AP CM YS Jagan Kavali Tour Updates: CM To Initiate Grant Of Dotted Lands To Farmers Across 2.06 Lakh Acres - Sakshi
Sakshi News home page

రూ.20 వేల కోట్ల విలువైన భూములపై రైతులకు సర్వహక్కులు: సీఎం జగన్‌

Published Fri, May 12 2023 8:10 AM | Last Updated on Fri, May 12 2023 1:53 PM

CM Jagan Nellore Tour Granting Rights To Farmers Dotted Lands Updates - Sakshi

చంద్రబాబు రైతులను కోలుకోని దెబ్బ కొట్టారు: సీఎం జగన్‌
రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు
రిజిస్ట్రేషన్‌ 22(1)ఏ నుంచి డీనోటిఫై చేశాం
భూములపై రైతులకు సర్వహక్కులు లభించాయి
2,06,171 ఎకరాల భూములకు సంపూర్ణ హక్కులు లభించాయి
రూ.20 వేల కోట్ల మార్కెట్‌ విలువైన భూములకు సంపూర్ణ హక్కు

దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యకు విముక్తి
గత ప్రభుత్వం చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చింది
చంద్రబాబు రైతులను కోలుకోని దెబ్బ కొట్టారు
చంద్రబాబు హయాంలో భూములు అమ్ముకునే పరిస్థితి లేదు
చుక్కల భూముల హక్కుతో బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు
వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు ఉంటుంది
ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాం

రైతన్నలందరికీ చుక్కల భూములపై పూర్తి హక్కు కల్పించాం
రైతన్నల కష్టం నేను చూశాను.. మీకు నేను ఉన్నాను
ఇప్పటికే గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేశాం
గతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాం
ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే వేగంగా జరుగుతోంది
ఇప్పటికే 2వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశాం
భూ హక్కు పత్రాలు కూడా వేగంగా ఇస్తున్నాం
దేశంలో ఎక్కడా లేని విధంగా భూసర్వే చేస్తున్నాం
ఈ నెల 20న 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తాం

ఆర్బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందుబాటులోకి తెచ్చాం
దళారీ వ్యవస్థ లేకుండా చేసి రైతులకు మేలు చేశాం
గతంలో ఎన్నడూ జరగని మంచి ఇప్పుడు రైతులకు జరుగుతుంది
నాలుగేళ్లుగా ప్రతి అడుగూ రైతన్నల కోసమే వేశాం
రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు
చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారు
వారికి తోడుగా రావణ సైన్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిలిచాయి

రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రప్పిస్తామని చెప్పి మోసం చేశారు
రైతులను మోసం చేసిన పెద్ద మనిషిని ఒక్క మాట అడగరు
ప్రశ్నిస్తామని చెప్పిన వారు ప్రశ్నించడమే మానేశారు
ఎన్నికలు దగ్గరపడుతున్నందున వీళ్లంతా రోడ్డెక్కారు
చంద్రబాబు స్క్రిప్ట్‌ను డైలాగ్‌లుగా మార్చిన ప్యాకేజీ స్టార్‌ ఒక వైపు..
బాబు, దత్తపుత్రుడి డ్రామాలు రక్తి కట్టించాలని ఎల్లో మీడియా తానాతందానా
డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా జమ చేశాం
లంచాలు, వివక్షకు తావులేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు
ప్రతి పేదవాడికి తోడుగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది
చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే
చంద్రబాబు ప్రభుత్వం వస్తే సంక్షేమ​ పథకాలు నిలిచిపోతాయి
వీళ్ల విధానం డీపీటీ.. దోచుకో,పంచుకో, తినుకో

జీవీరావు చార్టర్‌ అకౌంటెంట్‌ సర్వీస్‌ రద్దయింది
ఇలాంటి దానయ్యకు కోటు తొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపారు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వద్దని, దివాలా తీస్తుందని చెప్పిస్తారు
రామోజీ పురుగులు పట్టిన బుర్రలోంచి ఇలాంటి వారు పుడతారు
చంద్రబాబు, ఎల్లో మీడియా మనసులో మాటలను వీళ్లతో చెప్పిస్తారు
చంద్రబాబు, ఎల్లో మీడియాది పెత్తందారీ మనస్తత్వం
వీళ్లు చేసే ప్రతి పని, ప్రతి మాట ప్రతి రాతలోనూ మోసం
పేదలందరికీ ఇళ్లు ఇస్తుంటే వీళ్లందరికీ కడుపుమంట

సీఎం జగన్‌ రైతుల పక్షపాతి: ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి
చుక్కల భూములకు సీఎం జగన్‌ శాశ్వత పరిష్కారం చూపారు
దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు విముక్తి
నెల్లూరు జిల్లాలో 43 వేల ఎకరాల చుక్కల భూములకు పరిష్కారం
ఏపీలో సంక్షేమ పాలన నడుస్తోంది.. ఇది పేదల ప్రభుత్వం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా కావలి చేరుకున్నారు. దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు సీఎం చెక్‌ పెట్టనున్నారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నారు. కాసేపట్లో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలుగుతుంది. దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కలగనున్నాయి.

వందేళ్ల క్రితం బ్రిటిష్‌ కాలంలో భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ లేదా ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ – ఆర్‌ఎస్‌ఆర్‌) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. అవే చుక్కల భూములు. వీటిని రైతులు అనుభవిస్తున్నా, సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభు­త్వం వీరి కష్టాలను మరింత సంక్లిష్టం చేస్తూ అనాలోచితంగా  ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. దీంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూములపై రైతులకే సంపూర్ణ హక్కులు ఉండాలని నిర్ణయించారు.

రైతులు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ఈ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. జిల్లా కలెక్టర్ల ద్వారా చుక్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫై చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ భూములపై రైతులకు సర్వ హక్కులు లభించాయి.

వారు వాటిని అమ్ముకొనేందుకు, రుణాలు పొందడానికి, తనఖాకు, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కలిగింది. వీటిపై రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం రైతులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1902 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. కాగా, సీఎం జగన్‌ శుక్ర­వారం ఉదయం 8.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన అషో్టత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞంలో పాల్గొంటారు.
చదవండి: ప్రతిదానికి పిల్‌ ఏమిటి?.. టీడీపీ ఎమ్మెల్యే పిటిషన్‌పై హైకోర్టు అభ్యంతరం

అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు కావలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుని, బహిరంగ సభలో పాల్గొంటారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement