అల్లాదుర్గం: వ్యవసాయ శాఖ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి, ఏడీఏను నియమించిన రెండు రోజులకే కార్యాలయాన్ని ఎత్తి వేశారంటూ రైతులు ఆందోళనకు దిగారు. వివరాలివీ...మెదక్ జిల్లా అల్లాదుర్గంను వ్యవసాయ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ఈనెల 2వ తేదీన వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అల్లాదుర్గం ఏడీఏగా మాధవిని నియమించారు కూడా. కార్యాలయ భవనం కోసం ఆ శాఖ అధికారులు అల్లాదుర్గంలో వెతకడం మొదలు పెట్టారు. ఇలా రెండు రోజులు గడవక ముందే అల్లాదుర్గం డివిజన్‌ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. శుక్రవారం విషయం తెలుసుకున్న రైతులు అగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్-అకోలా రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింప చేశారు. అనంతరం రైతులు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహశీల్దార్ చక్రవర్తికి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించాలని లేకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.
‘రెండు రోజులకే ఎత్తివేస్తారా’
Published Fri, May 13 2016 4:55 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement