హైదరాబాద్‌కు రెండు వేలు,సైబరాబాద్‌కు వేయి మంజూరు
హైదరాబాద్: హైదరాబాద్,సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో కొత్తగా మూడు వేల కానిస్టేబుల్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో హైదరాబాద్‌కు రెండు వేలు, సైబరాబాద్‌కు వేయి కేటాయించారు. వీటిలో కొన్ని డ్రైవర్‌ల కోసం కేటాయించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలనే లక్ష్యంతో అందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. అందులో భాగంగా మూడు వేల కొత్త కానిస్టేబుల్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో జారీ చేయనుంది.
ఇవే గాక మరో ఆరువేల కానిస్టేబుల్, ఐదు వందల సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీని కూడా చేపట్టనున్నారు. ఇంకా వివిధ జిల్లాల నుంచి ఎంత మంది పోలీసులు అవసరమవుతారనే విషయమై ఉన్నతాధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 30 శాతం పోస్టులను భర్తీ చేయడంతో పాటు, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లకు మూడువేల కానిస్టేబుల్ పోస్టులను కొత్తగా మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు.
కొత్తగా 3 వేల కానిస్టేబుల్ పోస్టులు
Published Tue, Jul 1 2014 3:19 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM
Advertisement
Advertisement