Biochemistry
-
బుగ్గలు పుణికిన పరిశోధన
వార్ధక్యంలోని మతిమరుపుపై పీహెచ్డీ చేసి, ఔషధ పరిశోధన జరిపిన ప్రియాంక ఇప్పుడు పెద్దవాళ్లందరి ముద్దుల మనవరాలు అయ్యారు. ప్రియాంకా జోషి (29) పుణె అమ్మాయి. బయోకెమిస్ట్. సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీ నుంచి బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ బయో టెక్నాలజీలో మాస్టర్స్ చేసింది. ఇంగ్లండ్‌కు వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది. వార్ధక్యంతో వచ్చే మతిమరుపునకు విరుగుడు కనిపెట్టడం ఆమె పరిశోధనాంశం. ఇంగ్లండ్, వేల్స్‌లలో మహిళలు ఎక్కువ మంది డిమెన్షియా కారణంగానే మరణిస్తున్నారు. ఆ పరిస్థితిని గమనించి, చలించిన ప్రియాంక.. మతిమరుపును దూరం చేసే మందుల కోసం సూక్ష్మ అధ్యయనం. అంతటి విస్తృతమైన అంశంలో పరిశోధన చేయడం, అది కూడా అంత చిన్న వయసులోనే పూర్తి చేయడంతో ఆమెకు గుర్తింపు లభించింది. ‘వోగ్’ మ్యాగజీన్ ఈ ఏడాది పాతికమంది ప్రభావవంతమైన మహిళల జాబితాలో ప్రియాంకను చేర్చింది. ప్రియాంకే చిన్న వోగ్ పత్రిక అమెరికా కేంద్రంగా నూట పాతికేళ్ల కిందట మొదలైంది. వార పత్రికగా ఆవిర్భవించి మాస పత్రికగా కొనసాగుతోంది. 23 అంతర్జాతీయ ఎడిషన్లతో నిరంతరాయంగా వస్తోంది. అటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రచురణ సంస్థ ‘25 ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ ఇన్ బ్రిటన్ షేపింగ్ 2018’ విభాగంలో గుర్తించిన పాతిక మంది మహిళల వరుసలో ప్రియాంకకు స్థానం లభించింది. ఇంతటి గుర్తింపును, గౌరవాన్ని మానవహక్కుల ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, కళాకారులు, రచయితల వంటి వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలందించిన మహిళలను ఎంపిక చేస్తుంటుంది వోగ్. ఈ ఏడాది జాబితాలో ఇరవై ఏళ్లుగా రచనారంగంలో ఉండి హ్యారీ పోటర్ రచనతో ప్రపంచంలో నేటికీ అత్యధిక పారితోషికం అందుకుంటున్న 52 ఏళ్ల జెకె రోలింగ్, మానవహక్కుల న్యాయవాది 40 ఏళ్ల అమల్ క్లూనీ కూడా ఉన్నారు. వీరితోపాటు వేదికను పంచుకుంటున్న మరో మహిళ మేఘన్ మార్కల్. అవును, బ్రిటిష్ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న మార్కల్ స్త్రీవాద పరిరక్షణ, సమానత్వ సాధన కోసం పని చేస్తున్న యువతి. ఈ పాతికమందిలోనూ ప్రియాంకే అందరికన్నా చిన్నమ్మాయి. ఇదే ప్రథమం కాదు ప్రియాంక వోగ్ గౌరవానికి ఎంపిక కావడానికి ముందే అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2011 నుంచి 14 వరకు మేరీ స్లో్కడోస్కా– క్యూరీ ఫెలోషిప్, 2015లో బెస్ట్ పీహెచ్‌డీకి సాల్జే మెడల్, అల్జీమర్స్ డ్రగ్ డిస్కవరీ ఫౌండేషన్ నుంచి ‘యంగ్ ఇన్వెస్టిగేటర్ 2013’ అవార్డు గెలుచుకున్నారు. ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ సమ్మర్ రీసెర్చ్ ఫెలో, ‘బయోకెమికల్ సొసైటీ సెంటిఫిక్ అవుట్‌రీచ్’లు ప్రియాంకకు ఉపకారవేతనంతో సహకారం అందించాయి. ఫోర్బ్స్ మ్యాగజీన్ కూడా గతంలో శాస్త్రరంగంలో విశిష్టమైన సేవలందిస్తున్న వారి జాబితాలో ప్రియాంకను చేర్చింది. మెదడు పనితీరు, మెదడు కణాలను చైతన్యవంతంగా ఉంచడం కోసం ఆమె శ్రమిస్తున్న వైనం, ఆమె అంకితభావమే ఆమెను ఇన్ని గౌరవాలకు దగ్గర చేశాయి. అభినందనలు వెల్లువలా ప్రవహించడానికి ప్రధాన కారణం... ఆమె ఎంచుకున్న అంశం సమస్త మానవాళికి శ్రేయస్సునిచ్చేది కావడమే. – మంజీర -
ఎంసీఐ నిర్ణయం సబబే!
అర్హతల జాబితా నుంచి.. ఎండీ బయో కెమిస్ట్రీ తొలగింపును సమర్థించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (డీఏం), ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషాలటీ కోర్సులో ప్రవేశం పొందేందుకు నిర్ణయించిన కనీస అర్హతల జాబితా నుంచి ఎండీ(బయో కెమిస్ట్రీ)ని తొలగిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కనీస అర్హతల జాబితా నుంచి ఎండీ బయో కెమిస్ట్రీ తొలగింపు ఎంసీఐ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే జరిగిందని, వైద్య వృత్తిలో నిపుణులైన డాక్టర్ల బృందం అన్నీ ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ విధంగానూ తప్పుపట్టలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎండీ(బయోకెమిస్ట్రీ) తొలగింపు సవరణ వల్ల తమకు ఎండీ(ఎండోక్రైనాలజీ) కోర్సును చేయలేకపోతున్నామన్న పిటిషనర్ల వాదన ఆధారంగా ఎంసీఐ సవరణను కొట్టేయలేమని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. -
వైద్యకళాశాలల డెరైక్టర్లుగా ‘విమ్స్’ వైద్యులు
బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన 6 వైద్య కళాశాలల్లో డెరైక్టర్ పోస్టులకు జరిగిన ఇంటర్వ్యూలలో బళ్లారిలోని విమ్స్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ వైద్యులు డెరైక్టర్లులుగా ఎంపికయ్యారు. రాష్ట్రంలోని కొప్పళ, గదగ్, గుల్బర్గా, కొడగు, కార్వార, చామరాజనగర్‌లో కొత్తగా ప్రారంభమైన వైద్యకళాశాలల్లోడెరైక్టర్ పోస్టుకు అర్హులైన ప్రముఖ వైద్యులకు గురువారం బెంగుళూరులో రాష్ట్ర వైద్య విద్యాశాఖా మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ కార్యాలయంలో ప్రభుత్వం ఇంటర్వ్యూలు నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ వైద్యకళాశాలలకు చెందిన 104 మంది ప్రముఖ వైద్యులు దరఖాస్తులు చేసుకోగా, వీరిలో 36 మందిని అర్హులుగా నిర్ణయించారు. 36 మంది వైద్యుల్లో సీనియారిటీ, ఇంటర్వ్యూల్లో కనబరచిన ప్రతిభ ఆధారంగా ఆరు కళాశాలకు ఆరుగురిని డెరైక్టర్లుగా ఎంపిక చేశారు. వీరిలో విమ్స్‌లోని బయోకెమిస్ట్రీ విభాగ ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణస్వామి, ఫార్మకాలజీ విభాగ ప్రముఖుడు డాక్టర్ శ్రీనివాసులు, పెతాలజీ విభాగ ప్రముఖ వైద్యుడు డాక్టర్ భరత్‌లు ఉన్నారు. కొడగు విజ్ఞాన వైద్యకీయ సంస్థ ైడె రెక్టర్‌గా డాక్టర్ కృష్ణస్వామి, కొప్పళ వైద్యకళాశాల డెరైక్టర్‌గా డాక్టర్ శ్రీనివాస్, కార్వార వైద్య కళాశాల డెరైక్టర్‌గా డాక్టర్ భరత్ నియమితులైనట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అదే విధంగా గదగ్ వైద్య కళాశాల డెరైక్టర్‌గా హుబ్లీ కిమ్స్‌కు చెందిన డాక్టర్ చందు, గుల్బర్గా వైద్య కళాశాల డెరైక్టర్‌గా హుబ్లీ కిమ్స్‌కు చెందిన షాపూర్, చామరాజనగర్ వైద్య కళాశాల ైడె రెక్టర్‌గా డాక్టర్ చంద్రశేఖర్‌లు నియమితులయ్యారు. డాక్టర్ కృష్ణస్వామి, డాక్టర్ శ్రీనివాస్‌లకు శుక్రవారం ఉదయం విమ్స్ సిబ్బంది వైద్యులు, అభినందనలు తెలిపారు.