విశాఖపట్టణం: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్) ప్రైవేటీకరణను ఒప్పుకోబోమని విశాఖపట్టణం మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు వ్యాఖ్యానించారు. విమ్స్ను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాలో మాట్లాడారు. ఎయిమ్స్ను మంగళగిరిలో కంటే విమ్స్లో కొనసాగిస్తేనే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని దొరబాబు సూచించారు. ఆరేళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే విమ్స్ లో పనులు నిలిచిపోయాయని విమర్శించారు. కేజీహెచ్లో సిబ్బంది కొరతను నివారించాలని దొరబాబు డిమాండ్ చేశారు.