
ఇండియాన్ టీవీ.కామ్ వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్న వైఎస్ జగన్. చిత్రంలో పద్మజారెడ్డి తదితరులు
దేశంలో వివిధ టీవీ చానళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలు ఇకపై ఒకే వేదికగా వీక్షించవచ్చు.
ఇండియాన్‌టీవీ.కామ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వివిధ టీవీ చానళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలు ఇకపై ఒకే వేదికగా వీక్షించవచ్చు. ఈ కార్యక్రమాలను అనుసంధానం చేయడానికి రూపొందించిన వెబ్‌సైట్ ఇండియాన్‌టీవీ.కామ్(ఐఎన్‌డీఐఓఎన్‌టీవీ.సీఓఎం)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవార మిక్కడ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైట్ చైర్‌పర్సన్ పద్మజారెడ్డి, మేనే జింగ్ డెరైక్టర్ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
దేశంలోని అనేక టీవీ చానళ్ల ప్రసారాలను తమ వెబ్‌సైట్‌లో అనుసంధానం చే యడం దీని ప్రధాన ఉద్దేశమని ప్రకాశ్ పేర్కొన్నారు. దీనిలోకి వెళితే చానళ్లు ప్రసారం చేసిన కార్యక్రమాలన్నింటినీ వీక్షించే అవకాశం ఉంటుందని వివరించారు. రాజకీయ వార్తలు, విశ్లేషణలు, ఆరోగ్యం, సాహిత్యం, భక్తి, వంటలకు సంబంధించిన అంశాలన్నింటినీ ఒకే వేదికగా ఈ వెబ్‌సైట్ ద్వారా అనుసంధానం చేసి ఒక ప్రత్యేకమైన శైలిలో రూపొందించామని ఆయన పేర్కొన్నారు.