కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత | 30 ill due to adulterated palm wine | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత

Published Fri, Jul 10 2015 7:57 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

30 ill due to adulterated palm wine

గోపాల్‌పేట (మహబూబ్‌నగర్) : కల్తీ కల్లు తాగి 30మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం బండరావిపాకుల గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బండరావిపాకుల గ్రామంలో రెండు కల్లు దుకాణాల మధ్య పోటీ ఉంది. కాగా గురువారం సాయంత్రం గ్రామంలోని రెండు కల్లు దుకాణాల్లో డైజోఫాం, సీహెచ్ ఎక్కువ మొత్తంలో కలిపి కల్లు తయారు చేశారు. దానిని తాగిన కొద్దిసేపటికే 30 మంది నిద్రలోకి జారుకున్నారు.

అప్పటి నుంచి శుక్రవారం ఉదయం వరకు వారు నిద్రలోనే ఉన్నారు. దీంతో విషయం తెలుసుకున్న సర్పంచ్ 108కి సమాచారం అందించారు. వారు బాధితులను నాగర్‌కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో బాల్‌రెడ్డి, వెంకటమ్మ, లాలమ్మ, బాలమ్మల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారికి నాగర్‌కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎక్సైజ్ ఎస్‌ఐ షాకీర్ అహ్మద్ కల్లు శాంపిళ్లను పరీక్ష కోసం హైదరాబాద్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement