- బళ్లారి, కొప్పళ ఆస్పత్రులకు ఒక్కరే డెరైక్టర్
- ఇన్‌చార్జిలతో కాలం నెట్టుకొస్తున్న పాలకులు
- అవస్థలు పడుతున్న రోగులు
బళ్లారి: బళ్లారి జిల్లాతోపాటు కొప్పళ, రాయచూరు, చిత్రదుర్గం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల ప్రజలకు వైద్య సేవలు అందించే విమ్స్ ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జనానికి జబ్బు చేస్తే ఆస్పత్రికి వె ళ్లి చికిత్సలు చేయించుకుని బాగు చేయించుకుంటారు. అయితే జనానికి వైద్యం చేసే ప్రధాన ఆస్పత్రి అయిన విమ్స్‌కు జబ్బు చేయడం రోగులకు శాపంగా మారింది. బళ్లారి నగరంలోని 1000 పడకల అతిపెద్ద ఆస్పత్రిలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.
విమ్స్ డెరైక్టర్ రెండు ప్రధాన ఆస్పత్రులకు డెరైక్టర్‌గా వ్యవహరిస్తుండడంతో సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. కొప్పళలో ప్రభుత్వ ఆస్పత్రిలో డెరైక్టర్‌గా పని చేసే శ్రీనివాస్‌ను ఆరు నెలల క్రితం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి డెరైక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే కొప్పళకు కొత్త డెరైక్టర్‌ను నియమించకుండా, అక్కడి బాధ్యతలను కూడా శ్రీనివాస్‌కు అప్పగించింది. ఆరు నెలలు దాటినా కొప్పళకు డెరైక్టర్‌గా ఎవరినీ నియమించలేదు. రెండు ఆస్పత్రులకు శ్రీనివాస్ డెరైక్టర్‌గా పని చేస్తున్నారు. దీంతో రెండింటికి న్యాయం చేయలేకపోతున్నారు. బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో సర్జరీ, మెడిసన్, ఓబీజీ, ఆర్థో, ఈఎన్‌టీ, స్కిన్, రేడియాలజీ, చిల్డ్రన్స్, యూరాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే 20కి పైగా వివిధ డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అం దులో ఒ క్కొక్క డిపార్ట్‌మెంటు కు ఒక్కొక్కరు ఇన్ చార్జిలుగా వైద్యులు ఉంటారు. వారి నేతృత్వంలో ఒక్కొక్క డిపార్ట్‌మెంటులో మరో 10 మందికి పైగా వైద్యులు పని చేస్తుంటారు.
ఇలా వందలాది మంది వైద్యులు పని చే సే ప్రధాన ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. ఇంత పెద్దాస్పత్రిని పర్యవేక్షించే డెరైక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకు పోతున్నట్లు వైద్యులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రధాన ఆస్పత్రుల్లో సంతకాలు పెట్టడానికే ఆయనకు సమయం సరిపోతుండడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రిలో సమస్యలు రోజురోజుకూ జఠిలమవుతున్నాయి. సంబంధిత వైద్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు విమ్స్ ఆస్పత్రిలో సమస్యల గురించి పట్టించుకునే కనీస ఆలోచన చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమ్స్ ఆస్పత్రిలో మంచినీటి సమస్యతోపాటు పారిశుధ్య సమ స్య పట్టిపీడిస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వార్డును సక్రమంగా శుభ్రం చేయడం లేదని రోగులు పేర్కొన్నారు. మరోవైపు మందుల కొరత వేధిస్తోంది. వీటితో పా టు ఆస్పత్రిలో పని చేసే వైద్యులకు కూడా సక్రమంగా జీతాలు అందించడం లేదు. వీటితో పాటు ప్రిన్సిపాల్, సీఈఓ వంటి ప్రధాన పోస్టులకు సంబంధించిన వైద్యులు కూడా ఇన్ చార్జిలే పని చేస్తున్నారు. పూర్తిస్థాయి బాధ్య తలు అప్పగించక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
జిల్లా ఇన్ చార్జి మంత్రికి ఆస్పత్రి లో సమస్యలు పరిష్కరించడానికి కాదు కదా కనీసం ఆస్పత్రిని విజిట్ చేయడానికి కూడా తీరిక లేదేమో అని పలువురు విమర్శిస్తున్నా రు. విమ్స్ ఆస్పత్రి పరిధిలోకి వచ్చే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, దంత ఆస్పత్రి పనులు పూర్తి కాలేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి, దంత ఆస్పత్రికి నిధుల కొరత వేధిస్తుండడంతో మూ డు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెన క్కి వెళుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే వి మ్స్ ఆస్పత్రిలో అడుగడుగునా సమస్యలు రా జ్యమేలుతున్నాయి. ఇకనైనా సంబంధిత మం త్రి ప్రత్యేక దృష్టి పెట్టి ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సమస్యల వలయంలో విమ్స్
Published Thu, May 7 2015 6:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement