30 వేల క్వింటాళ్ల పత్తి బుగ్గి
జోగిపేట : హాట్ బాక్స్ నుంచి వచ్చిన మెరుగుల కారణంగా మంటలు చెలరేగి సుమారు 30 వేల క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతైంది. దీంతో సుమారు రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ సంఘటన ఆందోల్ మండలంలని ఎర్రారం శివారులో గల వైభవ్ ముర్గ ఆర్గో టెక్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్‌లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేసిన సుమారుగా 30 వేల క్వింటాళ్ల పత్తిని జిన్నింగ్ చేయడానికి వైభవ్ ముర్గ ఆర్గోటెక్ ఇండస్ట్రీస్ ఆవరణలో ఉంచారు. సోమవారం జిన్నింగ్ నడుస్తున్న క్రమంలో హట్ బాక్స్‌లో అనుకోకుండా వచ్చిన మెరుగులు (చిన్న చిన్న రాళ్లు వచ్చినట్లయితే) రావడంతో మంటలు పత్తికి వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ, మంటలు రావడంతో అక్కడ ఏమి జరుగుతుందోనని కూలీలు అంతుపట్టక ప్రాణాలను అరచేత పట్టుకుని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
అయితే జిన్నింగ్‌లోకి పత్తిని నింపుతున్న రెండు ట్రాక్టర్లు, ఓ జేసీబీ మంటల్లో అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ నాగయ్య, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు సిబ్బందితో సంఘట నా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమయంలో మంటలను ఆరే ్పందుకు జిన్నింగ్ మిల్‌లో గల బోరు ద్వారా నీటిని జిమ్ముతూ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాన్ని సిబ్బంది చేశారు. అయితే జోగిపేట ఫైర్ ఇంజన్ సకాలంలో చేరుకున్నా అరగంటలోపే నీరు పూర్తి కావడంతో నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్ ఫైర్ స్టేషన్లకు సమాచారాన్ని అందించారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఫైర్ ఇంజన్లు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. సిబ్బంది ప్లాస్టిక్ బకెట్లు, బిందెలతో మంటలను ఆర్పారు.
సంఘటన స్థలంలో ఎంపీ బీబీ పాటిల్
నారాయణఖేడ్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళుతున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జిన్నింగ్ మిల్లులో ఎగసి పడుతున్న మంటలను చూసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల కోసం అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అప్రమత్తం చేశారు. అనంతరం మిల్లు పార్టనర్ అయిన రంగనాథన్‌తో జరిగిన సంఘటనపై ఎంపీ ఆరా తీశారు. హట్ బాక్స్‌లో పత్తి వెంట చిన్న చిన్న రాళ్లు వచ్చినప్పుడు చిన్న చిన్న మెరుగులు వచ్చి మంటలు వ్యాపించడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన ఎంపీకి వివరించారు. కంపెనీలో 170 మంది వరకు కూలీలు పనిచేస్తుంటారని, అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
ఆందోళన చెందవద్దు
సీసీఐకి పత్తిని విక్రయించి డబ్బులు రాని రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వా రి డబ్బులు ఎక్కడా పోవని ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆయన సంఘటనా స్థలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటనపై తాను కలెక్టర్‌తో మాట్లాడానని, ఎవరికీ నష్టం జరగకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకు ని న్యాయం చేస్తానని తెలిపారు. ఆయన వెంట నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావు షెట్కార్, టీఆర్‌ఎస్ నాయకులు బిడెకన్నె హన్మంతు, అందోలు ఎంపీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి వెంకటేశం, స్థానిక నాయకులు ఆగమయ్య, శ్రీనివాస్ గౌడ్‌లు ఆయన వెంట ఉన్నారు.