ఒంగోలు : కొంగలను పడుతూ ప్రమాదవశాత్తూ కుంటలో పడి ఇద్దరు యవకులు మరణించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం గన్నవరం రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి...వారికి కుంటలో నుంచి బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు ప్రభుదాసు (25), సురేష్ (19) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.