సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా వొడ్నాల సతీశ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రసుత్తం సతీశ్ వైఎస్సార్‌సీపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.