
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ పగ్గాలు చేపట్టనున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేస్తున్న వీసీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం 38 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించింది. ఇందులో సీనియర్ అధికారులతోపాటు పలు జిల్లాల ఎస్పీలు ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.