ప్రేమను నిరాకరించిందని..
ప్రేమను నిరాకరించిందని..
Published Tue, Sep 6 2016 4:06 PM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM
విజయవాడ: తన ప్రేమను నిరాకరించిందనే నెపంతో ఓ యువతి ఫొటోలను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశాడో ప్రబుద్ధుడు. వివరాలు.. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల కేంద్రానికి చెందిన మాదివాడ మురారి (23)అనే యువకుడు ప్రేమ పేరుతో భవానీపురం పరిధిలోని గొల్లపూడి గ్రామానికి చెందిన ఓ యువతిని వేధించాడు. అయితే ఆ యువతి మురారి ప్రేమను నిరాకరించింది. ఈ కారణంతో పగ పెంచుకున్న యువకుడు ఆమె ఫోటోలను పోర్న్‌సైట్ లో అప్‌లోడ్ చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని తండ్రికి తెలిపింది. దీంతో బాధితురాలి తండ్రి భవాని పురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని హైదరాబాద్ లో సోమవారం అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిని మంగళవారం మెజిస్ర్టేట్ ముందు హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement