తెలంగాణ జట్ల దూకుడు | 60th national Kho-Kho championship matches | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్ల దూకుడు

Published Fri, Oct 10 2014 2:37 AM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM

తెలంగాణ జట్ల దూకుడు - Sakshi

తెలంగాణ జట్ల దూకుడు

హోరాహోరీగా ఖోఖో పోటీలు  
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ మండలం కొత్తపల్లిలోని అల్పోర్స్ ఈటెక్నో పాఠశాలలో జరుగుతున్న 60వ జాతీయ స్థాయి పాఠశాలల అండర్-14 బాలబాలికల ఖోఖో చాంపియన్‌షిప్‌పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలలో భాగంగా రెండో రోజైన గురువారం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు వేళ్లలో పోటీలను నిర్వహించారు. రాత్రి ప్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన మ్యాచ్‌లు ఆద్యంతం ఆసక్తికరంగా, పోటాపోటీగా సాగాయి. ఖోఖో పోటీలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లు విజయపథంలో దూసుకుపోతున్నాయి.

బాలికల విభాగంలో ఉత్తరాఖండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రిష్ణమ్మ అద్వితీయ ప్రతిభ కనబర్చింది. నాలుగు నిమిషాల పాటు రన్నింగ్ చేసి 3 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. సీబీఎస్‌ఈ మ్యాచ్‌లో మేఘన 3.30 నిమిషాల పాటు రన్నింగ్ చేసి 2 పాయింట్లు సాధించి విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. బాలుర విభాగంలో ఉత్తరాఖండ్‌తో మ్యాచ్ ఏకపక్షంగా జరిగింది. ఏకంగా 15 పాయింట్లతో విజయం సాధించింది. శ్రీకాంత్ అద్వితీయ ప్రతిభకనబర్చి 7 నిమిషాల పాటు రన్నింగ్ చేసి 2 పాయింట్లను సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పండిత్ మూడు నిమిషాలు 3 పాయింట్లు, సృజన్, సతీశ్, రంజాన్ రెండు పాయింట్ల చొప్పున సాధించి అలోవకగా విజయాన్ని అందించారు.
 
బాలుర విజేతలు...
గోవాపై ఢిల్లీ 9-8, హిమాచల్‌ప్రదేశ్‌పై పంజాబ్ 11-10, ఉత్తరాఖండ్‌పై ఆంధ్రప్రదేశ్ 10-08, మధ్యప్రదేశ్‌పై ఛండీగఢ్ 11-09, ఆంధ్రప్రదేశ్‌పై 10-02, ఉత్తరాఖండ్‌పై గుజరాత్ 14-2, హర్యానాపై కర్ణాటక 16-5, ఆంధ్రప్రదేశ్‌పై గుజరాత్ 14-12, ఛండీగఢ్‌పై మహారాష్ట్ర 13-12, ఢిల్లీపై ఒడిశా 17-09, అస్సాంపై మధ్యప్రదేశ్ 17-08, తమిళనాడుపై పంజాబ్ 14-11, ఉత్తరాఖండ్‌పై తెలంగాణ 17-02, సీబీఎస్‌ఈపై రాజస్థాన్ 05-01, నవోదయ విద్యా సమితిపై హిమాచల్‌ప్రదేశ్ 16-15, ఛండీగఢ్‌పై విద్యాభారతి 19-15, గోవాపై ఉత్తరప్రదేశ్ 17-07 స్కోరుతో విజయాలు నమోదు చేశాయి.
 
బాలికల విజేతలు...
 నవోదయ విద్యా సమితిపై గుజరాత్ 09-04, తమిళనాడుపై హర్యానా 11-03, మధ్యప్రదేశ్‌పై ఉత్తరాఖండ్ 10-06, సీబీఎస్‌ఈపై ఆంధ్రప్రదేశ్ 10-02, పంజాబ్‌పై కర్ణాటక 11-07, మధ్యప్రదేశ్‌పై హిమాచల్‌ప్రదేశ్ 05-02, ఛండీగఢ్‌పై ఢిల్లీ 06-04, మహారాష్ట్రపై గుజరాత్ 09-05, ఉత్తరప్రదేశ్‌పై హర్యానా 07-02, విద్యాభారతిపై ఆంధ్రప్రదేశ్ 13-08, రాజస్థాన్‌పై తమిళనాడు 08-07, ఉత్తరాఖండ్‌పై తెలంగాణ 10-04, సీబీఎస్‌ఈపై ఒడిశా 11-00, నవోదయ విద్యా సమితిపై మహారాష్ట్ర 10-03 స్కోరు తేడాతో విజయాలు నమోదు చేశాయి.
 
నేడు ఫ్రీ క్వార్టర్స్...
శుక్రవారం ఉదయంతో లీగ్ మ్యాచ్‌లు పూర్తికానుండడంతో సాయంత్రం ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం క్వార్టర్స్ దశ పూర్తికానుందని పేర్కొన్నారు. గురువారం నాటి మ్యాచ్‌లను డీఈవో కె.లింగయ్య, డీటీసీ మీరాప్రసాద్, ఎంవీఐ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిని ఉత్సాహపరిచారు. ఈ పోటీల నిర్వహణలో అబ్జర్వర్ విజయరావు, ఐపీఈ రాంరెడ్డి, అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి రాజేందర్‌కుమార్, టెక్నికల్ కమిటీ చైర్మన్ సదానందం, పీఈటీలు మహేందర్‌రావు, అంతటి శంకరయ్య, సంపత్‌రావు, కృష్ణ, శ్రీనివాస్, రవీందర్, శ్యామ్ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement