ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో అక్రమంగా భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కారు డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన గంజాయి దాదాపు 100 కేజీల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.