
911 సర్వీస్ రూపొందింది ఇక్కడే!
అమెరికా అత్యవసర సర్వీసుల వ్యవస్థ ‘911’ రూపకల్పనలో కీలకపాత్ర ఎవరిదో మీకు తెలుసా? పోనీ ‘మన మెట్రో’ పొజిషనింగ్‌ను రూపొందించింది ఎవరు?
- హెక్సగన్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ మిశ్రా
సాక్షి, హైదరాబాద్: అమెరికా అత్యవసర సర్వీసుల వ్యవస్థ ‘911’ రూపకల్పనలో కీలకపాత్ర ఎవరిదో మీకు తెలుసా? పోనీ ‘మన మెట్రో’ పొజిషనింగ్‌ను రూపొందించింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం హెక్సగన్ కేపబిలిటీ సెంటర్ ఇండియా! హైదరాబాద్‌లో 28 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ సంస్థ శుక్రవారం తాము అభివృద్ధి చేసిన అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీలను నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ప్రదర్శనకు ఉంచింది.
ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు ప్రభుత్వ అధికారులు ఈ ‘హెచ్‌సీసీఐ ప్రొడక్ట్ ఇన్ఫో డే’ ప్రదర్శన ద్వారా లబ్ధి పొందుతారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ మిశ్రా తెలిపారు. ప్రభుత్వ సేవలను మరింత సమర్థంగా అందించడంతో పాటు నిఘా తదితర అనేక రంగాల్లో ప్రత్యేక టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశామని, మన ‘మెట్రో’ పొజిషనింగ్ ప్రాజెక్టును చేపట్టిందీ తామేనని తెలిపారు.