
భారత్‌లో శాంసంగ్ మొబైల్ పేమెంట్ సేవలు
ముంబై: శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తాజాగా భారత్‌లో ‘శాంసంగ్ పే’ మొబైల్ చెల్లింపుల సర్వీసులను ప్రారంభించింది. ఈ యాప్‌లో నమోదు చేసుకున్న కార్డుల ద్వారా చెల్లింపులు జరపవచ్చు. దీన్ని పేటీఎంతో పాటు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)కి కూడా అనుసంధానించినట్లు శాంసంగ్ ప్రెసిడెంట్ హెచ్‌సీ హాంగ్ తెలిపారు. దీని ద్వారా లావాదేవీలు అత్యంత సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.