న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి వైభవోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వాని, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం ఉదయం అంకురార్పణ జరిగింది. నవంబర్ 8న జరిగే పుష్పయాగంతో వైభవోత్సవం ముగియనుంది. ప్రతి రోజు సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, విశేష పూజ, సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ, వీధోత్సవం, రాత్రి కైంకర్యం, ఏకాంత సేవలు ఉంటాయి.
విశేష పూజగా సుదర్శన హోమం, వసంతోత్స వం, అష్టాదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, అభిషేకం, శ్రీనివాస కల్యాణం, పుష్పయాగం నిర్వహిస్తారు. శ్రీనివాసుడి వైభవోత్సవానికి ప్రధాని మోదీతో పాటు, కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, స్మృతీ ఇరానీ, సురేష్ ప్రభు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కానున్నారు.
ఢిల్లీలో శ్రీనివాసుడి వైభవోత్సవం ప్రారంభం
Published Fri, Oct 30 2015 6:09 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM
Advertisement
Advertisement