16 వేల బస్తాల ప్రభుత్వ ధాన్యం మాయం | 16tousand Grain bags are Disappeared in jagtail | Sakshi
Sakshi News home page

16 వేల బస్తాల ప్రభుత్వ ధాన్యం మాయం

Published Fri, Mar 10 2017 12:57 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

16tousand Grain bags are Disappeared in jagtail

జగిత్యాల: ప్రభుత్వ సొమ్ము మాయం కావడం సాధారణం. కాకపోతే ఈసారి జగిత్యాలలో ఏకంగా వేల బస్తాల ప్రభుత్వ ధాన్యం మాయమైంది. స్థానిక మండలంలోని తాటిపల్లి శివారులోని శ్రీ రాజరాజేశ్వర రైస్‌మిల్‌ పై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌ నుంచి వచ్చిన విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ప్రభుత్వ ధాన్యం నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన 22 వేల బస్తాల ధాన్యం మిల్లులో ఉండాల్సింది కానీ.. ప్రస్తుతం మిల్లులో కేవలం 6 వేల బస్తాల ధాన్యం మాత్రమే ఉన్నాయి. కోటి రూపాయల విలువైన 16 వేల బస్తాల ధాన్యం మాయం కావడం పై అధికారులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement