హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో రేపు(గురువారం) డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి బ్లూప్రింట్ ఫోటోలను ఆయన మంత్రిత్వశాఖ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం త్వరలో 8,650 ఇళ్ల నిర్మాణం చేయనుంది. వీటిలో ఒక్కో ఇంటికి రూ.6.81 లక్షల వ్యయం చేయాలని ప్రణాళికలు రచించారు. మొత్తం 17 ప్రాంతాల్లో 9 అంతస్తుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరపనున్నారు.
Elevation designs of 2 BHK flats to be built for poor by govt in Hyderabad. Foundation stone to be laid tomorrow. pic.twitter.com/olDlmvU31K
— Min IT, Telangana (@MinIT_Telangana) December 9, 2015