బ్యాంకు మిత్ర ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణి | Allied Bank issued under the pensions | Sakshi
Sakshi News home page

బ్యాంకు మిత్ర ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణి

Published Sat, Jul 16 2016 6:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

బ్యాంకు మిత్ర ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణి

బ్యాంకు మిత్ర ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణి

పాపన్నపేట: పింఛన్ లబ్దిదారులకు బ్యాంకుమిత్ర ద్వారా గ్రామాల్లోనే పింఛన్ డబ్బులు అందజేస్తామని యూసుఫ్‌పేట బ్యాంకు మేనేజర్ వేదకుమార్ తెలిపారు. శనివారం మండలంలోని కుర్తివాడలో గ్రామీణ వికాస్ ఆధ్వర్యంలో బ్యాంకు మిత్ర అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా యూసుఫ్‌పేట గ్రామీణ బ్యాంకు మేనేజర్ వేదకుమార్ మాట్లాడుతూ వివిధ రకాల పింఛన్లను బ్యాంకు మిత్రల ద్వారా గ్రామాల్లోనే పింఛన్ డబ్బులు అందించే సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

యూసుఫ్‌పేట గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో యూసుఫ్‌పేటతోపాటు అన్నారం, నాగ్సాన్‌పల్లి, కుర్తివాడలలో ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. వివిధ రకాల పింఛన్ లబ్దిదారులు బ్యాంకుల చుట్టు తిరుగకుండా బ్యాంకుమిత్ర ద్వారా పింఛన్ డబ్బులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కుర్తివాడ సర్పంచ్ రామాగౌడ్, ఎంపీటీసీ లక్ష్మిశివకుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ మునిరొద్దీన్‌తోపాటు కుర్తివాడ గ్రామస్తులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement