భానుడి భగభగలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహబూబ్‌నగర్ : భానుడి భగభగలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఒక్కరోజే మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురు వ్యక్తులు వడదెబ్బతో మృతిచెందారు. వివరాల ప్రకారం.. కోడేరు మండలం నాగులపల్లి తండాకు చెందిన రాత్లావత్ బిచ్యు(56) ఉపాధి హామీ పథకంలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం పనులు చేయిస్తుండగా వడదెబ్బకు గురై మృతిచెందాడు.
అదేవిధంగా ధన్వాడ మండలకేంద్రానికి చెందిన ఎం.శ్రీనివాస్(45) వారం రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. చికిత్సపొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందాడు. అలాగే.. అమరచింత జీఎస్‌నగర్‌లో నివాసం ఉంటున్న వాకిటి సవరమ్మ(54) ఆదివారం పనిమీద బయటకు వెళ్లింది. సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో కొడుకులు ఆమెను ఆత్మకూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సానంతరం ఇంటికి తీసుకురాగా ఆరోగ్యపరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందింది.