హైదరాబాద్: హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి స్వైన్‌ఫ్లూ వైరస్ లక్షణాలతో గర్భిణి మృతి చెందింది. నల్లగొండకు చెందిన పర్వీన్ (32) ఆరు నెలల గర్భిణి. ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో నల్లగొండ జిల్లా ఆస్పత్రి వైద్యులు గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో ఈ నెల 5న పర్వీన్‌ను ఆమె కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటినుంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నపర్వీన్ పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది.
ఈ ఏడాది స్వైన్‌ఫ్లూతో గాంధీలో మరణించిన వారి సంఖ్య 32కు చేరింది. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ప్రస్తుతం 27 మంది స్వైన్ ఫ్లూ బాధితులకు, పీఐసీయూలో ఏడుగురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ ఉన్నట్టుగా భావిస్తున్న 44 మంది కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నారు.