బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన 6 వైద్య కళాశాలల్లో డెరైక్టర్ పోస్టులకు జరిగిన ఇంటర్వ్యూలలో బళ్లారిలోని విమ్స్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ వైద్యులు డెరైక్టర్లులుగా ఎంపికయ్యారు. రాష్ట్రంలోని కొప్పళ, గదగ్, గుల్బర్గా, కొడగు, కార్వార, చామరాజనగర్‌లో కొత్తగా ప్రారంభమైన వైద్యకళాశాలల్లోడెరైక్టర్ పోస్టుకు అర్హులైన ప్రముఖ వైద్యులకు గురువారం బెంగుళూరులో రాష్ట్ర వైద్య విద్యాశాఖా మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ కార్యాలయంలో ప్రభుత్వం ఇంటర్వ్యూలు నిర్వహించింది.
రాష్ట్రంలోని వివిధ వైద్యకళాశాలలకు చెందిన 104 మంది ప్రముఖ వైద్యులు దరఖాస్తులు చేసుకోగా, వీరిలో 36 మందిని అర్హులుగా నిర్ణయించారు. 36 మంది వైద్యుల్లో సీనియారిటీ, ఇంటర్వ్యూల్లో కనబరచిన ప్రతిభ ఆధారంగా ఆరు కళాశాలకు ఆరుగురిని డెరైక్టర్లుగా ఎంపిక చేశారు. వీరిలో విమ్స్‌లోని బయోకెమిస్ట్రీ విభాగ ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణస్వామి, ఫార్మకాలజీ విభాగ ప్రముఖుడు డాక్టర్ శ్రీనివాసులు, పెతాలజీ విభాగ ప్రముఖ వైద్యుడు డాక్టర్ భరత్‌లు ఉన్నారు.
కొడగు విజ్ఞాన వైద్యకీయ సంస్థ ైడె రెక్టర్‌గా డాక్టర్ కృష్ణస్వామి, కొప్పళ వైద్యకళాశాల డెరైక్టర్‌గా డాక్టర్ శ్రీనివాస్, కార్వార వైద్య కళాశాల డెరైక్టర్‌గా డాక్టర్ భరత్ నియమితులైనట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అదే విధంగా గదగ్ వైద్య కళాశాల డెరైక్టర్‌గా హుబ్లీ కిమ్స్‌కు చెందిన డాక్టర్ చందు, గుల్బర్గా వైద్య కళాశాల డెరైక్టర్‌గా హుబ్లీ కిమ్స్‌కు చెందిన షాపూర్, చామరాజనగర్ వైద్య కళాశాల ైడె రెక్టర్‌గా డాక్టర్ చంద్రశేఖర్‌లు నియమితులయ్యారు. డాక్టర్ కృష్ణస్వామి, డాక్టర్ శ్రీనివాస్‌లకు శుక్రవారం ఉదయం విమ్స్ సిబ్బంది వైద్యులు, అభినందనలు తెలిపారు.
వైద్యకళాశాలల డెరైక్టర్లుగా ‘విమ్స్’ వైద్యులు
Published Sat, Feb 8 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement