సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘వంట గ్యాసు రాయితీ మొత్తాన్ని బ్యాంకు ఖాతా ద్వారా పొందుదాం.. దేశాభివృద్ధికి తోడ్పడదాం..’ అంటూ కేంద్రం అమ లు చేస్తున్న డీబీటీఎల్ (డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఎల్‌పీజీ) పథకం అమలుకు అవరోధాలు ఎదురవుతున్నాయి. రాయితీ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేసేందుకు అమ లు చేస్తున్న ఈ ‘పహల్’ పథకానికి బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్‌లలో పెలైట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు కావాలంటే వంట గ్యాసు వినియోగదారులు ఆధార్ కార్డును, బ్యాంకు ఖాతా వివరాలను సంబంధిత ఎల్పీజీ డీలరుకు సమర్పించాలి.
అలాగే తమ ఆధార్ కార్డును ఖాతా ఉన్న బ్యాంక్‌కు కూడా సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలో అనేక మంది వినియోగదారులకు బ్యాంకు ఖాతాలు లేవు. కొత్తగా ఖాతాలు తెరిచేం దుకు దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళితే జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లు తెరిచేందుకు కొందరు బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజనా పథకం కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లు తెరవాలని కేంద్రం బ్యాంకర్లను ఆదేశిం చినా, జిల్లాలో పలు బ్యాంకులు ఇందుకు ససేమిరా అంటున్నారు.
మేళాలు నిర్వహించి ఖాతాలు తెరవాల్సి ఉండగా, ఒకటి రెండు బ్యాంకులు మొక్కుబడిగా ఈ మేళాల తంతును గతంలోనే ముగించాయి. దీంతో వినియోగదారులందరూ బ్యాంకు ఖాతాల వివరాలు గ్యాసు డీలర్లకు ఇవ్వలేక పోతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రా మాల ప్రజలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జిల్లా లో అనేక మంది వినియోగదారులకు ఆధార్ కార్డులు లేవు. కొందరు నమోదు చేసుకున్నప్పటికి వారికి ఇంకా ఆధార్ కార్డులు చేతికి అందలేదు. దీంతో వారు కేవలం బ్యాంకు ఖా తా వివరాలను మాత్రమే ఎల్పీజీ డీలరుకు అందజేస్తున్నారు.
దగ్గర పడుతున్న గడువు..
పౌర సరఫరాల శాఖ గణాంకాల ప్రకారం పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఆదిలాబాద్ జిల్లాలో 3.72 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోపు ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జిల్లాలో 2.80 లక్షల వినియోగదారులు మాత్రమే తమ బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చారు. ఇంకా సుమారు 92 వేల మంది వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాల్సి ఉంది. అలాగే 42 వేల మంది వినియోగదారుల ఆధార్ కార్డుల అనుసంధానం చేయాల్సి ఉంది.
ఇప్పటివరకు కేవలం 3.30 లక్షల మంది వినియోగదారులు మాత్రమే ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. మిగిలిన కనెక్షన్ల అనుసంధానం ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. హెపీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీఎల్ కంపెనీలకు చెందిన మొత్తం 45 గ్యాస్ డీలర్లు ఉన్నారు. గడవులోగా అనుసంధానం చేసుకోని వినియోగదారులకు మే నెలాఖరు సడలింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
పహల్ పరేషానీ..
Published Tue, Dec 9 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement
Advertisement