తిరువళ్లూరు: డెంగీ జ్వరంతో జిల్లాలో ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో జిల్లా ప్రజలకు స్వైన్‌ఫ్లూ ద్వారా వస్తున్న మరో ప్రమాదం ప్రజల్లో కలవరానికి గురిచేసింది. గత సంవత్సరం తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా నమోదు కావడంతో పాటు దాదాపు పది మందికి పైగా మృతి చెందారు. అప్పట్లో డెంగీ రూపంలో వచ్చిన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా తేరుకోక ముందే స్వైన్‌ఫ్లూ విజృంభించడం ప్రజలను మరింత ఆందోళన గురి చేసింది. ఇటీవలే తిరుత్తణి ప్రాంతానీకి చెందిన వీరరాఘవన్ స్వైన్‌ఫ్లూ భారిన పడి మృతి చెందగా, గుమ్మిడిపూండిలో మరో ముగ్గురు స్వైన్‌ఫ్లూ భారిన పడి మృతి చెందారు.
ఈ సంఘటన జిల్లాలో తీవ్ర అలజడి సృష్టించగా, అప్రమత్తమైన జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. స్వైన్‌న్‌ఫ్లూ భారిన పడిన వారికి చిక్సిత అందించడానికి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిరువళ్లూరు వైద్యశాలలో చేరిన ఇద్దరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టుగా గుర్తించారు. కాకలూరు ప్రాంతానికి చెందిన కుమరేషన్, తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన రంజిత్‌కు స్వైన్‌ప్లూ ఉన్నట్టు నిర్ధారించి వారికి చిక్సిత అందిస్తున్నారు.
జిల్లాలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు
Published Wed, Feb 8 2017 2:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
Advertisement
Advertisement