
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెత్తకుప్పలు, మురికిగుంటలు తొలగించకపోవడం ద్వారా ప్రాణాంతక డెంగీ దోమల వ్యాప్తికి కారకులైన 12.5 లక్షల మంది చెన్నైవాసులకు గురువారం తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే 2.5 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో డెంగీ మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. ఇకపైనా ఇదే పరిస్థితి కొనసాగితే రూ.5 వేలు, ఆ తరువాత రూ.10 వేల చొప్పున జరిమానా వసూలు చేస్తామని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ కార్తికేయన్ హెచ్చరించారు.
మరోవైపు 15 రోజుల్లోగా చెత్తను తొలగించేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు ఏర్పాటు చేయాలని సీఎం పళనిస్వామి ఆదేశించారు. డెంగీ జ్వరాలపై సర్వే చేసేందుకు త్వరలో కేంద్ర బృందం తమిళనాడుకు వస్తుందని డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం గురువారం ఢిల్లీలో తెలిపారు. కాగా, డెంగీ బారిన పడి బుధ, గురువారాల్లో తమిళనాడులో ఏడుగురు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment