dora babu
-
‘పవన్ ఆ సమయంలో మందు కొట్టి పడుకున్నారా?’: పిఠాపురం ఎమ్మెల్యే
సాక్షి, పిఠాపురం: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఇలా మాట్లాడారు. ‘పవన్ నాయుడు.. మీరు ఇంకా సినిమా భాషని.. సొంత భాషని మరిచిపోయినట్లు లేరు. ఆల్ రెడీ మీరు పోటీ చేసిన రెండు నియోజకవర్గాలో ప్రజలు మీ తాట తీశారు. అయినా నీకు బలుపు తగ్గలేదు. ఆరు నెలలకొకసారి మీడియా ముందుకు వచ్చి.. నీ భాషలో మాట్లాడడం రాజకీయం కాదు’ అని హితవు పలికారు. చదవండి: నయా దొంగలు సెల్ టవరే లక్ష్యం.. అక్కడ ఏముంటుందని అనుకోవద్దు ‘కాపు ఉద్యమ సమయంలో మీరు చంద్రబాబుతో కలిసి సమ్మగా అంబలి తాగుతున్నారు. కాపులకు ఇచ్చిన హమీని అమలు చేయమని అడిగిన ముద్రగడను కుటుంబంతో సహా మోకాలితో తన్నారు. ఆవాళ మీరు ఏమయ్యారు. మందు కొట్టి పడుకున్నారా? ఇదేంటని చంద్రబాబును అడగాలని అనిపించలేదా? కాపు ఉద్యమంలో అందరికి ఆహ్వానం ఉంది. మీ అన్న చిరంజీవి వచ్చే ప్రయత్నం చేశారు. మరి నువ్వెందుకు రాలేదు’ అని ఎమ్మెల్యే దొరబాబు ప్రశ్నించారు. చదవండి: ఏపీ టూ మహారాష్ట్ర వయా తెలంగాణ.. వీళ్ల తెలివి మామూలుగా లేదుగా ‘వైజాగ్ ప్రజలు ఓడించారని స్టీల్ ప్లాంట్ కోసం పోరాడను అని అంటున్నావ్. మరి మీ పార్టీని రాష్ట్ర ప్రజలంతా ఓడించారు. అలాంటప్పుడు రాష్ట్రం కోసం ఎందుకు మాట్లాడుతున్నావ్. అయ్యా పవన్ నాయుడు ఇప్పటికీ మీకు రాజకీయాల మీద అవగాహన.. పరిపక్వత లేదు. రాజకీయం అంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకో. కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలను పేదలకు అందించడాన్ని గుర్తించు. ఇవాళ కాపులను సీఎం ఎంతో గౌరవంగా చూస్తున్నారు’ అని తెలిపారు. -
తుపాన్ భాదితులను పరామార్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తూర్పు గోదావరి: పెథాయ్ తుపాన్ తీరం తాకడంతో కాకినాడలో తుపాన్ భాదితులను పరామర్శించిన వైస్సాఆర్సీపీ నాయకులు. కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్, పిఠాపురం కోఆర్డినేటర్ పెండెం దొరబాబు దుమ్ములపేట, పిఠాపురం గ్రామాల్లో పర్యటించారు. వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలను కలసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మాకు ఎటువంటి సహయక చర్యలు తీసుకోలేదని భాదితులు వాపోయారు. తాగడానకి మంచి నీరు, వంటి సహయక చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు . తుపాన్ భాదితులకు బిస్కెట్లు, మంచి నీళ్ల పాకెట్లు అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించడానికి ప్రభుత్వం వెంటనే సహయక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
'విమ్స్ ప్రైవేటీకరణ ఒప్పుకోం'
విశాఖపట్టణం: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్) ప్రైవేటీకరణను ఒప్పుకోబోమని విశాఖపట్టణం మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు వ్యాఖ్యానించారు. విమ్స్‌ను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాలో మాట్లాడారు. ఎయిమ్స్‌ను మంగళగిరిలో కంటే విమ్స్‌లో కొనసాగిస్తేనే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని దొరబాబు సూచించారు. ఆరేళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే విమ్స్ లో పనులు నిలిచిపోయాయని విమర్శించారు. కేజీహెచ్‌లో సిబ్బంది కొరతను నివారించాలని దొరబాబు డిమాండ్ చేశారు. -
వైఎస్సార్ సీపీలోకి దొరబాబు
గండేపల్లి, న్యూస్‌లైన్ : మాజీ మంత్రి తోట నరసింహం ముఖ్య అనుచరుడు, గండేపల్లి మండలం మురారికి చెందిన కాంగ్రెస్ బ్లాక్ వన్ అధ్యక్షుడు చలగళ్ల దొరబాబు తన 400 మంది అనుచరులతో బుధవారం ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, కాకినాడ పార్లమెంటరీ నాయకుడు చలమలశెట్టి సునీల్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ నేతలు కండువాలు వేసి ఆహ్వానించారు. రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్న చంద్రబాబు రాష్ర్ట విభజనను అడ్డుకోలేకపోయారని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు విమర్శించారు. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించగల సత్తా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని చలమలశెట్టి సునీల్ అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించారన్నారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని తన తండ్రి జ్యోతుల నెహ్రూ కు ఇవ్వాలని నవీన్ కోరారు. పీఏసీఎస్ అధ్యక్షుడు ముమ్మన సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్ గద్దె చినసత్తిరాజు, భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు గారపాటి శేషగిరిరావు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పరిమి బాబు, మేకా మాధవరావు, సుంకవిల్లి రాజారావు, అడబాల భాస్కరరావు, ఉప్పలపాటి సాయి, మద్దిపట్ల రామకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.