సాక్షి, తిరువొత్తియూరు: ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన యువతిని మానామదురైకి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. శివగంగై జిల్లా మానామదురై దయాపురానికి చెందిన నిర్వన్ సింగపూరులో ఉన్న ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన మేరిజేన్ అదే సంస్థలో పని చేస్తున్నారు. వీరిద్దరికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది.
ఇద్దరూ వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ వివాహానికి నిర్విన్ తల్లిదండ్రులు, మేరిజేన్ తల్లిదండ్రులు సమ్మతించారు. దీంతో తమిళ సంప్రదాయ ప్రకారం తిరుప్పురకుండ్రంలోని మురుగన్ ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆలయలలోని ఓ వివాహ మండపంలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో శుక్రవారం ఉదయం నిర్విన్, మేరిజేన్‌లకు వివాహం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment