ఏడాదిలో రూ.70 కోట్లు తాగేశారు | 70 crores will spent on liquor | Sakshi
Sakshi News home page

ఏడాదిలో రూ.70 కోట్లు తాగేశారు

Published Tue, Jun 30 2015 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

70 crores will spent on liquor

గద్వాల : అక్షరాలా రూ.70 కోట్లు. మద్యం ప్రియులు తాగుడుకు తగలేసిన మొత్తం ఇది. ఆదాయం కోసం ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటోంది ప్రభుత్వం. 2014 జూలై 1 నుంచి 2015 జూన్ 30 వరకు అంటే ఒక్క ఏడాదిలో తాగుడుకు ఇంత వెచ్చించారు. టార్గెట్ల కోసం ఆబ్కారీశాఖ అధికారులే స్వయంగా బెల్టుషాపుల సంసృ్కతిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో తాగునీరు దొరకని గ్రామాల్లో సైతం మద్యం ఏరులై పారుతోంది. ఈ ఏడాదిలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు రూ.70 కోట్ల మేర అమ్మకాలు జరిగాయని తెలిసింది. అనధికారిక లెక్కలైతే ఇది మరికొంత పెరిగి ఉంటుంది.
 
 బేవరీస్ కార్పోరేషన్ లిమిటెడ్ నుంచి గద్వాల నియోజకవర్గంలోని (అయిజతో కలుపుకొని) వివిధ మద్యం దుకాణాలకు ఏడాదిలో రూ.50 నుంచి రూ.55 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. దీనిపై మరో 20 నుంచి 25 శాతం వరకు మార్జిన్‌తో మద్యం ప్రియులకు విక్రయిస్తారు. అంటే మొత్తంమీద సుమారు రూ.70 కోట్ల వరకు మద్యం అమ్మకాలు సాగాయి. ప్రస్తుతం మరో మూడునెలల పాటు మద్యం దుకాణాల లెసైన్స్‌లను పొడగించింది. వచ్చే ఏడాదికి ప్రభుత్వం కొత్త మద్యం పాలసినీ అమలులోకి తీసుకరానుంది. దీని ప్రకారం మద్యం వ్యాపారులకు మరింత లాభం చేకూర్చనుంది. మద్యం దుకాణాల ద్వారా 2014-15లో సుమారు రూ.15 కోట్ల ఆదాయం సమకూరింది. గద్వాల పట్టణంలో ఒక బార్‌తోపాటు ఆరు మద్యం దుకాణాలు, జమ్మిచేడులో రెండు, మల్థకల్, గట్టు, ధరూరు మండలాల్లో ఒకటి, అయిజలో నాలుగు మద్యం దుకాణాలు అధికారికంగా ఉన్నాయి. అయితే వీటి పరిధిలో అనధికారికంగా బెల్టుషాపులు నడుపుతున్నారు. అయినా ఆబ్కారీశాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు.
 
 ఎక్సైజ్‌శాఖ నిర్ణయించిన భారీ లెసైన్స్ ఫీజు బట్టి వ్యాపారం చేయాలంటే దుకాణాల వారికి బెల్టుషాపులు నడపాల్సిందే. నియోజకవర్గంలోని గ్రామాల్లో అనధికార లెక్కల ప్రకారం సుమారు 100 కుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో దుకాణాల్లో సెకెండ్స్ మద్యం విపరీతంగా పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వన్ని అబ్కారీశాఖకు జమకాని ఆదాయం అనే విషయం తెలియక అధికారులు అనధికారికంగా వారికి సహకరిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement