సాక్షి, చెన్నై: విల్లుపురం జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువుదీరిన కూత్తాండవర్ ఆలయంలో చైత్ర మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక నేపథ్యంతో ముడి పడి ఉన్న ఇక్కడి ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. శ్రీ కృష్ణుడు మోహినీ అవతారం(హిజ్రా)తో ఐరావంతుడిని పెళ్లి చేసుకున్నట్టు పురాణాలు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుక మంగళవారం అత్యంత కోలాహలంగా కూవాగంలో జరిగింది. హిజ్రాల పెళ్లి సందడితో కూవాగం జాతరను తలపించింది.
తరలివచ్చిన హిజ్రాలు: పెళ్లి వేడుక నిమిత్తం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్,
హిజ్రాల పెళ్లి సందడి
మహారాష్ట్ర, ఢిల్లీతోపాటుగా పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హిజ్రాలు తరలి వచ్చారు. ఉదయం నుంచి కూవాగం పరిసరాలు కళకళ లాడాయి. ఆ పరిసర గ్రామాల ప్రజలతోపాటుగా హిజ్రాలు తరలి రావడంతో కూవాగం పెళ్లి వేడుక వాతావరణం మునిగింది. సాయంత్రం ఆలయం ఆవరణలో హిజ్రాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వధువులకు తీసిపోని విధంగా పట్టు వస్త్రాలు, ఆభరణాల్ని ధరించి తరలిరాగా, మరి కొందరు తమ స్థోమత మేరకు పెళ్లి కూతళ్ల వలే ముస్తాబయ్యారు. ఆలయం వద్ద ఈ హిజ్రాలకు పూజారులు తాళి బొట్లు కట్టే సన్నివేశాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. తాళి బొట్టు కట్టించుకున్న హిజ్రాల ఆనందంలో మునిగిపోయూరు.
రాత్రంతా వీరి కోసం కేటాయించిన ప్రత్యేక స్థలంలో సందడి చేశారు. ఆటా, పాటలతో హోరెత్తించారు. ఇక, ఈ ఉత్సవాల్లో చివరి ఘట్టం బుధవారం జరగనుంది. పురాణ గాథ మేరకు పెళ్లి వేడుక అనంతరం ఐరావంతుడు బలి దానం అవుతాడు. దీంతో తమ భర్తను కోల్పోయిన వేదనతో తాళి క ట్టించుకున్న మరుసటి రోజున హిజ్రాలు వితంతువుల అవతారం ఎత్తనున్నారు. ఆలయ పూజారే వారి తాళి బొట్లను తెంచి వేస్తాడు. తమ భర్త చనిపోయాడన్న వేదనతో ఆ సమయంలో హిజ్రాలు విషాదంలో మునుగుతారు. తెల్ల చీర కట్టుకుని ఒకరినొకరు ఓదార్చుకుంటారు. అనంతరం ఎవరికి వారు తమ తమ స్వస్థలాలకు వెళ్లి పోతారు. దీనికి ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం కనుల పండువగా నిర్వహించనున్నారు.
మిస్ కూవాగం సహానా: మిస్ కూవాగం -2014 టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన సహానా దక్కించుకుంది. విల్లుపురం హిజ్రాల సంక్షేమ సంఘం నేతృత్వంలో ప్రతి ఏటా ఉత్సవాల్లో మిస్ కూవాగం పోటీలు నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి జరిగిన ఈ పోటీల్లో 30 మంది హిజ్రాలు ర్యాంప్‌పై వయ్యారాలు ఒలక బోశారు. తమ మేధస్సుకు పదును పెట్టే విధంగా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. న్యాయ నిర్ణేతలుగా సినీ నటుడు శరత్‌కుమార్, పృథ్విరాజ్, నటి రాధిక వ్యవహరించారు. విజేతగా విజయవాడకు చెందిన సహానా టైటిల్‌ను దక్కించుకుంది. సహానాకు శరత్‌కుమార్ కిరీటం బహుకరించారు. రెండో స్థానాన్ని ఈరోడ్‌కు చెందిన ఐశ్వర్య, మూడో స్థానాన్ని చెన్నైకు చెందిన నమిత దక్కించుకున్నారు.
హిజ్రాల పెళ్లి సందడి
Published Wed, May 14 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement