పర్యాటక ప్రదేశాల్లో సెల్ఫీ డేంజర్ జోన్లు
న్యూఢిల్లీ: పర్యాటక ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగే చోట ‘సెల్ఫీ డేంజర్ జోన్’ బోర్డులు పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇటీవల పర్యాటక ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ అనేకమంది చనిపోతుండడంతో పర్యాటక శాఖ పలు సూచనలతో రాష్ట్రాలకు లేఖలు రాసింది.
ప్రమాదాలకు ఆస్కారమున్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి, ఈ హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 27 సెల్ఫీ మరణాలు నమోదు కాగా, అందులో 15 మనదేశంలోనే సంభవించాయి.