Vims
-
విశాఖ ప్రజలకు పెద్దదిక్కుగా మారిన విమ్స్
-
బాలిక కడుపులో వెంట్రుకల ముద్ద
ఆరిలోవ(విశాఖ తూర్పు): తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్న బాలికకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి స్వస్థత చేకూర్చారు వైద్యులు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో ఆధునిక పద్ధతిలో ఈ సర్జరీ చేశారు. విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాలివి.. రాజమండ్రికి చెందిన 13 ఏళ్ల బాలిక కొద్ది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడేది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకువెళ్లినా తగ్గకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 19న విశాఖలో విమ్స్‌కు తీసుకు వచ్చారు. ఇక్కడి వైద్యులు ఆ బాలికకు ఎండోస్కోపీ చేసి కడుపు లోపల వెంట్రుకలతో కూడిన పదార్థం ముద్దగా ఉన్నట్లు గుర్తించారు. దీనిని ట్రైకోబెజార్ వ్యాధిగా నిర్థారించారు. దీంతో ఈ నెల 23న లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి బాలిక కడుపులో ఉన్న వెంట్రుకలతో ఉన్న 300 గ్రాముల పదార్థాన్ని తొలగించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించారు. అరుదైన శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న బాలికను శనివారం డిశ్చార్జి చేశారు. 50 ఏళ్లలో 68 మందికి మాత్రమే.. ఇలాంటి వ్యాధి అరుదుగా వస్తుందని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. 50 ఏళ్లలో దేశంలో 68 మందికి మాత్రమే ఈ తరహా శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. విమ్స్‌లో చిన్నారికి జరిగిన సర్జరీ 68వది అని తెలిపారు. సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులను అభినందించారు. బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేసి తమ కుమార్తె ప్రాణాలను కాపాడారని విమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ స్రవంతి బృందం, విమ్స్ ఆర్ఎంవో డాక్టర్ విజయకుమార్ పాల్గొన్నారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
విమ్స్‌లో ముక్కు ద్వారా వేసే కరోనా టీకా ట్రయల్స్
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ డ్రాప్స్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. ఎథిక్స్ కమిటీ అనుమతుల మేరకు విమ్స్‌లో మొదలు పెట్టామన్నారు. ఇప్పటివరకు కేవలం ఇంట్రా మస్క్యులర్ ఇంజక్షన్ రూపంలో మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని చెప్పారు. అలా కాకుండా పోలియో డ్రాప్స్ తరహాలో ముక్కు ద్వారా వేసే టీకాను భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిందన్నారు. ఇంజక్షన్ టీకా కంటే డ్రాప్స్ టీకా వల్ల వచ్చే యాంటీబాడీస్ సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు మొదటి, రెండు ట్రయల్ రన్స్‌లో తేలిందని చెప్పారు. ట్రయల్ రన్లో భాగంగా 18 ఏళ్లు దాటిన 3,160 మందికి టీకా వేయనున్నట్టు తెలిపారు. ఇంజక్షన్ టీకా తరహాలోనే మొదటి డోసు వేసుకున్న 28 రోజుల అనంతరం రెండో డోసు వేస్తామన్నారు. ఇంజక్షన్‌గా వేసే టీకా ద్వారా ఒక రకమైన రక్షణ ఉంటే.. ముక్కులో వేసే డ్రాప్స్ టీకా ద్వారా రెండురకాల రక్షణ ఉంటుందని చెప్పారు. చదవండి: (డీజిల్ బస్సులకు టాటా.. ఇ–బస్సులకు స్వాగతం) ఇంజక్షన్ టీకాతో సిస్టమిక్ ఇమ్యూనిటీ మాత్రమే ఉంటుందని, డ్రాప్స్ టీకా వల్ల సిస్టమిక్‌తో పాటు, మ్యూకోజల్ ఇమ్యూనిటీ లభిస్తుందని ఆయన తెలిపారు. మూడోదశ ట్రయల్స్ ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్ రాంబాబు, సహాయ పరిశోధకుడిగా డాక్టర్ పి.విజయకుమార్, సహాయకులుగా డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ షాఫినా వ్యవహరిస్తున్నారు. -
ఇకపై కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని స్టేట్ కోవిడ్ ఆస్పత్రి విమ్స్‌ను మంత్రి అవంతి శ్రీనివాసరావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విమ్స్‌లో లోపాలపై బాధిత కుటుంబ సభ్యులు మంత్రికి ఫిర్యాదు చేయగా ఆయన స్పందించారు. తన భర్త చనిపోయినా సమాచారం ఇవ్వలేదంటూ ఓ మహిళ ఆరోపించగా విమ్స్‌లో వైద్య సిబ్బంది కొరత ఉందని అన్నారు. దాంతోనే సమాచారం లోపం తలెత్తిందని చెప్పారు. దీనిపై విచారణ కమిటీ వేశామని తెలిపారు. ఇప్పటివరకు కోవిడ్ బాధితుల ఫోన్ నెంబర్లు మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారని, బాధితుడు మృతి చెందిన సందర్భాల్లో వారి కుటుంబాలకు సమాచారం అందడంలేదని తెలిపారు. ఇకపై కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యుల పోన్ నెంబర్లు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. విమ్స్‌లో సమాచారం లోపం తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. (చదవండి: వినయ విధేయ తహసీల్దార్) ఇప్పుటివరకు విమ్స్‌లో 180 మంది కరోనాతో చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం 595 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 300 పైగా డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 80 మంది మాత్రమే ఉన్నారని, వారు కుడా ఓ వారం పనిచేసి మరో వారం హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారని తెలిపారు. కొంతమంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారని మంత్రి గుర్తు చేశారు. వైద్య సిబ్బంది పని చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. కోవిడ్ సమయంలో పని చేయడానికి వైద్యులు, నర్సులు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. విమ్స్ ఆస్పత్రి, వైద్యులపై తప్పుడు ప్రచారం తగదని హితవు పలికారు. మీడియా కూడా తప్పుడు వార్తలకి ప్రాధాన్యం ఇవ్వకూడదని కోరారు. దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ కరోనా పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. (తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : విమ్స్ డైరెక్టర్) -
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : విమ్స్ డైరెక్టర్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(విమ్స్) ఆస్పత్రిలో కరెంటు సరఫరాలో ఎక్కడా ఆటంకం లేదని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. పవర్ సప్లై ఆగినట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాలలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. విమ్స్‌లో కరెంటు నిరంతరంగా ఉందని చెప్పారు. కోవిడ్ పేషెంట్లు తప్పుడు ప్రచారాలని నమ్మి ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. -
విశాఖ విమ్స్ కు వైఎస్ఆర్ అంకురార్పణ
-
వైఎస్ వరం ప్రైవేట్ పరం
విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) నిర్వహణలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశంలో 100 రోజుల్లో పూర్తి స్థాయిలో విమ్స్‌ను ప్రారంభించి ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానించారు. ఈ తీర్మానం రెండేళ్లపాటు గాలిలో గిరిగిరా తిరిగింది. వైఎస్సార్ సీపీ, వామ పక్షాలు, స్వచ్ఛంద సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం 2016 ఏప్రిల్ 11న సేవలు ప్రారంభించింది. అయినా ఉచిత సేవలు మాత్రం అందించకపోయింది.సూపర్ స్పెషాలిటీ సేవలను దూరంగా పెట్టింది. అంతే కాకుండా విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అంచెలంచెలుగా ఇక్కడ సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తోంది. ఇక్కడ అన్ని వైద్యసేవలు ఉచితంగా అందించాలనే ఆశయంతో.. ప్రభుత్వమే నడిపించాలనే ఆలోచనతో.. వైఎస్ రాజశేఖరరెడ్డి విమ్స్‌ను నిర్మించారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ముఖ్యమంత్రులు దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేశారు. అనంతరం వచ్చిన టీడీపీ కూడా అదే పంథా ను కొనసాగించింది. అంచెలంచెలుగా ప్రైవేట్‌పరం చేసుకుపోతోంది. రక్త పరీక్షల నుంచి ఎంఆర్ఐ స్కానిం గ్ వరకు ప్రైవేట్ సంస్థలైన డాల్ఫిన్ డ యాగ్నస్టిక్స్, పాత్‌కేర్ లేబొరేటరీలకు అప్పగించింది. ఈ సంస్థలు వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆరు సూపర్ స్పెషాలిటీ విభాగాల ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఇక్కడ డ బ్బులు చెల్లించి సేవలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమ్స్.. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. ఈ ఆస్పత్రి ద్వారా ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం వారి ఆశలు నీరుగారాయి. గొప్ప ఆశయంతో.. ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన విమ్స్ లక్ష్యాన్ని చంద్రబాబు దెబ్బతీశారు. ఇక్కడ వైద్య సేవలను ప్రైవేట్‌పరం చేయడంతో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని ద్రాక్షగా మారింది. – ఆరిలోవ (విశాఖ తూర్పు) మొదటి క్యాబినెట్ నిర్ణయం గాలికి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం మొద టి క్యాబినెట్ సమావేశం ఏయూలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విమ్స్‌లో మూడు నెలల్లో సేవలను ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తీర్మానించారు. నిర్వహణ ఖర్చులకు రూ.100 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఈ రెండు తీర్మానాలు గాలికొదిలేశారు. మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్న విమ్స్‌ను రెండేళ్లకు ప్రారంభించారు. రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి.. రూ.30 కోట్లే విడుదల చేశారు. సేవలు కుదింపు మొదట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీలు ఇక్కడ అందుబాటులో ఉంచాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయన మరణానంతరం ముఖ్యమంత్రిగా వచ్చిన ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి 500 పడకలకు కుదించి, 21 సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అది కార్యరూపం దాల్చలేదు. టీడీపీ హయాంలో విమ్స్‌ను పూర్తిగా ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని తలచారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించి ఉద్యమాలు చేపట్టడంతో దిగివచ్చి ఎట్టకేలకు 2016, ఏప్రిల్ 11న ప్రారంభించారు. అయితే ఆస్పత్రి సేవలను 200 పడకలు, 15 సూపర్ స్పెషాలిటీలకు కుదించేశారు. అదీ అమలు చేయకుండా ప్రస్తుతం 150 పడకలకే పరిమితం చేశారు. ప్రైవేట్‌పరం దిశగా 33 జీవో విడుదల విమ్స్‌లో కొత్తగా మరో ఆరు సూపర్ స్పెషాలిటీ విభాగాలు పీపీపీ విధానంలో టాటా కన్సెల్టెన్సీకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో జోవో 33 విడుదల చేసింది. దీనికి సంబధించిన ఉత్తర్వులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు పంపించింది. కార్డియక్ సైన్స్స్, గాస్ట్రో సైన్సెస్, రీనల్ సైన్సెస్, నియోటాలజీ(నవజాత శిశువులు), స్పోర్ట్స్ ఇంజూరీస్, స్టెమ్‌సెల్ చికిత్స సూపర్ స్పెషాలిటీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని జీవోలో వివరించింది. నేపథ్యమిదీ.. ఉత్తరాంధ్ర వాసులకు ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందించాలని 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తలచారు. ఇందుకు హనుమంతవాక వద్ద పశుసంవర్ధక శాఖకు చెందిన 99.98 ఎకరాల స్థలాన్ని విమ్స్‌కు కేటాయించి రూ.250 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆరు బ్లాకుల్లో 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేశారు. మొదటి విడతగా భవన నిర్మాణానికి రూ.55 కోట్లు నిధులు కేటాయించి, ఇందుకోసం 2007 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. 2009 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేసి, సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆయన హయాంలో పనులు చకచకా సాగిపోయాయి. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో విమ్స్ నిర్మాణ పనులు చతికలపడ్డాయి. తర్వాత రోశయ్య హయాంలో రూ.20 కోట్లు, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలోరూ.30 కోట్లు మంజూరు చేయడంతో భవన నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఆస్పత్రి ఆవరణలో రోడ్లు, ప్రహరీ, మార్చురీ, క్యాంటీన్, కిచెన్, రోగుల విశ్రాంతి హాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తదితర వాటిని నిర్మించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు విడతల్లో రూ.15 కోట్లు చొప్పున విడుదల చేసి చేతులు దులిపేసుకొన్నారు. ఆస్పత్రి నిర్వహణ భారమవుతోందని, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో ఒక్కో విభాగం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక జీవో విడుదల చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. అరకొర సిబ్బంది.. ఇక్కడ సిబ్బంది లేమితో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు, నర్సింగ్, అడ్మినిస్ట్రేషన్ సిబ్బందితో పాటు సుమారు 400 మంది ఉండాల్సిన ఈ ఆస్పత్రిలో 134 మందితో కాలయాపన చేస్తున్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు కలిపి సుమారు 70 మంది ఉన్నారు. వీరికి 34 మంది స్టాఫ్ నర్సులు, అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారు. ఆఫీస్ సిబ్బంది మరో 30 మంది వరకు ఇక్కడ ఉన్నారు. వీరంతా విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదా వరి జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వారే. ఇది ఆస్పత్రి ప్రారంభం నాటి నుంచి ఉన్న సంఖ్యే. అవుట్, ఇన్ పేషెంట్లు సంఖ్య రోజుకు రోజుకూ పెరుగుతోంది. ఆపరేషన్ థియేటర్లు, కొన్ని విభాగాలు ఏర్పడ్డాయి. వైద్య సిబ్బంది మాత్రం పెరగడం లేదు. విమ్స్‌లో వైద్యులు, నర్సింగ్, అడ్మినిస్ట్రేషన్, క్లాస్‌ఫోర్, తదితర విభాగాల్లో 850 శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేస్తామ ని ఆరు నెలల కిందట ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 137 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసింది. సిబ్బందికి వేతనాల్లేవ్ .. విమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న నర్సింగ్ సిబ్బంది నుంచి అడ్మినిస్ట్రేషన్, డైరెక్టర్ వరకు ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వారే. ఇక సెక్యూరిటీ, పారిశుద్ధ్య సిబ్బందిని ప్రైవేట్ సంస్థలు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాయి. ఆ సంస్థలు ఇక్కడ 24 మంది సెక్యూరిటీ సిబ్బంది, 70 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియామకం చేశాయి. ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో వేతనాలు లేక సిబ్బంది విలవిలలాడుతున్నారు. ప్రస్తుతం నాలుగు నెలలుగా వీరికి వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. ఈ విషయం విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి సిబ్బంది తీసుకెళ్లినా.. ఫలితం కనిపించలేదు. 3 లక్షల మందికి సేవలు విమ్స్ అందుబాలోకి వచ్చిన నుంచి ఇంతవరకు సుమారు 3 లక్షల మంది రోగులకు సేవలందించారు. వారిలో 4 వేల మంది ఇ¯Œ షేషెంట్ల్లకు సేవలందాయి. 2,300 మందికి పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. వారిలో 2016 ఏప్రిల్ 11 నుంచి డిసెంబర్ 31 వరకు సుమారు 50 వేల మంది ఓపీ నమోదు కాగా.. 2017 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు 1,26,432 మంది రోగులు ఇక్కడ సేవలు పొందారు. 2018 జనవరి నుంచి ఇంత వరకు 70వేల మంది అవుట్ పేషెంట్లు వచ్చారు. 2019లో 120 ఆపరేషన్లు జరిగాయి. -
‘విమ్స్’లో కమీషన్ల దందా!
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రాణదాతగా పేరుగాంచిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసం ప్రైవేట్‌కు అప్పజెప్పారు. రాత్రికి రాత్రే నిబంధనలు మార్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిం చారు. ఇప్పటిదాకా రూ.300 కోట్లు వెచ్చించి, అభివృద్ధి చేసిన ఆసుపత్రిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిన తీరు అధికారవర్గాల్లో చర్చనీయాం శంగా మారింది. విమ్స్ ప్రైవేటీకరణతోపాటు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రోగులు చికిత్స పొందే ప్రైవేట్ ఆస్పత్రులపై అజమాయిషీ కోసం ‘క్లినికల్ ఆడిట్’ పేరుతో ఓ కాంట్రాక్టు, మాతా శిశుమరణాలు తగ్గించే మరో కాంట్రా క్టును బాగా కావాల్సిన వారికే అప్పగించారు. ఈ కాంట్రాక్టుల అప్పగింత వెనుకరూ.కోట్ల కమీషన్లు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువుకు ముందే కానిచ్చేశారు ఎక్కడైనా టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తే, బిడ్లు దాఖలు చేసుకునేందుకు తగినంత గడువు ఇస్తారు. విమ్స్ ప్రైవేటీకరణలో భాగంగా రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్ పిలిచింది. బిడ్ల దాఖలుకు జూన్ 18వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. కానీ, తమకు బాగా కావాల్సిన బిడ్డర్లు బిడ్లు దాఖలు చేయగానే జూన్ 6వ తేదీనే టెండర్ ప్రక్రియ ముగించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నిబంధనల ప్రకారం ఒకసారి టెండర్ పిలిస్తే గడువుకు ముందే ముగించకూడదు. కావాలంటే టెండర్ గడువును ఇంకా పొడిగించుకోవచ్చు. అంతేతప్ప గడువుకు ముందే ముగించడం నిబంధనలకు విరుద్ధమే. ఏపీఎంఎస్ఐడీసీ నిర్వాకం వల్ల చాలామంది బిడ్లు దాఖలు చేయలేకపోయారు. రాత్రికి రాత్రే ఈఎండీ తగ్గింపు ఏ టెండర్లో అయినా ఎర్నెస్ట్ డిపాజిట్ మనీ(ఈఎండీ) నిబంధన ఉంటుంది. విమ్స్ ప్రైవేటీకరణ టెండర్లలో ఈఎండీ రూ.25 లక్షలుగా నిర్దేశించారు. జూన్ 5వ తేదీన ఏపీఎంఎస్ఐడీసీ ఇంజనీర్‌కు సచివాలయంలోని ముఖ్యకార్యదర్శి పేషీ నుంచి ఈ–మెయిల్ వెళ్లినట్లు సమాచారం. రూ.25 లక్షలున్న ఈఎండీని రూ.లక్షకు తగ్గించాలన్నదే ఆ ఈ–మెయిల్ సారాంశం. ముఖ్యమంత్రి కార్యాలయ ఒత్తిళ్ల మేరకే సదరు ఈ–మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైద్య ఆరోగ్యశాఖ సలహాదారు కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు ఫోన్ చేసి తాము చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించినట్లు ఏపీఎంఎస్ఐడీసీ వర్గాలు చెప్పాయి. సీఎంఓ నుంచి ఆర్డర్ ఉందన్నారు ‘‘టెండర్‌ను గడువు కంటే ముందే ముగించిన విషయం వాస్తవమే. ఉన్నతాధికారులు చెప్పినందు వల్లే ఈఎండీని తగ్గించాం. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్డర్ ఉందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య రాతపూర్వకంగా ప్రతిపాదన పంపిన తర్వాతే చేశాను. దీనిపై నా పాత్ర ఏమీ లేదు’’ – రోహిణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎంఎస్ఐడీసీ రూ.కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్‌కు అప్పగిస్తారా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనల్లోంచి విమ్స్ పురుడు పోసుకుంది. దీన్ని హైదరాబాద్‌లోని నిమ్స్ కంటే ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కలలుగన్నారు. విమ్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.300 కోట్లు ఖర్చు చేసింది. ఇక్కడ చాలామంది సిబ్బంది పని చేస్తున్నారు. స్పెషలిస్టు డాక్టర్లున్నారు. ఇన్సోర్సింగ్ కింద వైద్యులు సేవలందిస్తున్నారు. మరో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ‘విమ్స్’ అద్భుతంగా తయారవుతుంది. ఎంబీబీఎస్ సీట్లు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం పెద్దలు తమ స్వార్థం కోసం ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. తాజా నిబంధనల ప్రకారం ఐదు రకాల సేవలను ప్రైవేట్‌కు ఇచ్చేశారు. గుండెజబ్బుల చికిత్సలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్సలు, నియోనెటాలజీ అండ్ పీడియాట్రిక్, రీనల్ సర్వీసెస్ (కిడ్నీ సేవలు), స్పోర్ట్స్ ఇంజూరీ (ఎముకల శస్త్రచికిత్సలు, కీళ్ల మార్పిడి) చికిత్సలు ప్రైవేట్పరమయ్యాయి. ఈ సేవలను ధనుష్ టెక్నాలజీస్ అనే సంస్థకు కట్టబెట్టినట్టు సమాచారం. సాఫ్ట్వేర్ సేవలకు సంబంధించిన ఈ సంస్థకు ఆరోగ్య సేవల్లో ఎలాంటి అనుభవం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థకు అప్పగించారు. తాజాగా విమ్స్ కూడా అదే సంస్థ చేతుల్లోకి వెళ్లింది. పైన పేర్కొన్న సేవల్లో ఔట్‌పేషెంట్‌కు, ఇన్‌పేషెంట్‌కు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ, ఎండోస్కొపీ ఇలా ఒక్కొక్క సేవకు ధర నిర్ణయించి ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఇదంతా ఏటా రూ.కోట్లలోనే ఉంటుందని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒక్క ఏడాదిలో ప్రైవేట్ సంస్థకు చెల్లించే సొమ్ముతో విమ్స్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయొచ్చని అన్నారు. -
సేవలకు విమ్స్ రెడీ!
♦ రూ.22 కోట్ల వైద్య పరికరాలు రాక ♦ 30 మంది డాక్టర్ల నియామకం ♦ ఔట్‌సోర్సింగ్‌లో 150 మంది సిబ్బంది సాక్షి, విశాఖపట్నం : వాయిదాలపై వాయిదాలు పడుతూ వస్తున్న విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్) ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రాథమికంగా ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలతో శ్రీకారం చుట్టనుంది. తొలుత ఈ నెల 7న విమ్స్‌ను ప్రారంభిస్తామని ఇటీవల అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. అయితే ఆ రోజు అమావాస్య కావడం వల్ల ముహూర్తాన్ని 11వ తేదీకి మార్చారు. ఈ నేపథ్యంలో ఓపీ సేవలకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. ముహూర్తానికి మరో వారం రోజులే ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సమకూరుతున్న వసతులు ఆస్పత్రికి ముఖ్యంగా రూ.22 కోట్ల విలువైన వైద్య పరికరాలను సమకూర్చారు. వీటిలో శస్త్రచికిత్స థియేటర్లు, పరికరాలు, టేబుళ్లు, ఎనస్థీషియా (మత్తు) యంత్రాలు, మంచాలు, పరుపులు వంటివి ఉన్నాయి. ప్రస్తుతానికి 50 పడకలతో ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నారు. గతంలో ఈ ఆస్పత్రికి ఇచ్చిన మంచాలు నాసిరకానికి కావడంతో వెనక్కి పంపేశారు. వాటి స్థానంలో నాణ్యమైన అత్యాధునిక మంచాలను తెచ్చారు. వీటిని ఆస్పత్రిలో అమర్చారు కూడా. త్వరలో మరో 350 మంచాలను తీసుకురానున్నారు. సిబ్బంది నియామకాలు వైద్య సేవలకు వీలుగా 30 మంది డాక్టర్లను నియమించారు. వీరు కాకినాడ, గుంటూరు, శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రుల నుంచి వస్తున్నారు. ఇటీవల కేజీహెచ్‌లో నియమితులైన 20 మంది నర్సులను కూడా విమ్స్‌కు పంపుతున్నారు. వీరితో పాటు 150 మంది వైద్య, వైద్యేతర సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియామకాలు జరుపుతున్నారు. మరోవైపు కోరమాండల్ ఫెర్టిలైజర్స్ సంస్థ గార్డెనింగ్ బాధ్యతలను చేపట్టింది. పారిశుద్ధ్యం, ఎలక్ట్రికల్ పనులు కూడా సత్వరమే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా రూ.18 లక్షల విలువైన సర్జికల్, మందులను కూడా సిద్ధం చేశామని, ప్రారంభోత్సవం నాటికి ప్రాథమికంగా అన్ని హంగులు, సదుపాయాలను సమకూరుస్తామని విమ్స్ డెరైక్టర్ డాక్టర్ సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
విమ్స్‌లో వైద్య సేవలకు మంగళం!
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగింత? సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం విమ్స్ ఇక అకడమిక్ సేవలకే పరిమితం పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మృగ్యమే సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల పేద రోగులకు అత్యున్నత వైద్య సేవలు అందించడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది రాయి వేసిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(విమ్స్)కు టీడీపీ ప్రభుత్వం సమాధి కడుతోంది. విమ్స్‌ను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనను సూత్రప్రాయంగా ఆమోదించారు. ఇది అమల్లోకి వస్తే పేద రోగులకు విమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందకుండా పోతాయి. విమ్స్ స్ఫూర్తి ఇదీ... హైదరాబాద్‌లోని నిమ్స్ తరహాలో విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఒడిశా, చత్తీస్‌గఢ్‌కు చెందిన రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖరరెడ్డి విమ్స్‌కు రూపకల్పన చేశారు. రూ.250 కోట్లతో 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలతో ఈ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. విశాఖలోని ఆరిలోవలో 250 ఎకరాలు కేటాయించి, 2007లో శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులకు తొలి విడతగా రూ. 35.18 కోట్లు కేటాయించారు. వైఎస్ అనంతరం విమ్స్‌పై అశ్రద్ధ వైఎస్ హఠాన్మరణం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు విమ్స్ నిర్మాణంపై చిత్తశుద్ధి చూపించలేదు. రోశయ్య ప్రభుత్వం రూ.20 కోట్లే కేటాయించింది. కిరణ్మార్రెడ్డి ప్రభుత్వం విమ్స్‌ను 500 పడకలు, 17 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలుగా కుదించింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 200 పడకలు, కేవలం 8 సూపర్ స్పెషాలిటీ విభాగాల స్థాయికి కుదించేసింది. విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేయాలని తొలుత నిర్ణయించింది. విశాఖలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న అధికార పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధికి అప్పగించాలని బావించింది. ప్రజావ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ఇక వైద్య విద్యా బోధనకే పరిమితం విమ్స్‌ను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగిస్తే విమ్స్‌ను కేవలం వైద్య విద్యా బోధనకే పరిమితం చేస్తారు. పేద రోగులకు వైద్య సేవలు అందించరు. సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దీనిపై చర్చించారు. సాంకేతిక అభ్యంతరాలను అధిగమించి ఈ ప్రతిపాదనను ఎలా అమలు చేయాలన్న దానిపై త్వరలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. లోగుట్టు ఏదైనా ఉందా! విమ్స్‌ను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి అప్పగించడం వెనుక లోగుట్టు వేరే ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయాల నిధులను ఆస్పత్రుల అభివృద్ధికి వెచ్చించకూడదని భారత వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించినా విమ్స్‌కు ప్రభుత్వమే నిధులు కేటాయించాలి. దానికంటే వైద్య సేవలకే ఉపయోగిస్తే పేదలకు ప్రయోజనం కలుగుతుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా యోచించడం లేదు. అంటే వైద్య విశ్వవిద్యాలయం ముసుగులో విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశం ఉందా? అని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తుది నిర్ణయం తీసుకోలేదు విమ్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రభుత్వంతో చర్చించామని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజ్ చెప్పారు. విమ్స్‌ను ఆస్పత్రిగా నిర్వహించాలా? లేక వైద్య విద్యా బోధనకు కేటాయించాలా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. -
విమ్స్‌పై విశాఖ మంత్రి కన్ను!
సాక్షి, హైదరాబాద్: కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)ను నిర్వహించలేం.. ప్రైవేట్‌కు ఇస్తే బ్రహ్మాండంగా నడపవచ్చంటూ ముఖ్యమంత్రికి వివరించి దీన్ని ఏకంగా లాక్కోవాలని చూశారు. ఇలా చేసింది ఎవరో కాదు స్వయానా విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రి. వైద్య కళాశాలలకు డీమ్డ్ హోదాలు ఇస్తున్న నేపథ్యంలో విమ్స్నూ తీసేసుకుందామని ఆయన ప్రయత్నించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమ్స్‌ను ఇప్పటికిప్పుడు 9 స్పెషాలిటీలతో, 5 సూపర్ స్పెషాలిటీలతో నడిపించాలంటే రూ.200 కోట్లు పైగా అవసరమవుతుందని, దీన్ని ప్రైవేట్‌కు అప్పగిస్తే మెరుగైన సేవలు అందుతాయనేది సదరు మంత్రి సూచన. దీంతో చకచకా పావులు కదిపారు. గీతం వైద్య కళాశాలకు డీమ్డ్ హోదా ఇచ్చినట్టే విమ్స్‌ను మంత్రి బంధువు ఒకరు తీసుకుని, దానికి కూడా డీమ్డ్ హోదా తీసుకోవాలని తీవ్రంగా యత్నించినట్టు తెలిసింది. సీఎంతో దీనిపై పలు దఫాల్లో చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. లోపాయికారిగా జరుగుతున్న ఈ ప్రతిపాదన వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతాధికారుల చెవిన పడింది. అప్పటి వరకూ అది ‘నిమ్స్’ లాగే అటానమస్ హోదాలో ఉండేది. ఇలా అటానమస్ హోదాలో ఉంటే ప్రభుత్వం సులభంగా ప్రైవే ట్‌కు కట్టబెడుతుందేమోనని భావించిన అధికారులు... డిసెంబర్ మొదటి వారంలో విమ్స్‌ను వైద్య విద్యాశాఖలో కలిపేస్తూ జీవో జారీచేశారు. దీంతో రాజకీయ నేతల గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. అయినా మంత్రి పట్టు వదలలేదు. ఇప్పటికీ విమ్స్‌ను ప్రభుత్వం నడపడం సాధ్యం కాదని, దీన్ని ప్రైవేట్‌కు ఇవ్వడమే మేలని సీఎంపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విమ్స్ పనులు తీవ్ర జాప్యంతో నడుస్తుండటాన్ని బట్టి అనుమానాలు కలుగుతున్నాయి. -
నెల రోజుల్లో విమ్స్ అందుబాటులోకి...
నెలాఖరుకు ఔట్‌పేషెంట్ సేవలు మూన్నెళ్లలో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వైద్యవిద్యా సంచాలకులు డా.కె.వెంకటేష్ హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలకు అత్యవసర వైద్యసేవల నిమిత్తం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ (విమ్స్)ను నెలరోజుల్లో అందుబాటులోకి తేనున్నట్టు వైద్య విద్యా సంచాలకులు డా.కాకొల్లు వెంకటేష్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే విమ్స్‌కు సంబంధించిన 150 ఎకరాల భూమిని డీఎంఈ పరిధిలోకి తీసుకున్నట్టు చెప్పారు. నెలరోజుల్లో ఔట్‌పేషెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయని, మూన్నెళ్లలో శస్త్రచికిత్సలు చేస్తామని, ఆరు మాసాల్లో ట్రామాకేర్సేవలతో పాటు అన్ని అత్యవసర సేవలూ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అన్ని సదుపాయాలు త్వరలో పూర్తవుతాయని పేర్కొన్నారు. పలు రకాల శస్త్రచికిత్సలకు సంబంధించిన రూ.30 కోట్ల విలువైన పరికరాలు కొనుగోలు బాధ్యతలు రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)కి అప్పజెప్పామని, ఈ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందన్నారు. విమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక వైద్య సీట్లకూ దరఖాస్తు చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా డీఎంఈ చెప్పారు. -
విమ్స్ ‘వెన్ను విరిచేశారు’ !
సాక్షి, హైదరాబాద్: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)ను ప్రభుత్వం నీరుగార్చేసింది. వైద్య విద్యా శాఖ (డీఎంఈ) ఆస్పత్రుల ‘మంద’లో కలిపేసింది. అటానమస్ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించి డీఎంఈ పరిధిలోకి తెస్తూ గురువారం జీవో జారీ చేసింది. ఇకపై పనులు వేగవంతం చేస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని నిమ్స్ స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా అభివృద్ధి చేయడం ద్వారా సామాన్యులకు కూడా మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో 2007లో అప్పటి ప్రభుత్వం విమ్స్ నిర్మాణానికి పూనుకుంది. విశాఖపట్నం జిల్లా చిన్నగదిలి గ్రామంలో 102.24 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించారు. 8 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, దీనికి అనుబంధంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియా వంటి మరో 7 అనుబంధ విభాగాలు, 4 ఇంటెన్సివ్ కేర్ విభాగాలు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం. తొలి దశలో రూ.103 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఆ మేరకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తొలి విడతగా రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిధులు సక్రమంగా మంజూరు చేయలేదు. అటానమస్ సంస్థ అయిన విమ్స్‌కు నిధులివ్వడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించాయి. దీంతో ఇప్పటికీ సివిల్, ఎలక్ట్రికల్ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం సంస్థ ఏర్పాటు లక్ష్యాన్ని నీరుగారుస్తూ దానిని కాస్తా డీఎంఈ పరిధిలో చేర్చేసింది. స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే ఎయిమ్స్, నిమ్స్ తరహాలో తీర్చిదిద్దేందుకు, అత్యాధునిక సౌకర్యాల కల్పనకు అవకాశం లభించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమస్యల వలయంలో విమ్స్
- బళ్లారి, కొప్పళ ఆస్పత్రులకు ఒక్కరే డెరైక్టర్ - ఇన్చార్జిలతో కాలం నెట్టుకొస్తున్న పాలకులు - అవస్థలు పడుతున్న రోగులు బళ్లారి: బళ్లారి జిల్లాతోపాటు కొప్పళ, రాయచూరు, చిత్రదుర్గం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల ప్రజలకు వైద్య సేవలు అందించే విమ్స్ ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జనానికి జబ్బు చేస్తే ఆస్పత్రికి వె ళ్లి చికిత్సలు చేయించుకుని బాగు చేయించుకుంటారు. అయితే జనానికి వైద్యం చేసే ప్రధాన ఆస్పత్రి అయిన విమ్స్‌కు జబ్బు చేయడం రోగులకు శాపంగా మారింది. బళ్లారి నగరంలోని 1000 పడకల అతిపెద్ద ఆస్పత్రిలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. విమ్స్ డెరైక్టర్ రెండు ప్రధాన ఆస్పత్రులకు డెరైక్టర్‌గా వ్యవహరిస్తుండడంతో సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. కొప్పళలో ప్రభుత్వ ఆస్పత్రిలో డెరైక్టర్‌గా పని చేసే శ్రీనివాస్‌ను ఆరు నెలల క్రితం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి డెరైక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే కొప్పళకు కొత్త డెరైక్టర్‌ను నియమించకుండా, అక్కడి బాధ్యతలను కూడా శ్రీనివాస్‌కు అప్పగించింది. ఆరు నెలలు దాటినా కొప్పళకు డెరైక్టర్‌గా ఎవరినీ నియమించలేదు. రెండు ఆస్పత్రులకు శ్రీనివాస్ డెరైక్టర్‌గా పని చేస్తున్నారు. దీంతో రెండింటికి న్యాయం చేయలేకపోతున్నారు. బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో సర్జరీ, మెడిసన్, ఓబీజీ, ఆర్థో, ఈఎన్టీ, స్కిన్, రేడియాలజీ, చిల్డ్రన్స్, యూరాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే 20కి పైగా వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అం దులో ఒ క్కొక్క డిపార్ట్మెంటు కు ఒక్కొక్కరు ఇన్ చార్జిలుగా వైద్యులు ఉంటారు. వారి నేతృత్వంలో ఒక్కొక్క డిపార్ట్మెంటులో మరో 10 మందికి పైగా వైద్యులు పని చేస్తుంటారు. ఇలా వందలాది మంది వైద్యులు పని చే సే ప్రధాన ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. ఇంత పెద్దాస్పత్రిని పర్యవేక్షించే డెరైక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకు పోతున్నట్లు వైద్యులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రధాన ఆస్పత్రుల్లో సంతకాలు పెట్టడానికే ఆయనకు సమయం సరిపోతుండడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రిలో సమస్యలు రోజురోజుకూ జఠిలమవుతున్నాయి. సంబంధిత వైద్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు విమ్స్ ఆస్పత్రిలో సమస్యల గురించి పట్టించుకునే కనీస ఆలోచన చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమ్స్ ఆస్పత్రిలో మంచినీటి సమస్యతోపాటు పారిశుధ్య సమ స్య పట్టిపీడిస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వార్డును సక్రమంగా శుభ్రం చేయడం లేదని రోగులు పేర్కొన్నారు. మరోవైపు మందుల కొరత వేధిస్తోంది. వీటితో పా టు ఆస్పత్రిలో పని చేసే వైద్యులకు కూడా సక్రమంగా జీతాలు అందించడం లేదు. వీటితో పాటు ప్రిన్సిపాల్, సీఈఓ వంటి ప్రధాన పోస్టులకు సంబంధించిన వైద్యులు కూడా ఇన్ చార్జిలే పని చేస్తున్నారు. పూర్తిస్థాయి బాధ్య తలు అప్పగించక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లా ఇన్ చార్జి మంత్రికి ఆస్పత్రి లో సమస్యలు పరిష్కరించడానికి కాదు కదా కనీసం ఆస్పత్రిని విజిట్ చేయడానికి కూడా తీరిక లేదేమో అని పలువురు విమర్శిస్తున్నా రు. విమ్స్ ఆస్పత్రి పరిధిలోకి వచ్చే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, దంత ఆస్పత్రి పనులు పూర్తి కాలేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి, దంత ఆస్పత్రికి నిధుల కొరత వేధిస్తుండడంతో మూ డు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెన క్కి వెళుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే వి మ్స్ ఆస్పత్రిలో అడుగడుగునా సమస్యలు రా జ్యమేలుతున్నాయి. ఇకనైనా సంబంధిత మం త్రి ప్రత్యేక దృష్టి పెట్టి ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సమస్యల వలయంలో విమ్స్
బళ్లారి, కొప్పళ ఆస్పత్రులకు ఒక్కరే డెరైక్టర్ ఇన్చార్జిలతో కాలం నెట్టుకొస్తున్న పాలకులు అవస్థలు పడుతున్న రోగులు బళ్లారి: బళ్లారి జిల్లాతోపాటు కొప్పళ, రాయచూరు, చిత్రదుర్గం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల ప్రజలకు వైద్య సేవలు అందించే విమ్స్ ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జనానికి జబ్బు చేస్తే ఆస్పత్రికి వె ళ్లి చికిత్సలు చేయించుకుని బాగు చేయించుకుంటారు. అయితే జనానికి వైద్యం చేసే ప్రధాన ఆస్పత్రి అయిన విమ్స్‌కు జబ్బు చేయడం రోగులకు శాపంగా మారింది. బళ్లారి నగరంలోని 1000 పడకల అతిపెద్ద ఆస్పత్రిలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. విమ్స్ డెరైక్టర్ రెండు ప్రధాన ఆస్పత్రులకు డెరైక్టర్‌గా వ్యవహరిస్తుండడంతో సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. కొప్పళలో ప్రభుత్వ ఆస్పత్రిలో డెరైక్టర్‌గా పని చేసే శ్రీనివాస్‌ను ఆరు నెలల క్రితం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి డెరైక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే కొప్పళకు కొత్త డెరైక్టర్‌ను నియమించకుండా, అక్కడి బాధ్యతలను కూడా శ్రీనివాస్‌కు అప్పగించింది. ఆరు నెలలు దాటినా కొప్పళకు డెరైక్టర్‌గా ఎవరినీ నియమించలేదు. రెండు ఆస్పత్రులకు శ్రీనివాస్ డెరైక్టర్‌గా పని చేస్తున్నారు. దీంతో రెండింటికి న్యాయం చేయలేకపోతున్నారు. బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో సర్జరీ, మెడిసన్, ఓబీజీ, ఆర్థో, ఈఎన్టీ, స్కిన్, రేడియాలజీ, చిల్డ్రన్స్, యూరాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే 20కి పైగా వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అం దులో ఒ క్కొక్క డిపార్ట్మెంటు కు ఒక్కొక్కరు ఇన్ చార్జిలుగా వైద్యులు ఉంటారు. వారి నేతృత్వంలో ఒక్కొక్క డిపార్ట్మెంటులో మరో 10 మందికి పైగా వైద్యులు పని చేస్తుంటారు. ఇలా వందలాది మంది వైద్యులు పని చే సే ప్రధాన ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. ఇంత పెద్దాస్పత్రిని పర్యవేక్షించే డెరైక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకు పోతున్నట్లు వైద్యులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రధాన ఆస్పత్రుల్లో సంతకాలు పెట్టడానికే ఆయనకు సమయం సరిపోతుండడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రిలో సమస్యలు రోజురోజుకూ జఠిలమవుతున్నాయి. సంబంధిత వైద్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు విమ్స్ ఆస్పత్రిలో సమస్యల గురించి పట్టించుకునే కనీస ఆలోచన చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమ్స్ ఆస్పత్రిలో మంచినీటి సమస్యతోపాటు పారిశుధ్య సమ స్య పట్టిపీడిస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వార్డును సక్రమంగా శుభ్రం చేయడం లేదని రోగులు పేర్కొన్నారు. మరోవైపు మందుల కొరత వేధిస్తోంది. వీటితో పా టు ఆస్పత్రిలో పని చేసే వైద్యులకు కూడా సక్రమంగా జీతాలు అందించడం లేదు. వీటితో పాటు ప్రిన్సిపాల్, సీఈఓ వంటి ప్రధాన పోస్టులకు సంబంధించిన వైద్యులు కూడా ఇన్ చార్జిలే పని చేస్తున్నారు. పూర్తిస్థాయి బాధ్య తలు అప్పగించక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లా ఇన్ చార్జి మంత్రికి ఆస్పత్రి లో సమస్యలు పరిష్కరించడానికి కాదు కదా కనీసం ఆస్పత్రిని విజిట్ చేయడానికి కూడా తీరిక లేదేమో అని పలువురు విమర్శిస్తున్నా రు. విమ్స్ ఆస్పత్రి పరిధిలోకి వచ్చే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, దంత ఆస్పత్రి పనులు పూర్తి కాలేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి, దంత ఆస్పత్రికి నిధుల కొరత వేధిస్తుండడంతో మూ డు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెన క్కి వెళుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే వి మ్స్ ఆస్పత్రిలో అడుగడుగునా సమస్యలు రా జ్యమేలుతున్నాయి. ఇకనైనా సంబంధిత మం త్రి ప్రత్యేక దృష్టి పెట్టి ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
'విమ్స్ ప్రైవేటీకరణ ఒప్పుకోం'
విశాఖపట్టణం: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్) ప్రైవేటీకరణను ఒప్పుకోబోమని విశాఖపట్టణం మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు వ్యాఖ్యానించారు. విమ్స్‌ను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాలో మాట్లాడారు. ఎయిమ్స్‌ను మంగళగిరిలో కంటే విమ్స్‌లో కొనసాగిస్తేనే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని దొరబాబు సూచించారు. ఆరేళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే విమ్స్ లో పనులు నిలిచిపోయాయని విమర్శించారు. కేజీహెచ్‌లో సిబ్బంది కొరతను నివారించాలని దొరబాబు డిమాండ్ చేశారు. -
విమ్స్‌లో మళ్లీ పందుల సంచారం
బళ్లారి (తోరణగల్లు):ముచ్చటగా మూడు రోజులు పూర్తికాకుండానే విమ్స్‌లో మళ్లీ పందులు ప్రత్యక్షమయ్యా యి. ఆస్పత్రి ఆవరణలో సంచరిస్తూ అపరిశుభ్రతకు కారణమవుతున్నాయి. శుక్రవారం సిటీ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు ఆధ్వర్యంలో విమ్స్‌లో సంచరిస్తున్న పందుల్ని పట్టి వాహనాల్లో దూరప్రాంతానికి తరలించారు. దీంతో రోగులు, వారి సహాయకులు, సిబ్బం ది బెడద తీరిందని సంతోషించారు. వారి సంతోషం మూడు రోజులకే పరిమితమైంది. మంగళవారం విమ్స్ లో మళ్లీ పందుల సంచారం కనిపించింది. ఆస్పత్రి ఆవరణ అంతా ఇవి బురద గుంటలా మార్చేస్తున్నాయి. దీం తో సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. -
విమ్స్‌లో అత్యాధునిక వైద్య పరికరాలు
వైద్య నిపుణుల సూచనలు కేజీహెచ్‌ను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి విశాఖపట్నం- మెడికల్: కింగ్ జార్జి ఆస్పత్రిలో లేని వైద్య విభాగాలు, అత్యాధునిక వైద్య పరికరాలను త్వరలో ప్రారంభించనున్న విమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని ఆంధ్ర వైద్య కళాశాల వైద్య నిపుణులు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంకు సూచిం చారు. ఆయన గురువారం ఆంధ్ర వైద్య కళాశాల, కేజీహెచ్, ఆర్సీడీ ఆస్పత్రులను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్లో పలు విభాగాల అధిపతులతో సమావేశమై విమ్స్ ఆస్పత్రిని ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించారు. విమ్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేయాలని వైద్యులు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. తొలిదశలో న్యూరో సెన్సైస్స్, అవయవమార్పిడి వైద్య విభాగాలను అభివృద్ధి చేస్తే బాగుం టుందని అభిప్రాయపడ్డారు. అవయవమార్పిడి వైద్యానికి అవసరమైన అవకాశాలను, సదుపాయాలను లోతుగా చర్చించారు. గుండె, కాలేయం, కిడ్నీ, కన్ను వంటి అవయవాలను మార్చేందుకు అవసరమైన ట్రాన్స్‌ప్లాంటేషన్ లేబ్ ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన అంశాలను ఏపీ ఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. తొలుత సూపర్‌స్పెషాల్టీ బ్లాక్‌లోని నెఫ్రాలజీ విభాగాన్ని సందర్శించారు. సమావేశంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ టి.రవిరాజు, ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ సోమరాజు, ఏఎంసీ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, కేజీహెచ్ సూపరింటెండెంట్ ఎం.మధుసూదనబాబు, విమ్స్ ఓఎస్డీ డాక్టర్ కె.వి.సుబ్బారావు, శ్రీకాకుళం రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ జయరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆర్.శ్యామల, ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్ష క ఇంజనీర్ వి.చిట్టిబాబు, డీఈ ఎం.ఎస్.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మెగాసిటీగా విశాఖ
- ఎన్నికల హామీల తరహాలో నగరంపై సీఎం వరాల జల్లు - పర్యాటక, ఐటీ, ఆర్థిక, మెడికల్ హబ్‌గా మారుస్తానని ప్రకటన - ఎయిర్‌పోర్టు, మెట్రో, అవుటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి హామీ - 90 రోజుల్లో సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారం - విమ్స్, ప్రాంతీయ క్రీడా కళాశాలకు రూ.80 కోట్లు మంజూరు సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. దేశంలోనే మంచి సిటీ. ఉదయం నగరంలో పర్యటిస్తుంటే చుట్టూ కొండలు..ప్రశాంతమైన వాతావరణంతో చాలా మంచి అనుభూతి కలి గింది. ఏ సిటీలో తిరిగినా ఇలాంటి అనుభూతి కలగదు. ఇక్కడున్న ప్రశాంతత ఎక్కడా దొరకదు. అందుకే విశాఖను మెగాసిటీగా మారుస్తా. పర్యాటక, ఆర్థిక, ఆరోగ్య, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతా’ అని ుుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి భేటీకి గురువారం విశాఖ వచ్చిన ఆయన వరాలు, వాగ్దానాలు కురిపించారు. విశాఖను దేశంలోనే మెగాసిటీగా తయారు చేస్తానన్నారు. ప్రస్తుత ఎయిర్‌పోర్టును అంతర్జాతీయస్థాయిలో మారుస్తానని చెప్పారు. మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, అన్నింటికిమించి నగరంలో పలుచోట్ల ఫ్లైఓవర్లు, లింక్‌రోడ్లు, అవుటర్ రింగ్‌రోడ్లు వేస్తామన్నారు. ఈ మేరకు గురువారం జరిగిన కేబినేట్ సమావేశంలో కలెక్టర్‌తో ఈ విషయమై చర్చించినట్టు వివరించారు. నగరంతోపాటు చుట్టుపక్కల ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాల జాబితా తయారు చేయాలని ఆదేశించారు. త్వరలోనే ఈ వివరాలతో మాస్టర్‌ప్లాన్ తయారుచేసి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. గంగవరం పోర్టులో తలపెట్టిన ఎల్ఎన్టీ టెర్మినల్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసే విధంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. స్టీల్‌ప్లాంట్ ప్రస్తుతం 4 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పని చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రూపేణా రూ.700 కోట్లు వస్తోందని, ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా మరో రూ.700 కోట్లు అదనంగా వచ్చే వీలుందన్నారు. పెట్రో కారిడార్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తామని వివరించారు. 90 రోజుల్లో పంచగ్రామాల సమస్య పరిష్కారం - సింహాచలంలోని పంచగ్రామాల ప్రజలు పడుతున్న సమస్యకు 90 రోజుల్లో పరిష్కరించడానికి నిర్ణయించినట్టు చెప్పారు. ఈ మేరకు కేబినెట్లో దీనిపై చర్చించామన్నారు. ఇరవై ఏళ్ల నుంచి బాధపడుతున్న పంచగ్రామాల ప్రజలు 1999 పాత జీవో ప్రకారం అప్పటి మార్కెట్ ధర చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించారు. ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్తామన్నారు. మొత్తం 12 వేల మందికి ప్రభుత్వ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందన్నారు. - సింహాచలం దేవస్థానంలో నిత్యం 5వేల మందికి నిత్యాన్నదానం జరపాలని నిర్ణయించినట్టు చెప్పారు. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. - విమ్స్ ఆస్పత్రికి తక్షణం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మూడు నెలల్లో దీన్ని అభివృద్ధి చేయడమేకాకుండా ప్రస్తుతమున్న 200 పడకలను పెంచడం, అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. - విశాఖలో ఐటీ కంపెనీలున్నందున ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందేలా చేస్తామని, ఐటీఐఆర్ తీసుకువస్తామన్నారు. గిరిజన, పెట్రోలియం వర్సిటీ, కేంద్ర ప్రభు త్వ క్యాంపస్‌లు విశాఖకు తీసుకువచ్చేం దుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతీయ క్రీడా కళాశాలకు రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. - నగరానికి సీఎం చంద్రబాబు రకరకాల హామీలు గుప్పించినప్పటికీ వీటిని తరచుగా పర్యవేక్షించి కార్యాచరణ జరిగేలా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. లేకపోతే కేవలం కాగితాలకే పరిమితయ్యే అవకాశం ఉందని నగర నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క గురువారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగర ప్రజలతోపాటు ఎయిర్‌పోర్టు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సీఎం వస్తున్నారనే సాకుతో ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చే ప్రయాణికులకు అందుబాటులో ఉండే పెయిడ్ క్యాబ్ సర్వీసులను బలవంతంగా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు చేసేదిలేక ఎయిర్‌పోర్టు నుంచి జాతీయ రహదారికి నడుచుకుని వెళ్లాల్సివచ్చింది. -
వైద్యకళాశాలల డెరైక్టర్లుగా ‘విమ్స్’ వైద్యులు
బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన 6 వైద్య కళాశాలల్లో డెరైక్టర్ పోస్టులకు జరిగిన ఇంటర్వ్యూలలో బళ్లారిలోని విమ్స్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ వైద్యులు డెరైక్టర్లులుగా ఎంపికయ్యారు. రాష్ట్రంలోని కొప్పళ, గదగ్, గుల్బర్గా, కొడగు, కార్వార, చామరాజనగర్‌లో కొత్తగా ప్రారంభమైన వైద్యకళాశాలల్లోడెరైక్టర్ పోస్టుకు అర్హులైన ప్రముఖ వైద్యులకు గురువారం బెంగుళూరులో రాష్ట్ర వైద్య విద్యాశాఖా మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ కార్యాలయంలో ప్రభుత్వం ఇంటర్వ్యూలు నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ వైద్యకళాశాలలకు చెందిన 104 మంది ప్రముఖ వైద్యులు దరఖాస్తులు చేసుకోగా, వీరిలో 36 మందిని అర్హులుగా నిర్ణయించారు. 36 మంది వైద్యుల్లో సీనియారిటీ, ఇంటర్వ్యూల్లో కనబరచిన ప్రతిభ ఆధారంగా ఆరు కళాశాలకు ఆరుగురిని డెరైక్టర్లుగా ఎంపిక చేశారు. వీరిలో విమ్స్‌లోని బయోకెమిస్ట్రీ విభాగ ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణస్వామి, ఫార్మకాలజీ విభాగ ప్రముఖుడు డాక్టర్ శ్రీనివాసులు, పెతాలజీ విభాగ ప్రముఖ వైద్యుడు డాక్టర్ భరత్‌లు ఉన్నారు. కొడగు విజ్ఞాన వైద్యకీయ సంస్థ ైడె రెక్టర్‌గా డాక్టర్ కృష్ణస్వామి, కొప్పళ వైద్యకళాశాల డెరైక్టర్‌గా డాక్టర్ శ్రీనివాస్, కార్వార వైద్య కళాశాల డెరైక్టర్‌గా డాక్టర్ భరత్ నియమితులైనట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అదే విధంగా గదగ్ వైద్య కళాశాల డెరైక్టర్‌గా హుబ్లీ కిమ్స్‌కు చెందిన డాక్టర్ చందు, గుల్బర్గా వైద్య కళాశాల డెరైక్టర్‌గా హుబ్లీ కిమ్స్‌కు చెందిన షాపూర్, చామరాజనగర్ వైద్య కళాశాల ైడె రెక్టర్‌గా డాక్టర్ చంద్రశేఖర్‌లు నియమితులయ్యారు. డాక్టర్ కృష్ణస్వామి, డాక్టర్ శ్రీనివాస్‌లకు శుక్రవారం ఉదయం విమ్స్ సిబ్బంది వైద్యులు, అభినందనలు తెలిపారు. -
విమ్స్‌లో మందుల కొరత
బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : వ్యాధి సోకి నీరసించి చికిత్స కోసం విమ్స్ ఆసుపత్రికి వస్తే సెలైన్ ఎక్కించడానికి నార్మల్ సెలైన్ (ఎన్ఎస్) బాటి ళ్లు లేవు. అమిత్రో మైసిన్, సిఫిక్సిమ్ కేప్సుల్స్, ఆంపిసిలిన్, టెట్రాసైక్లిన్ ఇంజక్షన్లు అసలే లేవు. కిడ్నీ సమస్యల నివారణకు వాడే ప్రూస్ మైడ్, అలర్జీకి వాడే లివోసిట్రజిన్ మాత్రలు మచ్చుకైనా కనిపించవు. ఇదీ పెద్దాసుపత్రిగా ప్రసిద్ధి గాంచిన విమ్స్‌లోని పరిస్థితి. కర్ణాటక, సరిహద్దులోని రెండు జిల్లాల వాసులకు ఆరోగ్యప్రదాయినిగా ఖ్యాతికెక్కిన విమ్స్ ఆసుపత్రిలో మాత్రలు,సెలైన్ బాటిల్స్ కొరత వుండటంతో రోగులకు అవసరమైన మందులు, మాత్రలు,సెలైన్ బాటిల్స్ కోసం వైద్యులు ఆసుపత్రి బయట ఉన్న మందుల షాపులకు రాస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స దొరుకుతుందనే నమ్మకంతో విమ్స్‌కు వచ్చే నిరుపేద రోగులు మందులు, మాత్రలు, సెలైన్ కొనుగోలుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు తెచ్చుకొన్న డబ్బు కాస్త మందులు, మాత్రలకే అయిపోవడంతో మళ్లీ డబ్బు కోసం ఊరెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఆసుపత్రిలో మందుల కొరతపై విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసులును న్యూస్‌లైన్ వివరణ కోరగా మందులు, మాత్రలు, సెలైన్ బాటిళ్ల సరఫరాకు సంబంధిత కంపెనీలకు ఆర్డర్ పెట్టామని, కంపెనీల సరఫరా జాప్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు రోజుల క్రితం వరకు సిరంజ్‌లు కూడా కొరత ఉండేది. అయితే కంపెనీలపై ఒత్తిడి చేసి సిరంజ్‌లు, నీడిల్స్ తె ప్పించామన్నారు. మందుల సరఫరాకు కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉంది. పాత టెండర్లనే కొనసాగిస్తుండటం వల్ల సరఫరా ఆలస్యమవుతోందన్నారు. సమస్య తీర్చడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
విమ్స్ వైద్యుడు రామరాజుకు అంతర్జాతీయ అవార్డు
బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : ఆసియా ఓసియానియా ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సంస్థ బెస్ట్ యంగ్ గైనకాలజిస్ట్ అవార్డుకు బళ్లారి విమ్స్‌కు చెందిన డాక్టర్ రామరాజు ఎంపికయ్యారు. గర్బిణులు, పౌష్టికాహారం, తల్లిపాల ఉపయోగం.. ఇతరత్రా అంశాలపై ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. అంతర్జాతీయంగా రెండేళ్లకొకసారి డాక్టర్ షాన్ ఎస్.రత్నంపేరు మీద 24 దేశాలకు చెందిన గైనకాలజిస్ట్‌లకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు భారతదేశం తరుఫున విమ్స్ వైద్యుడు డాక్టర్ రామరాజు ఎంపికయ్యారు. ఈ అవార్డును బ్యాంకాక్‌లో అక్టోబర్ 20 నుంచి 23 వరకు జరిగే అంతర్జాతీయ సమావేశంలో డాక్టర్ రామరాజుకు ప్రదానం చేయనున్నారు. మాతాశిశు మరణాల నివారణ, తల్లిపాల ప్రాధాన్యత, పౌష్టికాహారం తదితర అంశాలపై డాక్టర్ రామరాజు బళ్లారి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాం తాలు, పాఠశాలల్లోనూ వందకుపైగా పైగా జా గృతి కార్యక్రమాలను నిర్వహించారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో జరిగిన వైద్యసదస్సుల్లో పాల్గొని గైనకాలజీ వైద్యంపై ప్రజంటేషన్ చేశారు. ఈయన సేవలను గుర్తించి 2011లో ఆసియా ఓసియానియా ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సంస్థ చైనాలోని తైవాన్ రాజధాని తైపీలో జరిగిన సమావేశంలో దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ యూత్ సర్వీస్ ప్రశస్తిని అందించింది. అవార్డుకు ఎంపికైన డాక్టర్ రామరాజును విమ్స్ సంచాలకుడు డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, వైద్యులు అభినందించారు.