
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ నమోదుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 58,10,490 మంది విద్యార్థుల ఆధార్ వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే 467 మండల రీసోర్సు కేంద్రాల్లో (ఎంఆర్‌సీ) ఆధార్ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. తాజాగా మరో 876 ఆధార్ నమోదు బృందాలను అవసరమైన ప్రతి పాఠశాలకు పంపాలని నిర్ణయించింది. ఈ మొబైల్ బృందాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment