బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : వ్యాధి సోకి నీరసించి చికిత్స కోసం విమ్స్ ఆసుపత్రికి వస్తే సెలైన్ ఎక్కించడానికి నార్మల్ సెలైన్ (ఎన్‌ఎస్) బాటి ళ్లు లేవు. అమిత్రో మైసిన్, సిఫిక్సిమ్ కేప్సుల్స్, ఆంపిసిలిన్, టెట్రాసైక్లిన్ ఇంజక్షన్లు అసలే లేవు. కిడ్నీ సమస్యల నివారణకు వాడే ప్రూస్ మైడ్, అలర్జీకి వాడే లివోసిట్రజిన్ మాత్రలు మచ్చుకైనా కనిపించవు.
ఇదీ పెద్దాసుపత్రిగా ప్రసిద్ధి గాంచిన విమ్స్‌లోని పరిస్థితి. కర్ణాటక, సరిహద్దులోని రెండు జిల్లాల వాసులకు ఆరోగ్యప్రదాయినిగా ఖ్యాతికెక్కిన విమ్స్ ఆసుపత్రిలో మాత్రలు,సెలైన్ బాటిల్స్ కొరత వుండటంతో రోగులకు అవసరమైన మందులు, మాత్రలు,సెలైన్ బాటిల్స్ కోసం వైద్యులు ఆసుపత్రి బయట ఉన్న మందుల షాపులకు రాస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స దొరుకుతుందనే నమ్మకంతో విమ్స్‌కు వచ్చే నిరుపేద రోగులు మందులు, మాత్రలు, సెలైన్ కొనుగోలుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు తెచ్చుకొన్న డబ్బు కాస్త మందులు, మాత్రలకే అయిపోవడంతో మళ్లీ డబ్బు కోసం ఊరెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది.
ఆసుపత్రిలో మందుల కొరతపై విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసులును న్యూస్‌లైన్ వివరణ కోరగా మందులు, మాత్రలు, సెలైన్ బాటిళ్ల సరఫరాకు సంబంధిత కంపెనీలకు ఆర్డర్ పెట్టామని, కంపెనీల సరఫరా జాప్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు రోజుల క్రితం వరకు సిరంజ్‌లు కూడా కొరత ఉండేది. అయితే కంపెనీలపై ఒత్తిడి చేసి సిరంజ్‌లు, నీడిల్స్ తె ప్పించామన్నారు. మందుల సరఫరాకు కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉంది. పాత టెండర్లనే కొనసాగిస్తుండటం వల్ల సరఫరా ఆలస్యమవుతోందన్నారు. సమస్య తీర్చడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విమ్స్‌లో మందుల కొరత
Published Sat, Dec 21 2013 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement