మరో సిమెంట్ కర్మాగారం | Another cement factory sactioned | Sakshi
Sakshi News home page

మరో సిమెంట్ కర్మాగారం

Published Sun, Oct 5 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

Another cement factory sactioned

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రపంచంలో అత్యున్నత పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు మరో భారీ సిమెంట్ ఉత్పత్తి కర్మాగారం రానుంది. ఇప్పటికే బిర్లా గ్రూపునకు చెందిన ఓరియంట్ సిమెంట్ ప్లాంటు కాసిపేట మండలం దేవాపూర్‌లో ఉంది. అలాగే ఏసీసీ సిమెంట్ కంపెనీ మంచిర్యాల శివారులో ఉంది. వీటి సరసన మరో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కూడా సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాన్ని నెలకొల్పే యోచనలో ఉంది. ఇందుకోసం అవసరమైన లెసైన్సులను రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి 2012లోనే ఆ కంపెనీ పొందినప్పటికీ.. గత కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కా రు నుంచి ఆశించిన మేరకు ప్రోత్సాహం లభిం చలేదు.

దీంతో ఈ ప్రాజెక్టుకు అప్పట్లో బ్రేక్ పడింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నూత న పారిశ్రామిక విధానం ప్రకటించనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. అపారమైన సహజ సంపద ఉన్న జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి అంతంతే. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో వెనుకబడి ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెం ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మూతపడటంతో ఇక్కడ చెప్పుకోదగిన ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న దృష్టి సారిం చారు. ఈ సిమెంట్ కర్మాగారాన్ని నెలకొల్పడం ద్వారా స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని, తద్వారా ఇక్కడి ప్రాంత అభివృద్ధికి బాటలు పడతాయనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను అందించేందుకు కృషి చేస్తున్నారు.

యాపల్‌గూడలో..

ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును ఆదిలాబాద్ మండల పరిధిలోని యాపల్‌గూడ శివారులో నెలకొల్పాలనే యోచనలో ఆ కంపెనీ ఉంది. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన సున్నపురాయి (లైమ్‌స్టోన్) నిక్షేపాలు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్లాంటు ఉత్పత్తిని ప్రారంభిస్తే సుమారు వెయ్యి మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూముల కేటాయింపు ఫైలు ఇప్పటికే జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. కాగా జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన భూములను గుర్తించేందుకు ఇప్పటికే సర్వే నిర్వహించారు. రెవెన్యూ, పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాలను గుర్తించిన విషయం విధితమే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement