నెల్లూరు రొట్టెల పండుగకు వైఎస్ జగన్
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన భాగంలో నెల్లూరు బారా షహీద్ దర్గాలో నిర్వహించే రొట్టెల పండుగలో పాల్గొంటారు.
ప్రతి యేటా ఇక్కడ నిర్వహించే రొట్టెల పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ పండుగకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. బారాషహీద్ దర్గాను దర్శించుకోవడంతో పాటు తమ కోరికల రొట్టెలను మార్చుకోవడం పండుగలో భాగంగా ఉంది.