సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్ది సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు మృతి చెందుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా విడుదల చేసిన ఓ సర్వేలో సెల్ఫీల వల్ల ప్రమాదాల బారిన పడుతున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. టూరింగ్ స్పాట్‌గా గుర్తింపు పొందిన గోవాలో అత్యధికంగా 24 ప్రదేశాలను నాన్ సెల్పీ జోన్‌లుగా గుర్తించారు. జలపాతాలు, ఎత్తైన కొండల వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి పర్యాటకులు ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. ఇటీవల తమిళనాడులో ఇద్దరు టూరిస్ట్‌లు సముద్రంలో సెల్ఫీ తీసుకుంటూ నీట మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదకరమైన ప్రాంతాలు అని బోర్డులు పెట్టినా కూడా పట్టించుకోని పరిస్థితి.
2016 గణంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 126 సెల్ఫీ మరణాలు సంభవిస్తే వాటిలో 76 మరణాలు మన దేశంలోనివే. పాకిస్తాన్‌లో తొమ్మిది మంది మరణించారు(రెండో స్థానం). సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు మరణించిన వారిలో ఎక్కువగా యువకులు ఉండటం విచారకరం. 2014లో ముంబైలో 10 మంది యువకులు నది వద్ద సెల్ఫీ దిగుతూ జారి పడటంతో ఏడుగురు మృతి చెందారు. 2016లో హైదరాబాద్‌లో ఓ యువకుడు వేగంగా వెళ్తున్న ట్రైన్ పక్కన నుంచి సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించాడు. ట్రైన్ దూరాన్ని అంచనా వేయలేకపోవడంతో ట్రైన్ ఢీ కొట్టి చనిపోయాడు. ఇటీవల పోర్చుగీస్‌లోని ఓ పట్టణంలోని ఆస్ట్రేలియాకు చెందిన జంట 30 అడుగుల ఎత్తు నుంచి సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి లోయలో పడి దుర్మరణం పాలైయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment