ఆడబిడ్డ పుట్టిందని..
Published Fri, Nov 25 2016 3:44 PM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM
తిరుమల: తిరుమలలో దారుణం చోటు చేసుకుంది. ఆడబిడ్డ పుట్టిందని ఓ మహిళను అత్తింటి వారు ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆ మహిళ న్యాయం కోసం ధర్నాకు దిగింది. ఈ సంఘటన తిరుమల బాలాజీనగర్‌లో శుక్రవారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న విజయలక్ష్మీకి ఇటీవల ఆడబిడ్డ పుట్టింది. దీంతో భర్తింటి వారు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ఈ రోజు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
Advertisement
Advertisement