితం గోవా అధికార యంత్రాంగం సైతం అక్కడి 23 ప్రాంతాలను ఇలానే ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ సైతం ఏర్పాటు చేసింది. -
ఘోరం: సెల్ఫీల కోసం టవర్‌పై కిక్కిరిసిన జనం, పిడుగుపాటుతో..
జైపూర్: చల్లబడిన వాతావరణం.. వానలో ‘సెల్ఫీ’ అత్యుత్సాహం ప్రాణాలు తీసింది. పిడుగుపాటుతో పదహారు మంది చనిపోగా.. డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారుల చెప్తున్నారు. ఆదివారం సాయంత్రం వాన కురుస్తుండగా అమెర్ప్యాలెస్(అమర్ ప్యాలెస్)ను సందర్శిస్తున్న వాళ్లలో కొందరు ఆనందంతో క్లాక్‌టవర్‌పైకి ఎక్కారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా టవర్‌పై పిడుగుపడింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఆ కంగారులో పక్కనున్న హిల్ ఫారెస్ట్‌లోకి కొందరు దూకేశారు. ఇప్పటిదాకా 16 మంది మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. #Rajasthan | "With the help of locals, we rescued around 29 people from the Amer Fort area after lightning struck them. They were taken to the hospital. Of these, 16 people have died," Anand Srivastava, Police Commissioner, Jaipur said yesterday Visuals from the spot. pic.twitter.com/4RJLOJ661E — ANI (@ANI) July 11, 2021 కాగా, మరో 29 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకశాం ఉందని భావిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
సెల్ఫీ సోకు.. ప్రాణం మీదకు తెచ్చుకోకు..
ఎక్కడ చూసినా, ఎవర్ని చూసినా సెల్ఫీ సెల్ఫీ. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు తిన్నా, పడుకున్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏడ్చినా సందర్భం ఉన్నా లేకున్నా సరే సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు నేటి జనం. ఎక్కడ ఉండి సెల్ఫీ దిగుతున్నామన్న ఆలోచన లేకుండా ఎక్కడ బడితే అక్కడ దిగేస్తున్నారు. లైకుల కోసం ఆరాట పడుతూ ప్రమాదకరమైన చోట్ల సెల్ఫీలు దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్) : యువతలో ఇటీవల కాలంలో సెల్ఫీల మోజు విపరీతంగా పెరిగింది. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కొత్తగా కనిపించేందుకు, లైకుల కోసం సాహసాలు చేస్తూ ఫొటోలు దిగుతున్నారు. చెరువులు, వాగులు, నదులు, కొండ లు, గుట్టలు, రైళ్లు తదితర చోట్ల ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ప్రాణాపాయం కొనితెచ్చుకుంటున్నారు. విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటూ తమ కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న మోజు యువత రోజురోజుకీ సెల్ఫీల మోజులో పడి కొట్టుకుపోతోంది. కూర్చుంటే సెల్ఫీ. నిలబడితే సెల్ఫీ, హోటల్‌కు వెళ్లినా, ప్రయాణంలో ఉన్నా.. ఇలా ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇలా సెల్ఫీలు దిగి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల సమయం వృధా తప్ప భారీ నష్టంలేదు. కానీ కొందరయితే కొండలు, గుట్టలు, నదులు, నడుస్తున్న రైళ్లు, సాహస కృత్యాలు చేస్తూ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు. ప్రాణం అంటే లెక్కలేనితనం వెనక్కి తగ్గితే పక్కన ఉన్నవారు వెక్కిరిస్తారేమోనన్న చిన్నతనంతో యువత ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. యువతలో సాహసం చేయాలనే తపన ఉండడం సహజం. అది అవసరమే అయినప్పటికీ, పది మందికి ఉపయోగపడేలా ఉండాలి. చావు బతుకుల్లో ఉన్న వారిని అపాయంలో ఉన్న వారిని రక్షించడానికి ప్రాణాలకు తెగించి సాహసాలు చెయవచ్చు. కానీ కేవలం ఒక ఫొటో కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవివేకం. సందర్భం ఏదైనా సెల్ఫీ గోలే.. నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ల రాకతో ఫొటోల గోల ఎక్కుపోతుంది. సందర్భంగా ఏదైనా సరే ఫొటో దిగాల్సిందే. వాట్సప్‌లో స్టేటస్ పెట్టాల్సిందే. ఇది ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అధికారుల వరకు నేడు సాగే ట్రెండ్. ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఎంత మంది అధికారులు, ఎంత మంది నాయకులు ఉంటారో అంతమంది ఒక ఫొటో దిగాల్సిందే. ఈ సెల్ఫీల గోల యువత నుంచి వయస్సు మళ్లిన వారికి పాకింది. దీంతో వారు కూడా సందర్భం ఏదైనా సెల్ఫీ మోజులో పడిపోతున్నారు. గతంలో జిల్లాలో ఓ యువకుడి మృతి భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పులకు చెందిన ఇందపురపు దినేశ్(22) గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన కప్పల వాగు చెక్‌డ్యాం వద్ద సెల్ఫీ దిగుతూ నీటి పడిపోయాడు. నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించారు. వారు వచ్చి గాలింపు చర్యలు చేపట్టగా రెండు రోజుల అనంతరం మృతదేహం లభ్యమైంది. సెల్ఫీల మోజు బాగా పెరిగింది సాంకేతికతను పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అతిగా సెల్‌ఫోన్ వినియోగంచడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక యువతకు సెల్ఫీ మోజు బాగా పెరిగింది. సెల్ఫీ మోజులో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. – నిజాం, ప్రిన్సిపాల్, రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల తల్లిదండ్రులు నియంత్రించాలి అనవసరమైన వయస్సులో పిల్లలకు సెల్‌ఫోను ఇవ్వకూడదు. యువత ఫోన్లను విపరీతంగా వాడుతోంది. సరదా కోసం తీస్తున్న సెల్ఫీలు చివరకు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. –గోవర్ధన్‌రెడ్డి, హెచ్ఎం ఉప్పల్వాయి -
23 రోజులుగా మృత్యువుతో పోరాడి.. చివరికి
టీ.నగర్ : తమిళనాడులో సెల్ఫీ మోజు సోమవారం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రానికి చెందిన హరి ఓం సింగ్ వేలూరులోని ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీన హరి ఓం సింగ్ కాట్పాడి సమీపంలోగల సేవూరు రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న గూడ్సు రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీ దిగుతున్న సమయంలో ఒక్కసారిగా హై ఓల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి హరిఓం సింగ్ షాకుకు గురై గాయపడ్డాడు. దీంతో హరి ఓం సింగ్‌ను వెంటనే వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మిలటరీ ఆసుపత్రిలో చేర్పించగా 23రోజులుగా మృత్యవుతో పోరాడిన హరి ఓం సింగ్ మంగళవారం మృతిచెందాడు. మరో ఘటనలో వేలూరు జిల్లా వాణియంబాడి కలంద్ర గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి మృతి చెందాడు. మురళి తన స్నేహితులైన మణికంఠన్, విజయ్‌కుమార్‌లతో కలిసి పోలూరు సమీపంలోని జమునామరత్తూరు కొండకు సోమవారం విహారయాత్రకు వెళ్లారు. ఆ సమయంలో మురళి, మణికంఠన్‌లు బండ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు సెల్ఫీ దిగుతుండగా జారి పడడంతో మురళికి బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు. -
ప్రాణాంతకంగా సెల్ఫీ పిచ్చి
జూబ్లీహిల్స్: సరదా కోసం సొంతంగా సెల్ఫోన్లో తీసుకునే ఫొటో సెల్ఫీ ప్రస్తుతం వేలం వెర్రిగా మారింది. అయితే, ఈ సరదా తరచూ ప్రాణాంతకంగా మారుతోందని, ఎందరో ప్రాణాలను సైతం హరిస్తోందని తాజా అధ్యయనం చెబుతోంది. కొండకోనలు, స్కై స్కాపర్లు, రైల్యేలైన్లు, సముద్రతీరాలు.. ఇలా ఇక్కడా అక్కడా అనికాకుండా ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగుతూ పలువురు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ‘జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్’ అనే మెడికల్ జర్నల్ తాజా అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది. అక్టోబర్ 2011 నుంచి నవంబర్ 2017 వరకు చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సెల్ఫీలు దిగుతూ దేశవ్యాప్తంగా కనీసం 259 మంది మృత్యువాత పడ్డారని, అంతకంటే ఎక్కువ మంది గాయపడ్డారని పేర్కొంది. ఇదేకాలంలో అమెరికాలో 14 మంది, రష్యాలో 16 మంది, పాకిస్థాన్‌లో 14 మంది మృతి చెందారని పేర్కొంది. ఇదే సమయంలో ప్రమాదరక షార్క్ చేపల దాడుల్లో కేవలం 50 మంది మాత్రమే మృతి చెందిన విషయాన్ని గుర్తుచేసింది. దాదాపు 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఏకంగా 80 కోట్లకు పైగా సెల్ఫోన్లు వాడుతున్నారని, వీరిలో ఎక్కువగా యువతనని పేర్కొంది. సెల్ఫీలు దిగడం ఒకవెర్రిలా మారిపోయిందని, చిత్ర విచిత్రమైన పద్ధతులు, పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారని అధ్యయనం పేర్కొంది. ఓ యువతి కెనడాలో పర్వతం అధిరోహిస్తూ సెల్ఫీ దిగే ప్రయత్నంలో కలు జారిపోయి చనిపోయిందని, కొందరు శవయాత్రల్లో సెల్ఫీలు దిగుతున్నారని, జర్మనీలోని నాజీ డెత్ క్యాంపుల్లో సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తున్నారని, మరికొందరు ట్రాఫిక్ రద్దీలో బైక్ నడుపుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారని పేర్కొంది. ఇక దేశంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో సెల్ఫీల రద్దీ పెరిగిపోయి స్థానికులకు ఇబ్బందిగా మారినట్టు పేర్కొంది. సెల్ఫీ వేలంవెర్రిని అదుపు చేయలేక ముంబైలో పోలీసులు ఏకంగా 16 ప్రాంతాలను ‘నో సెల్ఫీజోన్స్’గా ప్రకటించారంది. స్వీయ నియంత్రణ, సంయమనంతో సెల్ఫీ జాడ్యాన్ని అధిగమించాలని జర్నల్ అభిప్రాయపడింది. -
సెల్ఫీ విషాదం
హొసూరు: సెల్ఫీ వ్యసనం ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది. హొసూరు సమీపంలోని కెలవరపల్లి డ్యాం వద్ద సెల్ఫీ తీసుకుంటూ ఇద్దరు డ్యాం నీటిలో కొట్టుకుపోతుండగా వీరిని కాపాడేందుకు వెళ్లిన ఇం జినీరింగ్ విద్యార్థి ఒకరినికాపాడి అతడూ ప్ర మాదంలో చిక్కుకుని మరణించాడు. ఈ సంఘట న శనివారం హొసూరు వద్ద విషాదాన్ని నింపింది. ఎలా జరిగిందంటే... వివరాలు... బెంగళూరు రాజేశ్వరినగర్‌కు చెందిన దేవేందర్ అలియాస్ ధర్మేంద్రన్ (21) హొసూరులోని ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగి. శనివారం విద్యుత్ కోత కారణంగా పరిశ్రమకు సెలవు కావడంతో స్నేహితునితో కలిసి సమీపంలోని కెలవరపల్లి డ్యాం వద్దకు వెళ్లారు. డ్యాం మూడు గేట్లను ఎత్తి ఉండడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవేందర్ గేటు సమీపంలోకి వెళ్లి స్నేహితునితో కలిసి సెల్ఫీ దిగేందుకు యత్నించగా ఇద్దరూ పట్టుతప్పి ప్రవాహంలో చిక్కుకున్నారు. డ్యాంపై నుండి దీనిని గమనించిన కారైకుడికి చెందిన కేశవన్ (22) అనే విద్యార్థి నీటిలోకి దూకి ఒకరిని ఒడ్డుకు చేర్చాడు. కేశవన్ హొసూరు ఆదియమ్మాన్ కళాశాలలో బీఈ పైనల్ ఇయర్ చదువుతున్నాడు. దేవేందర్‌ను కాపాడే ప్రయత్నంలో కేశవన్ ప్రవాహంలోకి జారిపోయి నీటమునిగాడు. కృతజ్ఞత మరచి పరారీ ఈలోగా ఒడ్డుకు సురక్షితంగా చేరిన వ్యక్తి కేశవన్ కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదు. తనను కాపాడాడు అన్న కృతజ్ఞత కూడా లేకుండా అక్కడి నుండి పరారయ్యాడు. ఈ విషయంపై సమాచారమందుకొన్న అగ్నిమాపక సిబ్బంది, హడ్కో పోలీసులు సంఘటనా స్థలానికెళ్లి గేట్లను మూసి ధర్మేంద్రన్, కేశవన్‌ల మృతదేహాలను బయటకు తీసి హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద సంఘటన తెలిసి పెద్దసంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
సెల్ఫీ మరణాలు : భారత్‌కు తొలిస్థానం
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్ది సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు మృతి చెందుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా విడుదల చేసిన ఓ సర్వేలో సెల్ఫీల వల్ల ప్రమాదాల బారిన పడుతున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. టూరింగ్ స్పాట్‌గా గుర్తింపు పొందిన గోవాలో అత్యధికంగా 24 ప్రదేశాలను నాన్ సెల్పీ జోన్లుగా గుర్తించారు. జలపాతాలు, ఎత్తైన కొండల వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి పర్యాటకులు ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. ఇటీవల తమిళనాడులో ఇద్దరు టూరిస్ట్‌లు సముద్రంలో సెల్ఫీ తీసుకుంటూ నీట మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదకరమైన ప్రాంతాలు అని బోర్డులు పెట్టినా కూడా పట్టించుకోని పరిస్థితి. 2016 గణంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 126 సెల్ఫీ మరణాలు సంభవిస్తే వాటిలో 76 మరణాలు మన దేశంలోనివే. పాకిస్తాన్లో తొమ్మిది మంది మరణించారు(రెండో స్థానం). సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు మరణించిన వారిలో ఎక్కువగా యువకులు ఉండటం విచారకరం. 2014లో ముంబైలో 10 మంది యువకులు నది వద్ద సెల్ఫీ దిగుతూ జారి పడటంతో ఏడుగురు మృతి చెందారు. 2016లో హైదరాబాద్‌లో ఓ యువకుడు వేగంగా వెళ్తున్న ట్రైన్ పక్కన నుంచి సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించాడు. ట్రైన్ దూరాన్ని అంచనా వేయలేకపోవడంతో ట్రైన్ ఢీ కొట్టి చనిపోయాడు. ఇటీవల పోర్చుగీస్‌లోని ఓ పట్టణంలోని ఆస్ట్రేలియాకు చెందిన జంట 30 అడుగుల ఎత్తు నుంచి సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి లోయలో పడి దుర్మరణం పాలైయ్యారు. -
సెల్ఫీ మోజులో ప్రాణాలు హరీ
-
ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా సెల్ఫీ
-
సెల్ఫీ పిచ్చి: ఫ్రెండ్ ప్రాణం పోతున్నా.. పట్టించుకోలేదు!
సెల్ఫీల మోజులో పడి, జీవితం విలువను మర్చిపోతున్నారు యువత. ఓ వైపు ఫ్రెండ్ ప్రాణం పోతున్నా.. పట్టించుకోకుండా గ్రూఫ్ సెల్ఫీ తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. జ్ఞాపకార్థం కోసం తీసుకునే ఈ సెల్ఫీ ఫోటోలే, వారికి ఆఖరి క్షణాలుగా మిగులుస్తున్నాయి. ఇదే రకమైన ఓ విషాదకర సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. జయనగర్‌లోని నేషనల్ కాలేజీ స్టూడెంట్ విశ్వాస్ చెరువులో మునిగిపోయాడు. అదే సమయంలో తన స్నేహితులందరూ కలిసి సెల్ఫీ దిగే మోజులో పడిపోయారు. తన ఫ్రెండ్ చెరువులో మునిగిపోతున్న దృశ్యం, వారు సెల్ఫీ తీసుకునే బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్నా, వారు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా గ్రూప్ సెల్ఫీ పిచ్చిలోనే విహరించారు. ఈ క్రమంలోనే విశ్వాస్ చెరువులో మునిగిపోయి మరణించాడు. విశ్వాస్ తన ఎన్సీసీ క్యాండెట్లతో కలిసి, రామనగర జిల్లాలోని కనకపుర సమీపంలోని రవగొండలు బెట్టా ప్రాంతానికి పిక్నిక్కు వెళ్లాడు. వీరు గ్రూప్‌గా తీసుకున్న ఒక సెల్ఫీలో వెనుకవైపు విశ్వాస్ కొలనులో మునిగిపోతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. -
భారత్ టాప్.. పాకిస్థాన్ సెకండ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ అభివృద్ది చెందిన తర్వాత ప్రపంచం ఓ కుగ్రామంలా మారిపోయింది. సెల్‌ఫోన్‌తోనే ఎన్నో వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్.. ఏదైనా సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని, వాటికి బానిసలుగా మారినా, దుర్వినియోగం చేసినా దుష్పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ మరణాలే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు. తాజ్‌మహల్ లేదా ఏ చారిత్రక కట్టడం ముందో దర్జాగా సెల్ఫీ తీసుకోవచ్చు. అయితే రన్నింగ్ ట్రైన్ ముందు, గన్‌తో పోజులిస్తూ, కొండ అంచున నుంచుని సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ప్రమాదం తప్పకపోవచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు దక్కవు. ఇలా ప్రయత్నించి మరణించిన వారు చాలా మంది ఉన్నారు. విషాదం ఏంటంటే సెల్ఫీ మరణాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. పొరుగుదేశం పాకిస్థాన్ తర్వాతి స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ఫీ మరణాలపై అధ్యయనం చేశాయి. 2014 మార్చి నుంచి ఇప్పటివరకు 127 మంది సెల్ఫీ మరణాలు సంభవించాయని గుర్తించారు. భారత్‌లో సెల్ఫీ తీసుకుంటూ 76 మంది మరణించారు. పాకిస్థాన్‌లో తొమ్మిదిమంది, అమెరికాలో ఎనిమిదిమంది, రష్యాలో ఆరుగురు ఇలాగే చనిపోయారు. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ జనాభా ఎక్కువని, అందుకే సెల్ఫీ మరణాలు ఎక్కువ సంభవించాయని అధ్యయనం చేసిన వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల చైనాలో సెల్ఫీ తీసుకుంటూ చనిపోయినవారు కేవలం నలుగురేనని వెల్లడించింది. గతవారం ఉత్తర భారతదేశంలో రన్నింగ్ ట్రైన్ ముందు నిల్చుని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. అలాగే పడవలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి మరణించినవారు ఉన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్పీలు తీసుకోవడానికి యువత మోజు పడుతుండటమే ప్రమాదాలకు కారణమని అధ్యయనంలో తేలింది. -
పర్యాటక ప్రదేశాల్లో సెల్ఫీ డేంజర్ జోన్లు
న్యూఢిల్లీ: పర్యాటక ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగే చోట ‘సెల్ఫీ డేంజర్ జోన్’ బోర్డులు పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇటీవల పర్యాటక ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ అనేకమంది చనిపోతుండడంతో పర్యాటక శాఖ పలు సూచనలతో రాష్ట్రాలకు లేఖలు రాసింది. ప్రమాదాలకు ఆస్కారమున్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి, ఈ హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 27 సెల్ఫీ మరణాలు నమోదు కాగా, అందులో 15 మనదేశంలోనే సంభవించాయి. -
సెల్ఫ్ కిల్లింగ్..!
సెల్ఫీ యువత పాలిట సెల్ఫ్ కిల్లింగ్ మారుతోంది. స్మార్ట్ ఫోన్ తో తమకు తాముగా ఫొటోలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిలో యువతీయువకులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మనదేశంలో సెల్ఫీ మరణాలు అత్యధికంగా సంభవిస్తుండడం మరింత భయాందోళన రేకిత్తిస్తోంది. స్వీయ చిత్రం తీసుకుని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో సన్నిహితులతో పంచుకోవాలన్న వెర్రితో యువత ప్రాణాలను ఫణంగా పెట్టడం ప్రమాదకర పరిణామం. తాజాగా చెన్నైలో వేగంగా వస్తున్న రైలు ముందు పరిగెత్తుతూ సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన ఓ 16 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలవడం సంచలనం రేపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 27 సెల్ఫీ మరణాలు నమోదు కాగా, ఇందులో సగం మనదేశంలోనే చోటుచేసుకున్నాయని అమెరికా అగ్రశేణి దినపత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. ఇటీవల ముంబైలోని బండ్ స్టాండ్ ప్రాంతంలో అరేబియా సముద్రం ఒడ్డున నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా ముగ్గురు కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు సముద్రంలోకి దూకిన వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. సెల్ఫీల పిచ్చి ముదిరిపోవడంతో నిరుడు నాసిక్ కుంభమేళాలో పలు చోట్ల నాన్-సెల్ఫీ జోన్స్ ఏర్పాటు చేశారు. సెల్ఫీ మరణాలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. స్వీయ చిత్రాలు తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంది. సెల్ఫీలపై ప్రజలకు అప్రమత్తం చేసేందుకు ముంబై పోలీసులు తమ వంతు ప్రయత్నం మొదలుపెట్టారు. కొన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని 'నో సెల్ఫీ జోన్స్' గా గుర్తించారు. ఫొటో కంటే ప్రాణాలు ముఖ్యమని 'సెల్ఫీ'షులకు హితబోధ చేస్తున్నారు. గతేడాది చోటుచేసుకున్న సెల్ఫీ మరణాలు జనవరిలో ఆగ్రాకు వెళుతూ ముగ్గురు విద్యార్థులు రైల్వే ట్రాక్ పై నిలబడి వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డారు. మార్చిలో నాగపూర్ లో ఓ సరస్సులో ప్రయాణిస్తూ బోటులో నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో అది తిరగబడడంతో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో కొల్లి హిల్స్ లో స్వీయచిత్రం తీసుకుంటూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. అతడు నిలుచున్న బండరాయి పైనుంచి పడిపోవడంతో తలకు గాయమై మృతి చెందాడు. నవంబర్ లో గుజరాత్ లో ఇద్దరు విద్యార్థులు సెల్ఫీ తీసుకుంటూ నర్మదా నదిలోకి పడిపోయారు. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. -
సెల్ఫీల కోసం 'చచ్చి' పోతున్నారు!
ఫొటోలలో ఇప్పుడు సెల్ఫీల హవా కొనసాగుతోందన్నది వాస్తవం. కొందరు చాలా సురక్షితమైన ప్రదేశాల్లో తీసుకుంటుండగా, మరికొందరు ప్రమాదకర పరిస్థితులలో కూడా సెల్ఫీలు తీసుకుని తమ సరదాను తీర్చుకుంటున్నారు. ఈ సెల్ఫీలకు సామాన్యుడా.. అధ్యక్షుడా.. అనే తేడాలు లేవు. కానీ సెల్ఫీల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫ్రంట్ కెమెరా మరింత అభివృద్ధి చెందిన తర్వాత ఈ సెల్ఫీ క్రేజు రోజురోజుకూ పెరిగిపోతోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 నుంచి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని మోదీ వరకూ అందరూ సెల్ఫీలు తీసుకుని సామాజిక వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తుండటంతో వారిని సామాన్య ప్రజానికం అనుసరిస్తున్నారు. టెక్సాస్ లో గన్ పట్టుకుని సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ తండ్రి సహా ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. ఈఫిల్ టవర్ లాంటి ఎత్తైన నిర్మాణాలు, ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకుంటే నేరంగా పరిగణించాలని యూరోపియన్ యూనియన్ చట్టాన్ని తీసుకొచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. ఈ జూన్ లోనే ఓ గ్రనేడ్ పిన్ లాగుతున్నట్లుగా ఫోజు ఇస్తూ యూరల్ పర్వతాలపై సెల్ఫీ తీసుకునే యత్నంలో ఇద్దరు మరణించారు. సెల్ఫీలు తీసుకోవడం అనే అంశం వచ్చేసరికి.. మనం సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తిస్తామని ఓహియో వర్సిటీ ప్రొఫెసర్ జెస్సీ ఫాక్స్ పేర్కొన్నారు. తాజాగా అమెరికాలో ఓ యువకుడు గన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా బుల్లెట్ ...స్మిత్ గొంతులోకి దూసుకెళ్లి అక్కడిక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. మహిళలూ అంతే క్రేజీగా.. రష్యా రాజధాని మాస్కోలో బ్రిడ్జి పట్టుకుని వేలాడుతున్నట్లు సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ యూనివర్సిటీ విద్యార్థిని చనిపోయిన విషయం విదితమే. రైలుపై నిల్చుని కరెంటు తీగలును పట్టుకుంటున్నట్లుగా ఫొజిస్తూ సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ విద్యార్థిని ఆహుతయిన విషయాన్ని అంత త్వరగా మరిచిపోలేం. సెల్ఫీ కేంద్రాలు.. సెల్ఫీ పిచ్చి అధికంగా వారి కోసం ఆస్ట్రేలియా వాళ్లు ఏకంగా ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సెల్ఫీ కోసం వాళ్లు ఏకంగా ఓ యాప్ ప్రారంభించారు. దీంతో వినూత్నంగా సెల్ఫీలు తీసుకోవాలనేవాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దేశాల్లో సెల్ఫీలపై నిషేధం విధిస్తూంటే.. మరికొన్ని దేశాలు ఇలా కొత్త ప్రయోగాలు చేస్తుండటం వింతగా అనిపిస్తోంది. కొన్ని దేశాల శాస్త్రవేత్తలు ఈ సెల్ఫీల గురించి ప్రస్తావిస్తూ.. సెల్ఫీలు తీసుకోవడం అనేది ఓ మానసిక రుగ్మత అని కుండబద్దలుకొట్టి చెబుతున్నారు.