విమ్స్ వైద్యుడు రామరాజుకు అంతర్జాతీయ అవార్డు
Published Mon, Oct 7 2013 3:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : ఆసియా ఓసియానియా ఫెడరేషన్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సంస్థ బెస్ట్ యంగ్ గైనకాలజిస్ట్ అవార్డుకు బళ్లారి విమ్స్‌కు చెందిన డాక్టర్ రామరాజు ఎంపికయ్యారు. గర్బిణులు, పౌష్టికాహారం, తల్లిపాల ఉపయోగం.. ఇతరత్రా అంశాలపై ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. అంతర్జాతీయంగా రెండేళ్లకొకసారి డాక్టర్ షాన్ ఎస్.రత్నంపేరు మీద 24 దేశాలకు చెందిన గైనకాలజిస్ట్‌లకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు భారతదేశం తరుఫున విమ్స్ వైద్యుడు డాక్టర్ రామరాజు ఎంపికయ్యారు. ఈ అవార్డును బ్యాంకాక్‌లో అక్టోబర్ 20 నుంచి 23 వరకు జరిగే అంతర్జాతీయ సమావేశంలో డాక్టర్ రామరాజుకు ప్రదానం చేయనున్నారు.
మాతాశిశు మరణాల నివారణ, తల్లిపాల ప్రాధాన్యత, పౌష్టికాహారం తదితర అంశాలపై డాక్టర్ రామరాజు బళ్లారి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాం తాలు, పాఠశాలల్లోనూ వందకుపైగా పైగా జా గృతి కార్యక్రమాలను నిర్వహించారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో జరిగిన వైద్యసదస్సుల్లో పాల్గొని గైనకాలజీ వైద్యంపై ప్రజంటేషన్ చేశారు. ఈయన సేవలను గుర్తించి 2011లో ఆసియా ఓసియానియా ఫెడరేషన్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సంస్థ చైనాలోని తైవాన్ రాజధాని తైపీలో జరిగిన సమావేశంలో దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ యూత్ సర్వీస్ ప్రశస్తిని అందించింది. అవార్డుకు ఎంపికైన డాక్టర్ రామరాజును విమ్స్ సంచాలకుడు డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, వైద్యులు అభినందించారు.
Advertisement
Advertisement