24న ఉత్తమ విలన్? | uttama villain movie release on 24th april ? | Sakshi
Sakshi News home page

24న ఉత్తమ విలన్?

Published Mon, Apr 6 2015 1:28 AM | Last Updated on Thu, Sep 19 2019 9:06 PM

24న ఉత్తమ విలన్? - Sakshi

24న ఉత్తమ విలన్?

ఉత్తమవిలన్ చిత్ర విడుదల మరోసారి వాయిదాపడిం ది. ఇది కమలహాసన్ అభిమానుల కు నిరుత్సాహం కలిగించే విషయమే. కమలహాసన్, పూజాకుమార్, ఆండ్రియా, ఊర్వశి, పార్వతిమీనన్, పార్వతినాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉత్తమవిలన్. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ
 
 చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మించింది. విడుదల హక్కులను ఇరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఈ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఉత్తమవిలన్ ఏప్రిల్ 10న తెరపైకి రావడం లేదు. అందుకు కారణాలంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. సెన్సార్ కార్యక్రమాల్లో జాప్యం కారణంగానే చిత్రం విడుదల వాయిదా పడిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే చిత్రానికి గ్రాఫిక్స్ వర్కు పూర్తి కాలేదట. ఉత్తమవిలన్ చిత్రంలోని సుమారు 25 సన్నివేశాలకు గ్రాఫిక్స్ చేయాల్సి ఉందట.
 
 ఈ గ్రాఫిక్స్‌ను మార్చి 27వ తేదీ కల్లా పూర్తి చేయాల్సి ఉండగా పలు కారణాల వలన ఆలస్యం అయ్యిందట. కమలహాసన్ చిత్రాలకు గ్రాఫిక్స్ రూపొందించే మధుసూదన్ ఈ ఉత్తమవిలన్‌కు గ్రాఫిక్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిన ఈ చిత్రం కోసం ఆయన రేయింబవళ్లు శ్రమిస్తున్నారట. అయితే ఏ విషయంలోనైనా పర్ఫెక్షన్ కోరుకునే కమలహాసన్ ఆలస్యం అయినా ఫర్వాలేదు చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు బ్రహ్మాండంగా ఉండాలని ఆశిస్తుండడంతో ఈచిత్ర విడుదల వాయిదా పడింది. చిత్రం ఈ నెల 24న గాని, మే1గాని విడుదలయ్యే అవకాశం ఉం దని చిత్ర వర్గాలు అంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement